Food Delivery Survey In Hyderabad 2024: హైదరాబాద్ అంటే బిర్యానీకి ఫేమస్. నగరంలో ఎక్కువ మంది బిర్యానీ తింటారని, ఆదరిస్తారని అనుకుంటాం. కానీ ఏమైందో కానీ ఈ ఏడాది నూడుల్స్‌పై మనసు లాగినట్టుంది. ఏకంగా 25 లక్షల ప్యాకెట్లను ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నారు. దీన్ని ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ తెలిపింది. మరోవైపు సమారు రెండు లక్షలకు పైగా కండోమ్‌లపై ఆర్డర్లు వచ్చాయి. అందులో 1300 మంది అజ్ఞాత పద్ధతి ఇన్‌కాగ్నిటో మోడ్ ద్వారా ఆర్డర్ చేసుకున్నట్లు స్విగ్గీ తెలిపింది.
ఐస్‌క్రీమ్‌లకు రూ.31 కోట్లు ఖర్చు : నిత్యావసరాలు, ఎలక్ట్రానిక్ వస్తువులపై సుమారు రూ.5.60 లక్షలను నగరానికి చెందిన ఒకే వ్యక్తి ఖర్చు చేశారని పేర్కొంది. కరోనా సమయంలో బయటకెళ్లి కొనుక్కోలేని పరిస్థితి నుంచి, ఇప్పుడు ఆ వెసులుబాటు ఉన్నా ఆన్లైన్ ద్వారా ఇంటికే ఆర్డర్లు తెప్పించుకుంటున్నారు.
స్విగ్గీ వార్షిక నివేదక :మార్నింగ్ మేలుకొన్నది మొదలు టూత్ బ్రష్ దగ్గరి నుంచి అర్ధరాత్రి భోజనం వరకు అన్నింటికీ ఆన్‌లైన్‌పైనే ఆధారపడుతున్నారు. రోజువారీ నిత్యావసరాలు, బొమ్మలు, మేకప్‌తో పాటు పండుగకు సంబంధించిన వస్తువులు త్వరితగతిన ఇంటికి చేరాలనే ఉద్దేశంతో ఆన్లైన్ ఆర్డర్లపై ఆధారపడుతున్నారు. ఈ సంవత్సరం స్విగ్గీ ఇన్‌స్టా మార్ట్ వేదికగా చేసిన వస్తువుల డెలివరీలపై స్విగ్గీ వార్షిక నివేదకను విడుదల చేసింది.