IMD Monsoon Prediction in Telangana 2024 : రాష్ట్రంలో గతేడాది సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదైంది. దీంతో తాగు, సాగు నీటికి కటకట పరిస్థితులు నెలకొన్నాయి. దీనికి తోడు పంటలకు, నేలకు తేమను ఇచ్చే వర్షాలు (Rains in Telangana) అతి తక్కువగా పడటంతో భూగర్భ జలాలు అడుగంటాయి. తక్కువ వర్షాలు, వాటి మధ్య భారీ అంతరంతో తెలంగాణలో క్షామ పరిస్థితులు తలెత్తాయి. ఈ తరుణంలో ఈ సంవత్సరం వాతావరణ శాఖ తెలంగాణకు గుడ్ న్యూస్ చెప్పింది.
రానున్న వానాకాలంలో తెలంగాణ అంతటా సాధారణ వర్షపాతం మించి అధిక వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. ముఖ్యంగా తూర్పు తెలంగాణ జిల్లాలైన ఉమ్మడి జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, ములుగు, వరంగల్, హనుమకొండతోపాటు సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లోని కొంత భాగంలో అధిక వర్షపాతం నమోదవుతుందని పేర్కొంది. ఈ మేరకు జూన్- సెప్టెంబరు నెలల మధ్య వర్షాల ప్రభావంపై మంగళవారం హైదరాబాద్ వాతావరణ శాఖ నివేదిక విడుదల చేసింది.
తెలంగాణపై అలకబూనిన వర్షం - 305 రోజుల్లో వాన కురిసింది 66 రోజులే - low rainfall in telangana
Monsoon Forecast in Telangana 2024 :ఎల్ నినో పరిస్థితులు జూన్ నాటికి పూర్తిగా బలహీనపడతాయని వాతావరణ శాఖ నివేదికలో పేర్కొంది. లా నినా పరిస్థితులు జులైలో పుంజుకుంటాయని చెప్పింది. నైరుతి రుతుపవనాలు జూన్ 8, 11వ తేదీల మధ్య తెలంగాణలోకి ప్రవేశిస్తాయని భావిస్తున్నామని తెలిపింది. ఆ వెంటనే వానలు ప్రారంభమై జులైలో భారీ వర్షాలు నమోదవుతాయని వివరించింది. ఆగస్టులో సాధారణ రీతిలో కొనసాగుతూ తిరిగి సెప్టెంబర్‌లో అధికంగా కురుస్తాయని వాతావరణ శాఖ నివేదికలో వెల్లడించింది.