ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కలుషిత నీటి కారణంగా 'కోలుకోని ఇప్పటం' - తాగు నీటి సౌకర్యం కల్పించకుండా వేధిస్తున్న వైసీపీ సర్కార్​ - Ippatam Village Suffering Diseases

Ippatam Village People Suffering Diseases due to Polluted Water in Guntur District : ఇప్పటం గ్రామంలో వారం రోజులుగా అంతుపట్టని కీళ్లవాపులు, నొప్పులు తగ్గుముఖం పట్టకపోవడంతో బాధితులు ఇంకా కోలుకోలేదు. 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల లోపు వారు కాలు కింద పెట్టలేని దయనీయ పరిస్థితి ఎదుర్కొంటున్నారు. వ్యవసాయ పనులకు పూర్తిగా దూరమై, పేద, మధ్య తరగతి వర్గాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ippatam_village
ippatam_village

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 8, 2024, 12:40 PM IST

Ippatam Village People Suffering Diseases due to Polluted Water in Guntur District :సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్ నివాసం ఉంటున్న తాడేపల్లి మండలంలోని ప్రజలు కలుషిత నీటితో తీవ్ర అవస్థలు పడుతున్నారు. మండలంలోని ఓ గ్రామంలో ఏ ఇంటిని కదలించిన జ్వరపీడుతులు, ఒళ్లు నొప్పులతో ప్రజలు బాధపడుతున్నారు. ముఖ్యమంత్రి నివాసం కూతవేటు దూరంలోనే ఉన్నా రక్షిత నీరు అందించడంలో అధికారులు, పాలకులు కక్ష్యపూరితంగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా ఇంటికో బాధితుడు రోగాల బారిన పడుతున్నారు.

కలరా వ్యాధికి దారితీసిన కలుషిత నీరు - గుంటూరులో ఇద్దరికి సోకిన వ్యాధి

Gunter District : 'ఇప్పటం' గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలోని ఈ గ్రామం పేరు చెప్పగానే జగన్‌ సర్కార్‌ కక్షలే గుర్తుకొస్తాయి. జనసేన ఆవిర్భావ సభకు స్థలం ఇచ్చారనే కారణంతో ప్రభుత్వం ఈ గ్రామంపై కక్ష కట్టింది. రహదారుల విస్తరణ పేరుతో ఇళ్ల ప్రహరీలను కూల్చేసింది. నాడు ప్రభుత్వం ప్రదర్శించిన కక్ష సాధింపు చర్యల ఫలితాన్ని ఆ గ్రామ ప్రజలు ఇప్పటికీ అనుభవిస్తున్నారు. రహదారుల విస్తరణ పేరుతో ఇళ్ల ప్రహరీలను, మురుగునీటి కాలువలను ధ్వంసం చేశారు. దీంతో కలుషిత నీరు తాగునీటి పైప్ లైన్లలో కలిసిపోయి ప్రజలు అనారోగ్యం భారీన పడుతున్నారు. ఆ నీరు తాగడం వల్ల చర్మంపై దద్దుర్లు సహా తీవ్ర కాళ్ల నొప్పులతో నరకయాతన అనుభవిస్తున్నారు.

అతిసార బాధితులని పరామర్శించిన జనసేన నేత నాదెండ్ల మనోహర్ - ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు

ఇళ్ల ప్రహరీలను కూల్చేయడం, సైడ్​ కాల్వ నిర్మాణం చేపట్టకపోవడంతో వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరొకరి సాయం లేకుండా అడుగు తీసి అడుగు వేయలేకపోతున్నారు. బయటకు వెళ్లి వైద్యం చేయించుకుందామంటే కాలువ దాటలేకపోతున్నారు. తమను ఆదుకోవాలని అధికారుల చుట్టూ తిరుగుతున్నా కనికరం చూపడం లేదని వాపోతున్నారు. ప్రజల సొమ్మును ఆర్భాటాల కోసం ఖర్చు చేస్తున్న ప్రభుత్వం ఆ నిధులతో తాగునీటి సౌకర్యం కల్పించకుండా ప్రభుత్వం ఇంకా తమపై కక్ష పూరితంగానే వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కలుషిత నీటి అంశంపై అధికారుల చర్యలు - ఆరుగురు సస్పెండ్​, ఇద్దరికి షోకాజ్​ నోటీసులు

ప్రజల సమస్యలను తెలుసుకున్న మంగళగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నారా లోకేష్ వెంటనే ఉచిత వైద్య రథాన్ని పంపించారు. గ్రామంలో అందరికీ వైద్య పరీక్షలు నిర్వహించారు. రక్తనమూనాలను సేకరించారు. జ్వరంతో బాధపడుతున్న వారికి మందులు ఇచ్చారు. నగరపాలక సంస్థ అధికారులు గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. గ్రామంలో ఇప్పటివరకు కేవలం 28 మంది మాత్రమే జ్వరంతో బాధపడుతున్నారని వైద్యులు చెబుతున్నారు. ఇప్పటివరకు సేకరించిన రక్త నమూనాలలో మలేరియా, డెంగ్యూ లక్షణాలు లేవని నిర్ధారించారు.

ముఖ్యమంత్రి జగన్ నివాసం ఉంటున్న తాడేపల్లి మండలంలోని ప్రజలకే ఈ పరిస్థితి దాపరిస్తే, ఇక మిగిలిన వారి పరిస్థితి ఏంటని టీడీపీ, జనసేన నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details