Hyderabad Young Man Resists Mobile Theft :హైదరాబాద్‌లోని వెంగళరావునగర్ పరిధి లక్కీ హస్ట్‌ల్‌లో నివాసం ఉంటున్న పి.జాషువా కుమార్ ఆదివారం ఉదయం హాస్టల్ బయట కూర్చుని తన మొబైల్లో ఏదో వీడియో చూస్తున్నాడు. ఆ సమయంలో అటుగా ఓ నంబర్ ప్లేట్ లేని ద్విచక్ర వాహనం వచ్చింది దానిపై వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు జాషువా వద్దకు వచ్చి ఏదో అడ్రస్ అడిగినట్లు నటించారు. అలా ఒక్కసారిగా అతడిని నమ్మించి ఓ ఫోన్‌కాల్ చేసుకోవాలని అతడిని సెల్‌ఫోన్ అడిగారు. అలా అతడు మొబైల్ ఇవ్వగానే అక్కడి నుంచి ఉడాయించడానికి ప్రయత్నించారు.
కానీ అలర్ట్‌గా ఉన్న ఆ యువకుడు వారు తన చేతిలో మొబైల్ తీసుకుని పారిపోయేందుకు యత్నించగా తాను వారి బైక్ కీ లాగేసుకున్నాడు. అతడు చేసిన పని చూసి కంగుతిన్న ఆగంతకులు అతడిని కత్తితో బెదిరించి, దాడి చేయడానికి ప్రయత్నించాడు. అయినా జాషువా వెనక్కి తగ్గలేదు. ఆ ఇద్దరిలో ఓ వ్యక్తిని యువకుడిని పట్టుకోగా అతడు కత్తితో దాడి చేశాడు.
హైదరాబాద్‌లోనే ఎక్కువగా సెల్‌ఫోన్ దొంగతనాలు - అందులో నిందితులందరూ మైనర్లే! - Minors Mobile Theft Crisis
ఈ క్రమంలో బాధితుడు గట్టిగా అరవడంతో హాస్టల్ నుంచి బయటికి వచ్చిన యువకులు ఆగంతకులను పట్టుకుని 100కు ఫోన్ చేశారు. సమాచారం అందుకున్న మధురానగర్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆగంతకుల విషయంలో జాషువా సాహసాన్ని స్థానికులు ప్రశంసించారు.
ఈ మధ్యకాలంలో దొంగలు కొత్త తరహా చోరీలకు తెరలేపారు. అడ్రెస్ అడుగుతున్నట్లు దగ్గరికి రావడం వాళ్ల టార్గెట్ అలర్ట్‌గా లేని సమయంలో మెడలో చైన్లు, చేతిలో మొబైళ్లు లాక్కొని పరార్ అవ్వడం వంటి ఘటనలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. ఇంకొన్ని కేసుల్లో తమకు తెలిసిన వాళ్లకు ఫోన్ చేసుకోవాలని, తమ మొబైల్లో ఛార్జింగ్ అయిపోయిందంటూ ఫోన్ అడిగి తీసుకుని ఉడాయిస్తున్నారు. ఇలాంటి ఘటనలు కూడా రోజురోజుకు ఎక్కువవుతున్నాయి. ఈ క్రమంలో ఎవరైనా తెలియని వ్యక్తులు వచ్చి అడ్రెస్ అడిగినప్పుడు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూ చిస్తున్నారు.
మహిళల వేషధారణలో వచ్చి చోరీ - 4 తులాల బంగారం, రూ.లక్షతో పరార్ - theft in Sr nagar
సెల్‌ఫోన్ చోరీలకు పాల్పడుతున్న అంతర్జాతీయ ముఠా అరెస్ట్ - రూ.2 కోట్ల విలువైన 713 ఫోన్లు స్వాధీనం