తెలంగాణ

telangana

ETV Bharat / state

'నాన్న కలను నెరవేరుస్తున్నా - ఇష్టంతో బాధ్యతలు నిర్వహిస్తున్న'

ఎల్ల ఫుడ్స్​పై ప్రముఖ వ్యాపారవేత్త కృష్ణ ఎల్ల కుమార్తె జలచరి ఇంటర్య్వూ - ప్రజల ఆరోగ్యం, దేశ ఆర్థిక పరిస్థితి కారణంగా ఈ రంగంలోకి అడుగులు

Interview With Krishna Ella Daughter Jalachari
Interview With Krishna Ella Daughter Jalachari (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : 5 hours ago

Interview With Krishna Ella Daughter Jalachari :ఆహారంలోని రసాయనాలు ఆరోగ్యాన్నే కాదు, దేశ ఆర్థిక వ్యవస్థనీ కుదేలు చేస్తుంది. అందుకే దానికి పరిష్కారం చూపించాలి అనుకున్నారు డా.జలచరి. భారత్‌ బయెటెక్‌ వ్యవస్థాపకులు కృష్ణ ఎల్ల, సుచిత్రల కుమార్తె ఆమె. డెర్మటాలజిస్ట్‌, దేశంలోనే తొలి జంతు వ్యాక్సిన్‌ సంస్థ ‘బయోవెట్‌’ నిర్వాహకురాలు, అనామయ్‌ బయోటెక్‌ డైరెక్టర్‌, ఇంకా ఎన్నో హోదాల్లో తనెేంటో నిరూపించుకున్నారు. నాన్న కలగన్నట్లు ‘ఎల్ల ఫుడ్స్‌’ని ఇంటర్నేషనల్ రేంజ్‌కి తీసుకెళ్లానంటున్నారు.

అమ్మానాన్నలు అమెరికా నుంచి తిరిగొచ్చి భారత్‌లో టీకా సంస్థ స్థాపించాలనుకున్నారని, అప్పటికి తనకు పదకొండేళ్లు, తమ్ముడు రేచస్‌కి ఆరేళ్లని తెలిపారు. ఆ పరిశోధనలు, ప్రయోగాల గురించి అమ్మానాన్నలు మాట్లాడుకుంటుంటే తమకు ఆసక్తిగా అనిపించేవని అందుకే, చిన్నప్పుడే సైన్స్‌ రంగంలోనే తన కేరీర్‌ను నిర్మించుకోవాలని నిర్ణయించుకున్నట్లు వివరించారు. ముందు వెటర్నరీ డాక్టర్‌ను అవ్వాలని అనుకున్నట్లు చెప్పిన ఆమె, తర్వాత మనసు డెర్మటాలజీ వైపు మళ్లి దానిలో ఎండీ చేసినట్లు తెలిపారు.

'ఈ రోజుల్లో ప్రతి ఒక్కరిదీ సంక్లిష్ట జీవనశైలే! అంతెందుకు, నేనూ ఎన్నో బాధ్యతలు నిర్వర్తిస్తున్నా. కానీ వృత్తినీ, జీవితాన్నీ సమన్వయం చేసుకోవాలంటే మల్టీ టాస్కింగ్‌ తప్పనిసరి. ఈ క్రమంలో కొన్నిసార్లు ఇష్టమైనవీ త్యాగం చేయాలి. తీరిక సమయాల్లో వాటిని ఆస్వాదించాలి. నేను చేస్తోంది అదే! కాబట్టే, ఏదో కోల్పోతున్నానన్న భావన ఉండదు. మా వారు ఆదిత్య లివర్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ సర్జన్‌. మాకో అబ్బాయి కేశవ్‌. ఐదో తరగతి చదువుతున్నాడు.' అని జలచరి పలు విషయాలు పంచుకున్నారు.

ఐవీఎంఏ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన భారత్ బయోటెక్ ఛైర్మన్‌ కృష్ణ ఎల్ల - IVMA President krishna ella

అలా నా ప్రయాణం మొదలైంది : సొంత క్లినిక్‌ ప్రారంభించాలనుకున్నప్పుడు తన తండ్రి భారత్‌ బయోటెక్‌లోని ‘బయో-థెరప్యూటిక్‌’ విభాగ బాధ్యతలు తీసుకోమన్నారని, అదీ డెర్మటాలజీకి సంబంధించిందేనని చెప్పారు. అదే తరవాత ‘అనామయ్‌ బయోటెక్‌’గా రూపాంతరం చెందిందని గుర్తు చేశారు. దీని ద్వారా చర్మానికి సంబంధించి పిల్లలు, పెద్దవాళ్లకు ఎన్నో ఉత్పత్తులు తీసుకొచ్చామన్నా ఆమె, వారి ఉత్పత్తులు 11 దేశాలకు ఎగుమతి అవుతున్నాయని తెలిపారు.

వారి దగ్గర నుంచి చాలా నేర్చుకున్నా : 'బయోవెట్‌' జంతువుల వ్యాక్సిన్‌ సంస్థ. దేశంలోనే ఇది మొదటి, ప్రపంచంలో రెండో స్థానంలో ఉన్నట్లు జలచరి తెలిపారు. బెంగళూరులో ప్రారంభించిన దీని బాధ్యతలూ తానే చూస్తున్నట్లు చెప్పారు. కొవిడ్‌ సమయంలో ‘కొవాగ్జిన్‌’ తయారీలో ఈ సంస్థదీ కీలక పాత్రే అన్న ఆమె, నిజానికి వ్యాక్సిన్‌ పంపిణీ బాధ్యతలూ తనే తీసుకున్నట్లు వివరించారు. కీలక సమయంలో పరిమితంగా ఉన్నవాటి పంపిణీ బాధ్యత కష్టమే అని ఆ రోజులను గుర్తుకు చేసుకున్నారు. మేనేజ్‌మెంట్‌ డిగ్రీలు లేకపోయినా, చుట్టూ పరిస్థితులను పరిశీలిస్తూ మెంటార్లు, సీనియర్ల దగ్గర నేర్చుకుంటూ ఆ బాధ్యతని నిర్వహించినట్లు తెలిపారు. విమర్శకుల ప్రశంసల్నీ అందుకున్నానని ఆనందం వ్యక్తం చేశారు. అయితే ఇందుకు ఓపిక, అంగీకరించే మనస్తత్వం అవసరమని చెప్పారు.

ఇలా చేస్తే దేశం పరిస్థితి కష్టమే :ఆరోగ్యం నుంచి ఆహారాన్ని వేరు చేయలేము. అందుకే ‘ఎల్ల ఫుడ్స్‌’ ప్రారంభించామని, ఇది నిజానికి నాన్న కృష్ణ ఎల్ల కల అని తెలిపారు. 2019లోనే తీసుకొచ్చినా, కొవాగ్జిన్‌ తయారీలో తీరిక లేక పక్కనపెట్టారని, ఇప్పుడు తిరిగి దానిపై దృష్టి పెట్టినట్లు వివరించారు. తన నాన్నది వ్యవసాయ కుటుంబం కావడంతో రైతుల సమస్యలు తెలుసని, ఆరుగాలం కష్టపడినా శ్రమకు తగ్గ రాబడి రావడం లేదని గుర్తించారని తెలిపారు. అంతెందుకు, సుగంధ ద్రవ్యాల ఎగుమతుల్లో భారత్‌దే అగ్రస్థానమని కానీ రసాయనాలు, సూక్ష్మజీవుల అవశేషాలు ఉన్నాయని చాలాసార్లు తిరస్కరణకు గురవుతుంటాయని వెల్లడించారు.

సాగు, స్టోరేజ్, ప్రాసెసింగ్, ప్యాకేజింగ్‌ ఇలా ప్రతిచోటా అవి కలుషితమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది అనారోగ్యాలకు దారి తీయడమే కాకుండా, దేశ ఆర్థిక వ్యవస్థనీ దెబ్బతీస్తాయని వివరించారు. అందుకే కలుషిత రహిత, సహజ పద్ధతుల్లో పులియబెట్టిన పోషకాహారాన్ని అందిస్తూ దేశీ ఉత్పత్తులకు డిమాండ్‌ పెంచాలనుకున్నట్లు పేర్కొన్నారు. ఫలితమే ఎల్ల ఫుడ్స్‌ అని అన్నారు. ఈ సంస్థ బాధ్యతా తానే తీసుకున్నానని తెలిపారు. ఆరోగ్యాన్నిచ్చే విటమిన్‌ డి, ప్రోబయాటిక్‌ ఆహారాలను క్రయోజనిక్, గామా స్టెరిలైజేషన్‌ విధానాల్లో తయారు చేస్తున్నట్లు చెప్పారు.

"మసాలాలు, చిరు ధాన్యాలతో చేసిన రెడీ టూ ఈట్‌ ఉత్పత్తులు, బేవరేజెస్, లో సోడియం స్నాక్స్‌ వంటి వాటితో పాటు బంగినపల్లి, నీలం, చిన్న రసాలు, పెద్ద రసాలు లాంటి మామిడి రకాలనీ ఎగుమతి చేస్తున్నాం. పలు కార్పొరేట్‌ సంస్థలు, క్యాంటీన్లు, ఆసుపత్రులు, విద్యా సంస్థలు, స్టార్‌ హోటళ్లు, ఎయిర్‌ ఇండియా వంటి సంస్థలకూ అందిస్తున్నాం. కర్ణాటకలోని మలూరులో మా ప్రొడక్షన్‌ సెంటర్‌ ఉంది. తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల రైతుల నుంచే పంట సేకరిస్తున్నాం. ఇందుకోసం వాళ్లకి సాగుపరంగా అవసరమైన శిక్షణనీ ఇస్తున్నాం. ఆ ప్రమాణాలను పాటిస్తుండటంతో వారికీ గిట్టుబాటు పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఎల్ల ఫుడ్స్‌కి 160కి పైగా రిటైల్‌ అవుట్‌లెట్స్‌ ఉన్నాయి ". - డా.జలచరి, కృష్ణా ఎల్ల కూమార్తె

భారత్​ బయోటెక్ ఎగ్జిక్యూటివ్​ ఛైర్మన్​ కృష్ణ ఎల్లాకు అరుదైన గౌరవం - వరించిన డీన్స్​ మెడల్

ఆవిష్కరణల గురించి తరగతి గదుల్లో బోధించరు - యువతే సొంతంగా ఆలోచించాలి : కృష్ణ ఎల్లా

ABOUT THE AUTHOR

...view details