ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పుష్పా' ఎర్రచందనమే కాదు - మన శీలావతికీ దేశవ్యాప్త డిమాండ్ - SHILAWATHI CANNABIS FROM AOB

ఏవోబీ నుంచి దేశవ్యాప్తంగా గంజాయి రవాణా - దాడుల్లో దొరికేదంతా శీలావతి రకమే

shilawathi_cannabis_from_aob
shilawathi_cannabis_from_aob (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 5, 2024, 4:13 PM IST

Shilawathi Cannabis from AOB :కొకైన్, హెరాయిన్ తదితర మాదక ద్రవ్యాలు విదేశాల నుంచి మన దేశంలోకి పెద్ద ఎత్తున దిగుమతి అవుతున్నాయి. పట్టుబడుతున్న డ్రగ్స్ ఎక్కువగా పాకిస్థాన్​ నుంచి సముద్ర మార్గంలో రవాణా అవుతుండగా ఈశాన్య రాష్ట్రాల నుంచీ చాపకింద నీరులో దేశమంతటా డ్రగ్స్ విస్తరిస్తున్నాయి. విమానాల ద్వారా సరఫరా అవుతున్న డ్రగ్స్ కస్టమ్స్ దాడుల్లో పట్టుబడుతుండగా అంతర్జాతీయ డ్రగ్స్ మాఫియా సముద్ర మార్గమే సురక్షితమైనదిగా భావిస్తోంది. ఇదిలా ఉంటే భారతదేశానికంతటికీ ఆంధ్రా - ఒడిశా సరిహద్దు నుంచి గంజాయి రవాణా అవుతున్నట్లు ''స్మగ్లింగ్‌ ఇన్‌ ఇండియా-2023-24'' నివేదిక వెల్లడించింది.

దేశ వ్యాప్తంగా వివిధ దర్యాప్తు సంస్థలు జరిపిన దాడుల్లో పట్టుబడిన గంజాయి అత్యధిక శాతం ఏవోబీ (ఆంధ్రా-ఒడిశా బోర్డర్‌) నుంచి అక్రమ రవాణా అయ్యిందేనని సమాచారం. గత ఐదేళ్లలో ప్రభుత్వాలు అనుసరించిన విధానాలు, వ్యవస్థాపూరిత వైఫల్యాలే ఇందుకు కారణమని తెలుస్తోంది. గతేడాది ఏప్రిల్‌ 1 నుంచి 2024 మార్చి 30 కాలానికి సంబంధించి డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (DRI) తాజాగా విడుదల చేసిన నివేదిక ఇదే విషయాన్ని రుజువు చేస్తోంది.

వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో గంజాయి దేశవ్యాప్తంగా ఎంత విస్తృత స్థాయిలో రవాణా అయ్యిందో చెప్పేందుకు ఈ నివేదికే నిదర్శనంగా నిలుస్తోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఆంధ్రా - ఒడిశా సరిహద్దు (AOB)లో సాగయ్యే శీలావతి మేలురకం గంజాయి దేశమంతటికీ రవాణా అవుతోందని సమాచారం. వివిధ దర్యాప్తు సంస్థలు స్వాధీనం చేసుకున్న గంజాయిలో అత్యధిక శాతం అదే రకమని 'స్మగ్లింగ్‌ ఇన్‌ ఇండియా-2023-24' స్పష్టం చేసింది.

ఏకంగా 15 ఎకరాల్లో గంజాయి సాగు - పోలీసులు ఏం చేశారంటే?

గతేడాది నవంబరులో విజయవాడ శివారుల్లో 731 కిలోల గంజాయి పట్టుబడింది. అదే విధంగా నాగ్‌పుర్, జబల్‌పుర్‌ నేషనల్​ హైవేపై 386.29 కిలోలు, బోర్క్‌హెడి టోల్‌ప్లాజా వద్ద ఒకసారి 520 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇదే ప్రాంతంలో మరోసారి జరిపిన దాడుల్లో 975.5 కిలోల గంజాయి లభ్యమైనట్లు సమాచారు. గంజాయి కేసుల్ని విశ్లేషిస్తే.. ఆ సరకుంతా ఏవోబీలో పండించిందేనని తేలింది. ఈశాన్య రాష్ట్రాల పరిధి మినహా మిగతా దేశమంతటా గంజాయి ఎక్కడ పట్టుబడినా మూలాలు ఏవోబీలోనే ఉంటున్నాయట. ఈ నేపథ్యంలో ఏవోబీ నుంచి అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ప్రణాళికలు, దాడులు నిర్వహిస్తున్నట్లు డీఆర్‌ఐ నివేదించింది.

భారత్‌లోకి మాదకద్రవ్యాలు అక్రమ రవాణా మార్గాలివే...

ది డెత్‌ క్రెసెంట్‌ : భారత్‌లోకి హెరాయిన్, ఇతర మాదకద్రవ్యాలు ఆఫ్రికా, గల్ఫ్‌ ప్రాంతాల నుంచి అఫ్గానిస్థాన్, ఇరాన్, పాకిస్థాన్‌ మీదుగా చేరుతున్నాయి. పాకిస్థాన్‌ సరిహద్దు మార్గాలు, సముద్ర మార్గాల మీదుగా దేశంలోకి హెరాయిన్‌ పెద్ద ఎత్తున వస్తోంది.

ది డెత్‌ ట్రయాంగిల్‌ : సింథటిక్‌ డ్రగ్స్, హెరాయిన్‌ వంటి డ్రగ్స్ థాయిలాండ్‌, మయన్మార్, లావోస్ దేశాల నుంచి భారత్‌లోకి రవాణా అవుతున్నాయి. ఈశాన్య రాష్ట్రాల మీదుగా వీటిని తరలిస్తున్నారు. ఈ ప్రాంతమంతా భౌగోళికంగా అత్యంత క్లిష్టమైనది కావడం స్మగ్లర్లకు కలిసివస్తోంది. ఇక దక్షిణ అమెరికా నుంచి ఆఫ్రికా దేశాల మీదుగా భారత్‌లోకి కొకైన్ వస్తోంది. కొకైన్ చేరివేతకు అంతర్జాతీయ స్మగ్లర్లు విమాన ప్రయాణికులను ఎంచుకుంటున్నారు.

దేశంలోని అన్ని ప్రాంతాల్లో సాగవుతున్నదంతా ఒకే రకం గంజాయి కాదు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకం గంజాయి సాగవుతుంది. వీటిలో ప్రధానంగా ఇడుక్కి గోల్డ్, మైసూర్‌ గోల్డ్, మలానా క్రీమ్, శీలావతి రకం గంజాయి అధికంగా సాగు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఎక్కువ డిమాండ్ కలిగిన శీలావతి రకం ఆంధ్రా - ఒడిశా సరిహద్దు ప్రాంతంలో మాత్రమే దొరుకుతుంది. గంజాయిని ప్రాసెసింగ్ చేసి హాష్ ఆయిల్‌ను ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు డీఆర్‌ఐ వెల్లడించింది.

'బాస్.. డబ్బులు తీసుకుని గంజాయి ఇవ్వలేదు!' - "అరకులోయలో మలుపులు తిరిగిన కథ"

విద్యార్థులను దారి మళ్లిస్తున్న భయాలివే - కనిపెట్టుకోకుంటే కన్నీళ్లే!

ABOUT THE AUTHOR

...view details