తెలంగాణ

telangana

ETV Bharat / state

తీరం దాటిన వాయుగుండం - ఈ మూడు జిల్లాలకు ఆరెంజ్‌ హెచ్చరికలు - Heavy Rains In Telangana - HEAVY RAINS IN TELANGANA

Heavy Rains In Telangana : బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో నేడు ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. దీంతో ఆ మూడు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది.

Heavy Rains In Telangana Today
Heavy Rains In Telangana (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Sep 9, 2024, 3:46 PM IST

Updated : Sep 9, 2024, 6:57 PM IST

Heavy Rains In Telangana Today : పశ్చిమ - మధ్య పరిసర వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగిన తీవ్ర వాయుగుండం ఇవాళ ఉదయం 10:30 నుంచి 11: 30 సమయంలో పూరీకి సమీపంలో ఒడిశా తీరాన్ని దాటినట్లు హైదారాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ రోజు రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ ఈ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలను జారీ చేసింది.

ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, ములుగు, పెద్దపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. కొన్ని జిల్లాల్లో 30 నుంచి 40 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. దీంతో ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచించారు.

వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా బలపడి కాసేపటి క్రితం పూరీ వద్ద తీరం దాటిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం పూరీకి వాయవ్య దిశగా పయనిస్తోందని, దీని ప్రభావం రాత్రి 7.30 వరకు కొనసాగుతుందని అంచనావేస్తున్నారు. ఛత్తీస్‌గఢ్‌ దిశగా పయనించి క్రమంగా బలహీనపడుతుందని ఐఎండీ పేర్కొంది.

మహబూబాబాద్ జిల్లాలో భారీ వర్షం : మరోవైపు మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తుంది. దీంతో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. సోమవారం ఉదయం నుంచి ముసురుతో కూడిన వర్షం కురుస్తోంది. జిల్లాలోని మున్నేరు, ఆకేరు, పాలేరు, పాకాల, వట్టి వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. పాకాల వాగు వరదకు పొంగి ప్రవహిస్తుండడంతో గార్లమండల కేంద్రం నుంచి రాంపురం, మద్ధివంచ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

డోర్నకల్ మండలం ములకలపల్లి వద్ద ఆకేరు వాగుపై వంతెన, పురుషోత్తమాయ గూడెం వద్ద జాతీయ రహదారి దెబ్బతినడంతో మహబూబాబాద్ నుంచి ఖమ్మం, మరిపెడలకు రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాలకు తీవ్రంగా దెబ్బతిన్న నెల్లికుదురు మండలం రావిరాల గ్రామంలో జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ పర్యటించారు. ఇంటింటికి తిరుగుతూ వరద నష్టాన్ని పరిశీలించారు. వరద బాధితులను ప్రభుత్వపరంగా అన్ని విధాలుగా ఆదుకుంటామని బాధితులకు భరోసానిచ్చారు.

రాష్ట్రంలో రాగల 3 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు! - ఈ జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్‌ హెచ్చరికలు - Heavy Rains In Telangana Today

రాష్ట్రంలో రాగల మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు ! - Heavy Rain Alert to Telangana

Last Updated : Sep 9, 2024, 6:57 PM IST

ABOUT THE AUTHOR

...view details