ETV Bharat Telangana

తెలంగాణ

telangana

ETV Bharat / state

9 ఏళ్లకే బ్యాడ్మింటన్‌లో అదరగొడుతున్న చిన్నారి - ఇండియా తరఫున ఆడటమే లక్ష్యమట - 9Years Girl badminton Cup - 9YEARS GIRL BADMINTON CUP

Hyderabad Girl Won in Tamil Nadu Badminton Under 9 Tournament : బాల్యంలో చాలా మంది ఆటపాటలకే పరిమితమవుతారు. కొందరు మాత్రమే ఏదో ఒక దాంట్లో తమ ప్రతిభ కనబరుస్తూ ఉత్తమ జీవితానికి బాటలు వేసుకుంటుంటారు. ఈ కోవకు చెందిందే హైదరాబాద్​కు చెందిన సాన్వి. 9 ఏళ్ల వయస్సులోనే దాదాపు 8 గంటలు సాధన చేస్తూ, బ్యాడ్మింటన్‌లో రాష్ట్రస్థాయిలో పతాకాలను సొంతం చేసుకుంటోంది.

Tamil Nadu Badminton Under 9 Tournament
Hyderabad Girl Won in Tamil Nadu Badminton Under 9 Tournament
author img

By ETV Bharat Telangana Team

Published : Apr 4, 2024, 12:47 PM IST

Hyderabad Girl Won in Tamil Nadu Badminton Under 9 Tournament :హాయ్‌ నేస్తాలూ! మనకు ఆటలంటే ఎంత ఆసక్తి ఉన్నా, అందులో అత్యుత్తమంగా రాణించాలంటే ఎంతో సాధన చేయాలి. కచ్చితంగా ఒక ప్రణాళికను అనుసరించాల్సిందే. అప్పుడే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలం. ఓ చిన్నారి ఇదే దిశలో నడుస్తూ తన లక్ష్యానికి బాటలు వేసుకుంటుంది. నెలల వ్యవధిలోనే తన సత్తా చాటుతోంది. ఆ వయస్సు వారందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. మరి తనెవరో, ఆ వివరాలేంటో తెలుసుకుందామా!

హైదరాబాద్‌కు చెందిన లట్టాల సాన్వీకి తొమ్మిది ఏళ్లు. ప్రస్తుతం మూడో తరగతి చదువుతోంది. వీళ్ల అమ్మ ఖుషి గృహిణి. నాన్న సాయి శ్రీరాం సినిమాటోగ్రాఫర్‌గా పని చేస్తున్నారు. ఈ చిన్నారి ఏ విషయాన్నైనా చాలా తొందరగా నేర్చేసుకుంటుందట. చిన్నప్పటి నుంచే తను బాడ్మింటన్‌ ఆట మీద చాలా ఆసక్తి చూపేదట. ఎలాంటి శిక్షణ లేకుండానే చాలా పోటీల్లో ఫైనల్స్‌ వరకు చేరిందట. తన ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు ఒక బాడ్మింటన్‌ శిక్షణ కేంద్రంలో చేర్పించారట.

ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన రెండున్నరేళ్ల చిన్నారి- బుడిబుడి అడుగులతో రికార్డ్​ - Youngest Child Climb Mount Everest

సాన్వి కోచింగ్‌లో చేరిన తర్వాత దాదాపు ఎనిమిది నెలల్లోనే తన ప్రతిభతో అందిరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అతి తక్కువ సమయంలోనే జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని బహుమతులు గెలుచుకుంది. ఇటీవల చెన్నైలో జరిగిన తమిళనాడు ఓపెన్‌ జూనియర్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌ 2024లో అండర్‌-9 బాలికల సింగిల్స్‌ విభాగంలో పాల్గొని ప్రథమ స్థానంలో నిలిచింది. అండర్‌-11 విభాగంలో కూడా పాల్గొంది. ఇదంతా తన కోచ్‌ ముప్పాల వేణుగోపాల్‌ ప్రోత్సాహంతోనే సాధ్యమైందని, ఈ చిన్నారి తల్లిదండ్రులు అంటున్నారు.

చెస్​లో రేర్ రికార్డు - 37 ఏళ్ల గ్రాండ్‌ మాస్టర్​ని ఓడించిన 8 ఏళ్ల చిన్నారి

సాధనపైనే దృష్టి :మొదట్లో తాను రోజుకు ఒకటి లేదా రెండు గంటలు ప్రాక్టీస్ చేస్తుండేది. కానీ ఇప్పుడు ఉదయం 4:30 గంటలకే నిద్రలేచి, దాదాపు 6 నుంచి 8 గంటలు సాధన చేస్తుంది. ఆ తర్వాత సమయంలో వాళ్లమ్మ సాయంతో చదువుకుంటుంది. బాడ్మింటన్‌తో పాటుగా స్కేటింగ్‌, డాన్స్‌ అంటే తనకు చాలా ఇష్టమని చెబుతుంది. భవిష్యత్తులో ఇండియా తరఫున బ్యాడ్మింటన్ ఆడటమే తన లక్ష్యమని అంటుంది.

చిచ్చర పిడుగు - ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్​ సాధించిన రెండేళ్ల చిన్నారి

ABOUT THE AUTHOR

...view details