ETV Bharat / state

కనిష్ఠ స్థాయికి ఉష్ణోగ్రత - వణుకుతున్న మన్యం ప్రజలు - WEATHER REPORT ALLURI DITRICT

అల్లూరి సీతారామరాజు జిల్లా మన్యంలో చలిపులి పంజా విసురుతోంది. ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోతుండడంతో చలిగాలులు బలంగా వీస్తున్నాయి.

cold_intensity_raised_in_alluri_district
cold_intensity_raised_in_alluri_district (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 21, 2025, 2:09 PM IST

Cold Intensity Raised in Alluri District : అల్లూరి సీతారామరాజు జిల్లా మన్యంలో చలిపులి పంజా విసురుతోంది. ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోతుండడంతో చలిగాలులు బలంగా వీస్తున్నాయి. దాంతో స్థానికులు గజగజ వణుకుతున్నారు. చింతపల్లిలో 5 పాయింట్‌ 5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పర్యాటకులు స్థానికులు చలికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఎక్కడికక్కడ మంటలు వేసుకుని వెచ్చదనాన్ని పొందుతున్నారు. ఇంట్లో నుంచి బయటకు రావాలంటే చిన్నపిల్లులు, వృద్ధులు హడలెత్తిపోతున్నారు. సంక్రాంతి తర్వాత వాతావరణంలో చోటుచేసుకున్న మార్పులతో ఉదయం వేళల్లో పొగమంచు దట్టంగా కురుస్తోంది. గడచిన 24 గంటల్లో జిల్లాలో సోమవారం అత్యల్పంగా జి.మాడుగులలో 5.4 డిగ్రీలు, గూడెంకొత్తవీధిలో 5.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా అత్యధికంగా కొయ్యూరులో 12.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని వాతావరణ పరిశోధన విభాగం అధికారులు తెలిపారు.

వణుకుతున్న మన్యం ప్రజలు (ETV Bharat)

అలాగే పెదబయలులో 5.8, డుంబ్రిగుడలో 6, పాడేరులో 6.1, అరకులోయలో 6.8, చింతపల్లిలో 7.3, ముంచంగిపుట్టులో 7.8, హుకుంపేటలో 8.3, అనంతగిరిలో 9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని చెప్పారు. ఫిబ్రవరి మొదటి వారం వరకూ అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని అధికారులు పేర్కొన్నారు.

జి మాడుగులలో 5 డిగ్రీలు- మరో ఐదు రోజులపాటు తీవ్రమైన చలి

మన్యం గజగజ - 4.1 డిగ్రీలకు పడిపోయిన ఉష్టోగ్రతలు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.