Hyderabad Metro Railway : మెట్రో రైళ్లో రద్దీ సమయంలో ప్రయాణికుల కష్టాలు ఇప్పట్లో తీరేలా లేవు. కారిడార్-1 ఎల్బీనగర్ - మియాపూర్, కారిడార్-3 నాగోల్-రాయదుర్గం మార్గంలో ప్రస్తుతంఉన్న మెట్రో రైల్(Metro Rail) కోచ్‌లు రద్దీ ఎక్కువ లేదు. అమీర్‌పేట, మెట్టుగూడ స్టేషన్ల నుంచి లూప్ మెట్రోలు నడుపుతున్నా ఇవి పరిమితంగా ఉన్నాయి. ఉదయం, సాయంత్రం ప్రయాణీకుల రద్దీని తట్టుకునేందుకు అదనపు కోచ్‌లను లీజుకు తీసుకోవాలని గత ప్రభుత్వం ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రోని ఆదేశించింది. నాగ్‌పూర్‌నుంచి 12 కోచ్‌లు తీసుకునేందుకు చర్చలు జరిపారు. తర్వాత ఎందుకనో ఈ ప్రక్రియ ముందడుగు పడలేదు.
హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 విస్తరణకు ఖరారైన రూట్ మ్యాప్ - కొత్తగా 70 కి.మీ. మేర నిర్మాణ ప్రతిపాదనలు
Heavy Rush In Metro Railway : మెట్రో రైళ్లో ప్రస్తుతం 4.80 లక్షల నుంచి 5 లక్షల మధ్యలో నిత్యం రాకపోకలు సాగిస్తున్నారు. జేబీఎస్ నుంచి ఎంబీబీఎస్ కారిడార్-2లో 35 వేల మంది వరకు ప్రయాణిస్తుంటే ఇంకో రెండు కారిడార్లలోనే మిగిలిన వారు ప్రయాణిస్తున్నారు. ఉదయం అమీర్‌పేట నుంచి రాయదుర్గం వెళ్లేందుకు రద్దీతో ప్రయాణికులు నరకయాతన పడుతున్నారు. సాయంత్రం రాయదుర్గం నుంచి నాగోల్ మార్గంలో విపరీతమైన ప్రయాణికుల తాకిడి ఉంటోంది. రద్దీ వేళల్లో మూడు నాలుగు నిమిషాలకు ఒక మెట్రో నడుపుతున్నా రాయదుర్గంలోనే మెట్రో కోచ్‌లన్నీ జనాలతో నిండిపోతున్నాయి. హైటెక్ సిటీలో కష్టంగా ఎక్కగలుగుతున్నారు. దుర్గంచెరువు స్టేషన్‌లో కాలు పెట్టేందుకు కూడా చోటు లేక మూడు నాలుగు మెట్రోలను వదిలేస్తున్నామని ప్రయాణికులు వాపోతున్నారు.
వేసవిలో మరింత రద్దీ - ఉచిత బస్సు ప్రభావం ఎంత?