ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అలర్ట్​ - బంగాళాఖాతంలో అల్పపీడనం - ఉత్తరాంధ్రలో రెండ్రోజులు భారీ వర్షాలు - RAIN ALERT IN AP

బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా ఏర్పడే అవకాశం - ఏపీ, తమిళనాడుకు భారీ వర్షాల ముప్పు

Rain Alert in AP
Rain Alert in AP (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 17, 2024, 8:50 AM IST

Rain Alert in AP :ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలకు మరో ముప్పు పొంచి ఉంది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోంది. ప్రస్తుతం ఇది సముద్ర మట్టానికి 5.8 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉందని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది. రానున్న 2 రోజుల్లో ఇది మరింత బలపడి పశ్చిమ వాయువ్య దిశగా తమిళనాడు తీరం వైపు కదిలే అవకాశం ఉందని తెలియచేసింది. దీని ప్రభావంతో రానున్న రెండు రోజులు ఉత్తరాంధ్రలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది.

విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో కొన్ని ప్రాంతాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. ఈ నెల 18, 19 తేదీల్లో శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, నెల్లూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు నమోదు అయ్యే అవకాశం ఉన్నట్టు తెలిపింది.

ఈనెల 19 తేదీన పార్వతీపురం మన్యం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా మరియు నెల్లూరు జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది. రైతులు వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తు నిర్వహణా సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు రాష్టంలో రాత్రిపూట ఉష్ణోగ్రతలు కనిష్టానికి చేరాయి. రాష్ట్రవ్యాప్తంగా రాత్రిపూట సగటు ఉష్ణోగ్రతలు 16 నుంచి 20 డిగ్రీల మధ్య నమోదు అవుతున్నట్టు వాతావరణశాఖ తెలిపింది.

వాతావరణ శాఖ అలర్ట్​ల గురించి తెలుసా? - ఏ అలర్ట్​ ఇస్తే ఏం జరుగుతుందంటే!

అల్పపీడనం ఎఫెక్ట్ - మూడు రోజులు దక్షిణ కోస్తాంధ్రాకు భారీ వర్ష సూచన

ABOUT THE AUTHOR

...view details