తెలంగాణ

telangana

ETV Bharat / state

అప్పుడేమో అలా ఇప్పుడేమో క్యూ కట్టారు - చంద్రబాబు ఇంటికి ఆ అధికారులకు నో ఎంట్రీ - kolli raghuram reddy not allow to meet chandrababu

IPS Officers Not Allowed Chandrababu Home in AP : తెలుగుదేశం అధినేత చంద్రబాబును కలిసేందుకు వచ్చిన కొందరు అధికారులకు నిరాశే మిగిలింది. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం వద్దకు వచ్చిన ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ పీఎస్‌ఆర్‌ ఆంజనేయులును పోలీసులు అడ్డుకున్నారు. ఎన్నికల విధుల్లో అవకతవకలకు పాల్పడ్డారని పీఎస్‌ఆర్‌ ఆంజనేయులను ఈసీ తప్పించింది. అదే విధంగా మరో సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి కొల్లి రఘురామిరెడ్డికి సైతం అనుమతి నిరాకరించారు. చంద్రబాబుపై అక్రమ కేసుల నమోదులో కీలకంగా వ్యవహరించిన సంజయ్​ని కానిస్టేబుళ్లు వెనక్కి పంపించేశారు.

IPS Officers Not Allowed Chandrababu Home
IPS Officers Not Allowed Chandrababu Home (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jun 6, 2024, 2:09 PM IST

Updated : Jun 6, 2024, 2:16 PM IST

Kolli Raghuram Reddy and PSR Anjaneyulu Not Allowed in AP :ఏపీలో తెలుగుదేశం అధినేత చంద్రబాబును కలిసేందుకు ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్​ఆర్ ఆంజనేయులు విఫలయత్నం చేశారు. చంద్రబాబును కలిసేందుకు ఉండవల్లి నివాసానికి రాగా ఆయనకు అనుమతి లభించలేదు. చంద్రబాబును కలిసేందుకు ఈ రోజు ఉదయం ఉండవల్లి నివాసానికి పీఎస్సార్ ఆంజనేయులు వచ్చారు.

ఎన్నికల విధుల్లో అవకతవకలకు పాల్పడ్డారని పీఎస్సార్ ఆంజనేయులుని ఈసీ తప్పించింది. ఈసీ ఎన్నికల విధులు నుంచి తప్పించాక కూడా అనధికారికంగా కూడా వైఎస్సార్సీపీ కోసం ఆంజనేయులు పనిచేశారని ఆరోపణలు ఉన్నాయి. దీంతో ప్రధాన గేటు వద్దే కానిస్టేబుళ్లు పీఎస్సార్ ఆంజనేయులు కారు ఆపిలోనికి అనుమతి లేదని చెప్పారు. దీంతో ఆంజనేయులు చంద్రబాబు నివాసం దగ్గర నుంచి వెనుదిరిగి వెళ్లిపోయారు.

టీడీపీ 135 - జనసేన 21 - బీజేపీ - 8 - ఏపీలో 164 సీట్లతో కూటమి సునామీ - AP Election Results 2024

IPS KOLLI RAGHURAM REDDY NOT ALLOWED: అదే విధంగా మరో సీనియర్ ఐపీఎస్ అధికారి కొల్లి రఘురామిరెడ్డికి సైతం అనుమతి నిరాకరించారు. నంద్యాలలో చంద్రబాబు అరెస్టు సమయంలో కొల్లి రఘురామిరెడ్డి కీలకంగా వ్యవహరించారు. ఎన్ఎస్​జీ నిబంధనలకు విరుద్ధంగా చంద్రబాబు నిద్రిస్తున్న బస్సు తలుపు డోరు కొల్లి రఘురామిరెడ్డి కొట్టారు. ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి విధేయుడుగా ఉన్నారని కొల్లి రాఘురామిరెడ్డిపై ఈసీ కొరడా ఝులిపించింది.

అన్ని శాఖల నుంచి తప్పిస్తూ డీజీ ఆఫీస్​లో రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. మర్యాద పూర్వక భేటీ పేరుతో కొల్లిరఘురామరెడ్డి చంద్రబాబును కలిసేందుకు యత్నించగా అనుమతి నిరాకరించారు. తెలుగుదేశం నేతలు కొల్లిరఘురామరెడ్డికి అనుమతి ఇచ్చే సమస్యే లేదని తేల్చిచెప్పారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఆరోపణలు ఎదుర్కొన్న, అతిగా వ్యవహరించిన అధికారుల పట్ల చంద్రబాబు చాలా స్పష్టంగా ఉన్నారని తెలుగుదేశం నేతలు చెబుతున్నారు.

స్వ‌చ్ఛ‌రాజ‌కీయాల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్ - ప్ర‌జ‌ల మ‌నిషిగా ఎదిగిన నారా లోకేశ్ - Nara Lokesh Inspirational Journey

CID Chief Sanjay to Meet Chandrababu : ముందస్తు అనుమతి లేకుండా చంద్రబాబుని కలిసేందుకు మరో సీనియర్ ఐపీఎస్ అధికారి, సీఐడీ చీఫ్ సంజయ్ యత్నించారు. కరకట్ట గేటు వద్దే సంజయ్ కారుని ఆపిన కానిస్టేబుళ్లు వెనక్కి పంపేశారు. చంద్రబాబుపై అక్రమ కేసులు నమోదులో కీలకంగా సంజయ్ వ్యవహరించారు. ఎన్నికల ఫలితాలు రాగానే విదేశాలకు వెళ్లేందుకు సెలవు సైతం పెట్టారు. సంజయ్ సెలవు అనుమతి కూడా రద్దయినట్లు సమాచారం. మర్యాదపూర్వక భేటీ పేరుతో సంజయ్ చంద్రబాబు నివాసానికి వచ్చారు. సంజయ్ వచ్చిన విషయాన్ని గేటు సిబ్బంది పైఅధికారులకు చెప్పారు. అనుమతి లేదని స్పష్టమైన ఆదేశాలు రావటంతో ట్రాఫిక్​కు అడ్డంగా ఉన్న సంజయ్ కారుని కానిస్టేబుళ్లు బలవంతంగా, వేగంగా వెనక్కి పంపేశారు.

మేము ఎన్డీఏ కూటమితోనే ఉన్నాం - చంద్రబాబు క్లారిటీ - CHANDRABABU PRESS MEET TODAY

Last Updated : Jun 6, 2024, 2:16 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details