Hyderabad Young Lady Lost Money in Online Game : ఇప్పుడున్న యువత పుస్తకాలు, ఆటలు మానేసి ఎంచక్కా సెల్ఫోన్లో సామాజిక మాధ్యమాలు, గేమ్‌లు అంటూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఆన్లైన్ గేమ్(Online Game Fraud)లలో పడి సైబర్ నేరాల బారిన పడుతున్న వారు ఎంతో మంది ఉన్నారు. అదే క్రమంలో సైబర్ మోసానికి బలై లక్షల్లోనూ, వేలల్లోనూ డబ్బులు పోగొట్టుకుంటున్న అభాగ్యులు ఉన్నారు. తాజాగా హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆన్లైన్ గేమ్‌లకు అలవాటు పడిన ఓ యువతి నగదు పోగొట్టుకున్న సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ విషయంపై పోలీసులు ముమ్మర దర్యాప్తు జరిపి చాకచక్యంగా ఆ యువతే అని గుర్తించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం : నగరంలోని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎర్రబోడలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్న ఓ యువతి ఆన్లైన్ గేమ్స్‌కు అలవాటు పడింది. గేమ్ ఆడుతుండగా అందులో కొంత జమచేస్తే ఎక్కువ మొత్తం వస్తాయని అలర్ట్ వచ్చింది. ఎప్పటి నుంచో గేమ్స్ ఆడుతున్న ఆ యువతి అది నిజమేనేమోనని నమ్మి అందులో ముందుగా రూ.200 పంపించింది. అప్పుడు రూ.600లు వచ్చాయి.
చాలా సంతోషించిన ఆ యువతి ఇంకా ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టడం ప్రారంభించింది. దీంతో ఆమె వేలల్లో అందులో జమ చేసింది. అలా రూ.30 వేలు వరకు జమ చేసిన తర్వాత నగదు తిరిగి రాలేదు. అంతటితో ఆగకుండా ఆ డబ్బెలాగైనా సంపాదించాలని ఇంట్లో ఉన్న కొద్దీ బంగారం విక్రయించి మరో రూ.35 వేల వరకు ఆ ఆన్లైన్ గేమింగ్‌లో పెట్టింది. ఆ తర్వాత యువతి పెట్టిన డబ్బులు వెనక్కి తిరిగి రాకపోవడంతో సైబర్ దాడిలో(Cyber Fraud in Hyderabad) మోసపోయానని గ్రహించింది.
ఆ యాప్‌పై సైబర్ దాడి- హ్యాకర్ల చేతికి 70 లక్షల మంది వివరాలు!