తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇదేం క్రేజు రా నాయనా - ఫ్యాన్సీ నంబర్ కోసం రూ.19 లక్షలు ​- TG సిరీస్ మేనియా మామూలుగా లేదుగా - TG 09 A 9999 FANCY NUMBER CRAZE

Fancy Number Auction In Hyderabad : ఫాన్సీ నంబర్లపై వాహన యాజమానుల్లో ఆసక్తి పెరిగిపోతోంది. తమకు ఇష్టమైన, కలిసొచ్చే నంబర్లను దక్కించుకోవడానికి ఎంత చెల్లించడానికైన వెనుకంజ వేయడం లేదు. బుధవారం రోజున హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌ రవాణా కార్యాలయంలో జరిగిన వేలంలో 'TG 09 A 9999' నంబర్‌కు ఏకంగా. 19 లక్షల 51వేల 111 రూపాయలు ధర పలికింది.

Fancy Number Auction
Fancy Number Auction (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jul 25, 2024, 8:59 AM IST

Rs.19 Lakhs For Car Fancy Number in Hyderabad : ఫ్యాన్సీ నంబర్లపై వాహన యజమానుల్లో రోజురోజుకు క్రేజ్ పెరుగుతోంది. తమకు ఇష్టమైన, లక్ కలిసొచ్చే నంబర్లను పొందడానికి ఎంత మొత్తంలోనైనా చెల్లించడానికి వెనకాడటం లేదు. చాలా మంది ఫ్యాన్సీ నెంబర్ స్టేటస్​ సింబల్​గా భావిస్తుండటంతో ఈ నెంబర్లను పొందడానికి పోటీ ఎక్కువగా ఉంటోంది. బుధవారం రోజున హైదరాబాద్​లోని ఖైరతాబాద్​ రవాణా శాఖ కార్యాలయంలో జరిగిన వేలంలో భారీ మొత్తంలో ఆదాయం సమకూరింది.

బుధవారం హైదరాబాద్ ఖైరతాబాద్​లోని రవాణా శాఖ కార్యాలయంలో జరిగిన వేలంలో టీజీ '09 ఏ9999' నెంబర్ అత్యధికంగా రూ .19,51,111 పలికింది. హానర్స్ డెవలపర్స్ అనే సంస్థ భారీ మొత్తంలో చెల్లించి ఈ నంబర్​ను స్వంత చేసుకుంది. కొత్తగా ప్రారంభమైన టీజీ09 బీ సిరీస్​లో '0001' నంబరును రూ. 8లక్షల 25 వేల రూపాయలు పలకగా, ఈ నంబర్​ను ఎన్​జీ మైండ్ ఫ్రేమ్ సంస్థ దక్కించుకుంది.

ప్రారంభమైన 'టీజీ' రిజిస్ట్రేషన్- ఫ్యాన్సీనెంబర్లతో మొదటిరోజే కాసుల గలగల

అదే సరీస్​లోని '0009' నంబరును రూ.6,66,666 చెల్లించి అమరం అక్షరరె డ్డి సొంతం చేసుకున్నారు. '0006' నంబర్​ను రూ.2,91,166తో ఏఎంఆర్ ఇండియా దక్కించుకుంది. '0005' నంబరును రూ.2,50,149తో గ్రేటర్ ఇన్​ఫ్రా ప్రాజెక్ట్స్ సంస్థ, ఇక '0019' నెంబరును రూ.1.30 లక్షలు చెల్లించి మోల్డ్​ టెక్ సంస్థ తీసుకుంది. వీటితో పాటుగా బుధవారం మొత్తం ఫ్యాన్సీ నంబర్ల ద్వారా ఖైరతాబాద్​ రవాణా శాఖకు రూ. 51,17,517 ఆదాయం వచ్చినట్లు ఆర్టీఓ అధికారులు వెల్లడించారు.

'ఖైరతాబాద్ రవాణా శాఖకు ఫ్యాన్సీ నంబర్లతో ఒక్కరోజే రూ. 51,17,514 ఆదాయం సమకూరింది. అత్యధికంగా TG 09 A 9999 నంబర్ రూ.19,51,111 ధర పలికింది. TG 09 B 0001 నంబర్ రూ. 8,25,000లు, TG 09 B 0009 నంబర్ రూ. 6,66,666, TG 09 B 0006 నంబర్ రూ. 2,91,166, TG 09 B 0005 రూ. 2,50,149, TG 09 B 0019 నంబర్ రూ.1,30,000 ధర పలికింది.' - రమేశ్, హైదరాబాద్ జేటీసీ

కారు నెంబర్​ కోసం ఏకంగా రూ.5 లక్షల 10 వేలు

ABOUT THE AUTHOR

...view details