తెలంగాణ

telangana

ETV Bharat / state

హీరో నాగార్జునకు 'హైడ్రా' షాక్ - మాదాపూర్​లోని ఎన్​ కన్వెన్షన్​ కూల్చివేత - Madhapur N Convention Demolish - MADHAPUR N CONVENTION DEMOLISH

Madhapur N Convention Demolish : జీహెచ్​ఎంసీ పరిధిలో అక్రమ నిర్మాణాల కూల్చివేతే లక్ష్యంగా హైడ్రా పని చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా హీరో నాగార్జునకు చెందిన హైదరాబాద్​లోని మాదాపూర్​ ఎన్​ కన్వెన్షన్​ను హైడ్రా బృందం కూల్చి వేసింది. భారీ పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేత పనులు జరిగాయి.

Madhapur N Convention Demolish
Madhapur N Convention Demolish (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Aug 24, 2024, 8:19 AM IST

Updated : Aug 24, 2024, 2:04 PM IST

Madhapur N Convention Demolished by HYDRA : కబ్జాదారుల వెన్నులో హైడ్రా వణుకు పుట్టిస్తోంది. అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతోంది. ఇవాళ హైదరాబాద్​ మాదాపూర్​లోని ఎన్​ కన్వెన్షన్​ను హైడ్రా కూల్చేసింది. ఉదయం భారీ పోలీసు బందోబస్తు నడుమ కన్వెన్షన్​ దగ్గరకు చేరుకున్న హైడ్రా అధికారుల బృందం, కూల్చివేతలు ప్రారంభించింది. ఈ కన్వెన్షన్​ ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జునకు చెందినదిగా తెలుస్తోంది.

అక్రమంగా నిర్మాణం చేపట్టారని ఆరోపణలు వస్తున్న తుమ్మిడి చెరువు 28 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఇందులో సుమారు మూడున్నర ఎకరాల భూమిని నటుడు నాగార్జున కబ్జా చేసి కట్టడాలను నిర్మించారని ఆరోపణలు ఉన్నాయి. ఈ మేరకు కొద్ది రోజుల క్రితం హైడ్రాకు ఫిర్యాదు అందడంతో నిర్మాణం చేపట్టిన ప్రాంతాన్ని పరిశీలించిన అధికారులు, పలు కోణాల్లో పరిశోధించి తదనుగుణంగా చర్యలు చేపట్టినట్లుగా తెలుస్తోంది.

ఎన్​ కన్వెన్షన్​ను కూల్చివేయాలని హైడ్రాకు మంత్రి కోమటిరెడ్డి లేఖ :ఎన్​ కన్వెన్షన్​పై చర్యలు తీసుకోవాలని హైడ్రా కమిషనర్​కు ఈ నెల 21వ తేదీన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేఖ రాశారు. తుమ్మిడికుంట ఎఫ్​టీఎల్​, బఫర్​ జోన్​లో ఎన్​ కన్వెన్షన్​ ఆక్రమణలను హైడ్రాకు రాసిన లేఖలో మంత్రి కోమటిరెడ్డి వివరించారు. ఈ కన్వెన్షన్​కు సంబంధించిన శాటిలైట్​ ఫొటోలతో సహా ఆధారాలను హైడ్రాకు అందించారు. మంత్రి కోమటిరెడ్డి లేఖపై విచారణ జరిపిన తర్వాతే ఎన్​ కన్వెన్షన్​ కూల్చివేతని హైడ్రా చేపట్టింది.

తుమ్మిడికుంట ఎఫ్​టీఎల్​ మొత్తం విస్తీర్ణం 29.6 ఎకరాలు : తుమ్మిడి కుంట ఎఫ్​టీఎల్​ మొత్తం విస్తీర్ణం 29.6 ఎకరాలుగా ఉందని అధికారులు తెలిపారు. ఎఫ్​టీఎల్​ పరిధిలో 2014లో 2.39 ఎకరాల్లో 19 అక్రమ నిర్మాణాలు చేపట్టారని అన్నారు. 2020లో 4.69 ఎకరాలు ఆక్రమణ జరగగా, ఈసారి 32 నిర్మాణాలు చేపట్టారన్నారు. అయితే తుమ్మిడికుంట బఫర్​ జోన్​ విస్తీర్ణం 10 ఎకరాలుగా ఉంది. 2014లో 2.05 ఎకరాల బఫర్​ జోన్​ ఆక్రమణ కాగా 23 నిర్మాణాలు చేపట్టారు. అదే 2020లో 5.02 ఎకరాల బఫర్​ జోన్​ ఆక్రమణ జరిగ్గా, 81 నిర్మాణాలు చేపట్టారని అధికారు వివరించారు.

హైదరాబాద్​లో అక్రమ నిర్మాణాలు తొలగించేందుకే హైడ్రా :హైదరాబాద్​ పరిధిలో అక్రమ నిర్మాణాలను అడ్డుకునేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రా( హైదరాబాద్​ డిజాస్టర్​ మేనేజ్​మెంట్​ అండ్​ అసెట్​ ప్రొటెక్షన్​ ఏజెన్సీ) తీసుకొచ్చారు. ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలను తొలగించడం, చెరువులను రక్షించడం, విపత్కర పరిస్థితుల్లో నగరానికి అండగా ఉండటం ఈ ఏజెన్సీ ప్రధాన లక్ష్యాలు. ఏజెన్సీ ప్రారంభించిననాటి నుంచి నిత్యం ఏదో ఒకచోట అధికారులు ఆక్రమణలను కూల్చేస్తున్నారు.

గండిపేట చెరువులో అక్రమ నిర్మాణాలపై హైడ్రా పంజా - 20కి పైగా కట్టడాలు ధ్వంసం - Gandipet Illegal Buildings demolish

ఆక్రమణల అడ్డగింత - చెరువుల పునరుజ్జీవనం - హైడ్రా విధులు ఇవే : కమిషనర్ రంగనాథ్ - WHAT ARE HYDRA RESPONSIBILITIES

Last Updated : Aug 24, 2024, 2:04 PM IST

ABOUT THE AUTHOR

...view details