ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

హైదరాబాద్ నగర సమస్యలపై హైడ్రా ఫోకస్ - వారు కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందే! - HYDRA FOCUSED ON HYDERABAD PROBLEMS

హైదరాబాద్ నగర సమస్యల దృష్టి సారించిన హైడ్రా - నాలాల విస్తరణ, ట్రాఫిక్ నియంత్రపై స్పెషల్ ఫోకస్

Hydra Focused on Hyderabad Problems
Hydra Focused on Hyderabad Problems (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 22, 2024, 7:36 PM IST

Hydra Focused on Hyderabad Problems : తెలంగాణలోనిహైదరాబాద్ నగరంలోని సమస్యల పరిష్కారంపై దృష్టిసారించాలని హైడ్రా నిర్ణయించింది. నెల రోజులుగా కమిషనర్ ఏపీ రంగనాథ్ వివిధ రంగాల నిపుణలతో సమావేశాలు నిర్వహించి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. కూల్చివేతల కోసమే హైడ్రా ఏర్పడిందన్న ముద్రను చెరిపివేసుకోవాలన్న భావనతో ఉన్న అధికారులు, ఇతర సమస్యలపై దృష్టి సారించనున్నారు. దీంతో కూల్చివేతలు తాత్కాలికంగా ఆపేయాలని నిర్ణయించారు.

ట్రాఫిక్​పై ఫోకస్ :తెలంగాణరాజధానిలో నిత్యం 50లక్షలకు పైగా వాహనాలు రోడ్డెక్కుతున్నాయి. చిన్నపాటి వాన పడినా గంటల తరబడి రోడ్లపై ఉండాల్సిందే. ఈ సమస్యపై ట్రాఫిక్ పోలీసులు, బల్దియా అధికారులతో కలిసి పరిష్కరించాలని ఆలోచిస్తున్నారు. దీని పరిష్కృతం కోసం 2 విద్యా సంస్థలకు సర్వే బాధ్యతలు అప్పగించారు. పరిష్కారాలపై సీఎం రేవంత్ రెడ్డికి ఓ నివేదిక సమర్పించి చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు. వాహన రద్దీ సమస్యతో పాటు ఫుట్‌పాత్‌, రహదారి ఆక్రమణలపై నగర ట్రాఫిక్‌ విభాగంతో కలిసి పని చేయాలని నిర్ణయించింది.

చెరువుల పరిరక్షణ :నేషనల్ రిమోట్ సెన్సింగ్ విభాగం తీసిన ఫొటోలు, మ్యాప్​లతో చెరువు వాస్తవ విస్తీర్ణం, మొత్తం చరిత్రను తీసి నిక్షిప్తం చేసేందుకు యత్నిస్తున్నారు. చెరువులపై ఉన్న ఆక్రమణల్లో దాదాపు 85శాతం నిర్మాణాలకు అనుమతులు ఉన్నాయి. వీటిని కూల్చడం సాధ్యం కాదని అభిప్రాయపడ్డ హైడ్రా అధికారులు ఉన్న చెరువును పరిరక్షించాలని నిర్ణయించారు. నగరంలోని కొన్ని చెరువుల సుందరీకరణను నవంబరులో ప్రారంభించాలని యోచిస్తున్నారు.

హైడ్రా ఫోకస్​ వారి పైనే - ఇక దూసుకుపోనున్న వాహనాలు

నాలాల విస్తరణ : హైదరాబాద్​లో సుమారు 200 కి.మీ.ల మేర నాలాలు ఉన్నాయి. వీటిపై సుమారు 15వేల నిర్మాణాలు ఉన్నాయని గతంలో అధికారులు గుర్తించారు. వీటిని కూల్చడం ప్రభుత్వానికి అసాధ్యం. చాలా వాటికి బల్దియా పర్మిషన్స్ ఉన్నాయి. బాధితులకు పరిహారం ఇవ్వాలంటే రూ.వేల కోట్లు కావాల్సిందే. పెద్ద నాలాల పరిధిలో సుమారు 1400 చోట్ల మూడొంతుల ఆక్రమణకు గురై వర్షం నీరు కిందికి వెళ్లడం లేదు. వీటిని తొలగించి నాలాలను విస్తరిస్తే వరద నీటి ముంపు సమస్య తొలుగుతుంది. బల్దియాతో కలిసి దశల వారీగా ఈ పనులు చేయాలని హైడ్రా సిద్ధమైంది.

హైడ్రాకి ఇక స్పెషల్ పవర్స్ - ప్రభుత్వ ఆర్డినెన్స్‌కి గవర్నర్‌ ఆమోదం - GOVERNOR APPROVED HYDRA ORDINANCE

చర్యల కోసం సిబ్బందికి ట్రైనింగ్ :గత సర్కార్ హయాంలో నగరంలో భారీ వర్షాలు కురిసినా, ఇతర ఉపద్రవాలు వచ్చినా తక్షణ చర్యల కోసం కార్యాచరణ రూపొందించారు. అందుకు సుమారు వెయ్యి మంది ఉద్యోగులను తీసుకున్నారు. ఈ విభాగం నగర అవసరాలకు పెద్దగా ఉపయోగపడకపోవడంతో ప్రస్తుతం వీరిని హైడ్రాలో వీలినం చేశారు. వీరు విపత్తుల సమయంలో పోలీసులతో కలిసి పని చేసేలా, అందుకు వారికి ట్రైనింగ్ కార్యక్రమాన్ని కూడా రూపొందించారు. ముఖ్యంగా వర్షాలకు రోడ్లపై చేరిన నీళ్లను నాలాల్లోకి మళ్లించడం, ట్రాఫిక్ నియంత్రించడంలో వీరి సేవలు ఉపయోగించుకుంటారు. నగరంలో వందలాది పార్కులు ఆక్రమణలకు గురయ్యాయి. వీటి తొలగింపునకు హైడ్రా అధికారులు కార్యాచరణను రూపొందిస్తున్నారు. పార్కుల నిర్వహణ బాధ్యతను స్థానిక కాలనీ సంఘాలకే అప్పగించాలని యోచిస్తున్నారు.

"హైడ్రా కూల్చివేతలు" - ప్రభుత్వ వ్యతిరేకతకు చెక్ పెట్టేలా సీఎం రేవంత్​రెడ్డి కొత్త పాలసీ!

ABOUT THE AUTHOR

...view details