Fog in The State for Next Three Days : రాష్ట్రంలో రాగల మూడు రోజుల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల తక్కువ నమోదయ్యే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీంతో మూడు రోజుల పాటు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉదయం వేళల్లో పొగమంచు కురుస్తుందని తెలిపింది. ఉత్తర తెలంగాణలో కొన్ని ప్రాంతాలలో మూడు రోజులు అక్కడక్కడ చలి గాలులు వీస్తాయని వివరించింది. కాగా గురువారం రాష్ట్రంలోని కింది స్థాయిగాలులు ప్రధానంగా ఉత్తర, ఈశాన్య దిశల నుంచి వీస్తున్నాయని పేర్కొంది.
ఇదిలా ఉంటే చలికాలంలో బ్రెయిల్ స్ట్రోట్, గుండెపోటు వంటి కారణాలతో మరణించే వారి సంఖ్య అధికంగా ఉంటుందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రాష్ట్రంలో ఆసుపత్రులకు వెళ్లే వారి సంఖ్యను చూస్తే చలి విసిరే పంజాకు అద్దం పడుతోంది.