IPL Betting Racket Busted in Hyderabad2024 : ఐపీఎల్ సీజన్ సందర్భంగా పందెం రాయుళ్లు కోట్ల రూపాయల్లో ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. సైబరాబాద్ పరిధిలో 24గంటల్లోనే 5ముఠాలకు చెందిన 15 మందిని అరెస్ట్ చేసి వారి నుంచి రూ.2కోట్ల 41లక్షల నగదు, ఆన్లైన్లో బెట్టింగ్ నిర్వహించేందుకు వినియోగించే పరికరాలు, చరవాణులను స్వాధీనం చేసుకున్నారు. 57బ్యాంకు ఖాతాల్లోని నగదు, 8 యూపీఐ నంబర్లను ఫ్రీజ్ చేశారు. నిలుపుదల చేసిన నగదు, సామగ్రి విలువ రూ.3కోట్ల 29లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. నిందితులపై గేమింగ్ యాక్ట్ సహా ఇతర సెక్షన్లపై కేసు నమోదు చేసి దర్యాప్తు నిమిత్తం సంబంధిత పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు.
Cricket Betting in Hyderabad :బెట్టింగ్ నిర్వహిస్తున్నారన్న సమాచారంతో కూకట్పల్లి బాలాజీనగర్‌కు చెందిన పొందూరి సురేశ్‌ను అరెస్ట్ చేసిన శంషాబాద్ ఎస్ఓటీ పోలీసులు నిందితుడిచ్చిన సమాచారంతో వికారాబాద్‌కు చెందిన రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేశారు. మరో కీలక నిందితుడు పరారీలో ఉన్నాడు. మ్యాచ్ సమయంలో వివిధ బెట్టింగ్ వెబ్సైట్ల(Online Cricket Betting) ద్వారా కోట్ల రూపాయల బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
నిందితుల నుంచి రూ.80 లక్షల నగదు, రూ.2 లక్షల విలువైన బెట్టింగ్ సామగ్రి, ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. మరో కేసులో దుండిగల్ పోలీసులు, శంషాబాద్ ఎస్ఓటీ పోలీసులు దుండిగల్ మల్లంపేటలోని ఓ అపార్ట్మెంట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారన్న సమాచారంతో సోదాలు జరిపి నలుగురిని అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.1,21,000 నగదు, రూ.4,85,000 విలువ చేసే బెట్టింగ్ సామగ్రి స్వాధీనం చేసుకున్నారు.
మహాదేవ్ బెట్టింగ్ యాప్ యజమాని దుబాయ్‌లో అరెస్ట్- త్వరలో భారత్‌కు!