తెలంగాణ

telangana

By ETV Bharat Telangana Team

Published : Feb 16, 2024, 3:13 PM IST

ETV Bharat / state

కెనడాలో విషాదం - గుండెపోటుతో హైదరాబాద్​ విద్యార్థి మృతి

Hyderabad Student Cardiac Death in Canada : ఉన్నత చదువుల కోసం కెనడాకు వెళ్లిన హైదరాబాద్​ వాసి కార్డియాక్​ అరెస్టుతో మృతి చెందాడు. అతడి మృతదేహాన్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు సాయం చేయాలంటూ ఆ విద్యార్థి కుటుంబం కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్​. జైశంకర్​ను కోరింది.

Indian Student Dies Of cardiac Arrest in Canada
Hyderabad Student Cardiac Death in Canada

Hyderabad Student Cardiac Death in Canada : హైదరాబాద్​కు చెందిన 25ఏళ్ల షేక్ ముజమ్మిల్ అహ్మద్ 2022లో ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్లాడు. ఒట్టారియాలోని కొనెస్టోగా కాలేజీలో ఐటీ మాస్టర్స్ చదువుతున్నాడు. గత వారం రోజులుగా జ్వరంతో బాధపడుతున్న అతడు, శుక్రవారం కార్డియాక్​ అరెస్టుతో ప్రాణాలు కోల్పోయాడు.

అతడి స్నేహితుడు కుటుంబ సభ్యులకు ఫోన్​ చేసి సమాచారమిచ్చారని ఎంబీటీ పార్టీ అధికార ప్రతినిధి అజ్మద్ ఉల్లా ఖాన్​ సోషల్ మీడియాలో తెలిపారు. అహ్మద్ కుటుంబ సభ్యులు కేంద్ర విదేశాంగ శాఖకు రాసిన లేఖను ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. వీలైనంత త్వరగా మృతదేహాన్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని కేంద్రాన్ని కోరారు.

ఎనిమిది నెలల ప్రెగ్నెంట్,​ కార్డియాక్​ అరెస్ట్​తో కన్నుమూసిన నటి, ఐసీయూలో చిన్నారి

Indian Student Dies Of cardiac Arrest in Canada :ఇటీవల హైదరాబాద్​కు చెందిన మరో విద్యార్థి అమెరికాలోని చికాగోలో దాడికి గురైన విషయం తెలిసిందే. ఈ నెల ఆరంభంలో లంగర్​హౌజ్​ షమీనగర్​కు చెందిన సయ్యద్ మజాహిర్​ అలీపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. తీవ్ర గాయాలతో తనపై జరిగిన దాడిని అలీ వీడియో ద్వారా వెల్లడించారు. అతడికి అవసరమైన సాయం చేస్తామని చికాగోలో ఉన్న భారత ఎంబసీ హామీ ఇచ్చింది.

Student Deaths in Abroad Countries : ఉన్నత చదువుల కోసం అప్పులు చేసి నానా ఇబ్బందులు పడి విదేశాలకు వెళ్లి స్థిరపడాలనుకుంటున్న యువత మృతదేహాలుగా స్వదేశానికి వస్తున్నారు. ఎన్నో ఆశలతో తమ పిల్లను విదేశాలకు పంపుతున్న ఆ తల్లిదండ్రులు ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటివి పునరావృత్తం కాకుండ కేంద్ర విదేశాంగ శాఖ చర్యలు తీసుకోవాని వేడుకుంటున్నారు.

కార్డియాక్ అరెస్ట్ అంటే ఏమిటి..? వస్తే ఏం చేయాలి..?

America White House On Attacks on Indian Students : కాగా అమెరికాలో భారతీయ విద్యార్థులపై జరుగుతున్న దాడులను శ్వేతసౌధం ఖండించింది. వీటిని అడ్డుకునేందుకు అధ్యక్షుడు బైడెన్ యంత్రాంగ శాయశక్తులా పని చేస్తోందని గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. ఇటీవల యూఎస్​లో వివిధ ప్రాంతాల్లో నలుగురు ఇండియా అమెరికన్ విద్యార్థులు మరణించిన సంగతి తెలిసిందే. అమెరికాలో చదువుకుంటున్న భారతీయ విద్యార్థుల మరణాలు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయని ఇండియన్ అమెరికన్​ కమ్యూనిటీ నేత అజయ్​ జైన్ అన్నారు. అగ్రరాజ్యంలో ఉంటున్న విద్యార్థులభద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

పెళ్లిలోనే వరుడికి కార్డియాక్ అరెస్ట్.. ఏడడుగులు వేస్తూ కుప్పకూలిన వైద్యుడు

హార్ట్​ ఎటాక్​, కార్డియాక్​ అరెస్ట్​.. రెండూ ఒకటేనా..? వీటి నుంచి బయటపడడం ఎలా..?

ABOUT THE AUTHOR

...view details