Hydra To Remove Trees Causing Traffic Jam :హైదరాబాద్ నగర సమస్యలపై ఫోకస్ చేసిన హైడ్రా లిస్టును రెడీ చేసుకుంది. మొదటగా ట్రాఫిక్, డ్రైనేజీ వ్యవస్థపై ఫోకస్ చేసింది. ముఖ్యంగా నగరంలో ట్రాఫిక్ సమస్య రోజురోజుకు విపరీతంగా పెరిగిపోతోంది. దీనిపై దృష్టి సారించిన హైడ్రా అధికారులు ఇతర విభాగాలను సమన్వయం చేసుకుని అడుగులు వేస్తుంది. ట్రాఫిక్ జామ్‌కు గల కారణాలను తెలుసుకుని జీహెచ్‌ఎంసీతో కలిసి పని చేస్తోంది.
ఇక తాజాగా హైదరాబాద్‌లోని చెట్లు పరిరక్షణతోపాటు ప్రధాన రహదారులు, కాలనీల్లో ప్రమాదకరంగా ఉన్న చెట్లను వెంటనే తొలగించాలని హైడ్రా కమిషనర్ రంగానాథ్ నిర్ణయించారు. ఇందుకు జీహెచ్‌ఎంసీ, అటవీ శాఖ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు హైడ్రా కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమీక్షించారు.
ఆ సమస్యలపై హైడ్రా ఫోకస్, లిస్టులో మొదటగా అదే - వీధివ్యాపారులు జర భద్రం!
కూలడానికి సిద్ధంగా ఉన్న చెట్లు :జీహెచ్ఎంసీ, హైడ్రా, అటవీశాఖ అధికారులతో జోన్ల వారీగా ఒక బృందాన్ని ఏర్పాటు చేసి క్షేత్ర స్థాయిలో చెట్ల పరిస్థితిపై సర్వే చేయాలని సూచించారు. ఎండిపోయి కూలడానికి సిద్ధంగా ఉన్న చెట్లను వెంటనే తొలగించాలని, ట్రీ ట్రాన్స్ ప్లాంటేషన్‌కు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని రంగనాథ్ అధికారులను ఆదేశించారు. అలాగే వాల్టా చట్టం అమలు తీరుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
శాస్త్రీయ విధానంలో చెట్ల పరిరక్షణ :ట్రాఫిక్‌కు ఇబ్బందికరంగా మారుతున్న చెట్ల కొమ్మలను తొలగించాలని, ఇంకా ఇబ్బందిగా ఉంటే ఆ చెట్లను ట్రాన్స్ లొకేట్ చేయాలని సూచించారు. విద్యుత్ తీగలు తగులుతున్నాయని, అశాస్త్రీయంగా చెట్ల కొమ్మలను నరకడం చేయవద్దని అధికారులకు రంగనాథ్ ఆదేశించారు. వాహనాలకు కొమ్మలు తగులుతున్నాయని చెట్లకు ఒకవైపే నరకడం వల్ల చెట్టు బ్యాలెన్స్ కోల్పోయి చిన్నగాలి వానకే కూలిపోతున్నాయన్నారు. ఈ విషయంలో శాస్త్రీయ విధానాలను అనుసరించి చెట్ల పరిరక్షణ కోసం పాటుపడాలని రంగనాథ్ అధికారులకు సూచించారు.
మళ్లీ జేసీబీలకు పనిచెప్పిన హైడ్రా - ఈసారి రూట్ మార్చిందిగా!
ఆ ఒక్క ప్రశ్నతో రంగంలోకి 'హైడ్రా' - దానికోసమే ఇదంతా - మీకు తెలుసా?