Drug Awareness Program in Hyderabad :తల్లిదండ్రులు తమ పిల్లలను ఇతరులతో పోల్చవద్దని, అలా చేయడం వల్ల వారు ఒత్తిడికి గురవుతున్నారని టీఎస్ న్యాబ్(TS NAB) డైరెక్టర్ సందీప్ శాండిల్య అన్నారు. ఆ ఒత్తిడితోనే చాలా మంది మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నట్లు తెలిపారు. అది క్రమంగా వారిని డ్రగ్స్‌కు బానిసలుగా మారుస్తోందని చెప్పారు. డ్రగ్స్ ఫ్రీ హైదరాబాద్ (Drugs Free Hyderabad) పేరుతో యాంటీ నార్కోటిక్స్ ఫోరం, హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్, హైదరాబాద్ పోలీసులు నిర్వహించిన సదస్సులో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనర్లు, టీఎస్ న్యాబ్ డైరెక్టర్ సందీప్ శాండిల్య, సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రతినిధులు, తల్లిదండ్రులు, పలు విద్యాసంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
మత్తు పదార్థాల కట్టడిపై సర్కార్ ఫోకస్ - రాష్ట్రంలో 'హుక్కా'ను నిషేధిస్తూ నిర్ణయం
Drugs Free Hyderabad :ఈ సందర్భంగాదేశంలో డ్రగ్స్ (Drugs) ప్రధాన సమస్యగా మారిందని టీఎస్ న్యాబ్ డైరెక్టర్ సందీప్ శాండిల్య అన్నారు. ఒంటరితనం అనుభవించే వారే ఎక్కువగా మాదక ద్రవ్యాలకు బానిసవుతున్నారని వివరించారు. ప్రస్తుతం దేశంలో డ్రగ్స్ ప్రధాన సమస్యగా మారిందని అన్నారు. తల్లిదండ్రులు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తారు, స్కూల్ నుంచి వచ్చిన పిల్లలను పట్టించుకునేది ఎవరని ప్రశ్నించారు. సెల్‌ఫోన్‌కో లేదా ఒంటరిగా ఫీల్ అయి డ్రగ్స్ బారిన పడుతున్నారని అన్నారు. పోలీసులు చర్యలు తీసుకున్నా, తల్లిదండ్రులు వారి చిన్నారులను గమనించాలని సూచించారు.