ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అలర్ట్​ - బంగాళాఖాతంలో మరో వాయు'గండం' - ఏపీలో భారీ వర్షాలు! - RAIN ALERT IN AP

నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం - 12న దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు!

Rain Alert in AP
Rain Alert in AP (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 7, 2024, 7:33 AM IST

Rain Alert in AP :ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలకు మరో ముప్పు పొంచి ఉంది. హిందూ మహాసముద్రం, దానికి ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వాతావరణ శాఖ పేర్కొంది . దీని ప్రభావంతో శనివారం నాటికి దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వివరించింది. ఇది పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ ఈ నెల 12 నాటికి శ్రీలంక, తమిళనాడు తీరాలకు చేరువవుతుందని అంచనా వేస్తోంది.

ఈ ప్రభావంతో తమిళనాడులో 11, 12 తేదీల్లో, 12న దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. అల్పపీడనం ఏర్పడిన తర్వాత దానిపై స్పష్టత వస్తుందని పేర్కొంటున్నారు.

వాతావరణ శాఖ అలర్ట్​ల గురించి తెలుసా? - ఏ అలర్ట్​ ఇస్తే ఏం జరుగుతుందంటే!

ABOUT THE AUTHOR

...view details