ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

యువతి వీడియో కాల్ - లిఫ్ట్ చేసిన ఇంజినీరింగ్​ విద్యార్థికి దిమ్మతిరిగే షాక్

న్యూడ్​ వీడియో పంపి డబ్బులు డిమాండ్​ - పోలీసులను ఆశ్రయించిన విద్యార్థి

Nude Video Call Fraud in Hyderabad
Nude Video Call Fraud in Hyderabad (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 23, 2024, 10:23 AM IST

Nude Video Call Fraud in Hyderabad : సైబర్ నేరాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. రోజుకో కొత్త పంథాతో ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు. ఓవైపు ఉద్యోగాలు, బహుమతులు అనే ఆశలను ఎరగా వేస్తున్నారు. మరోవైపు ప్రముఖ వ్యక్తులకు సంబంధించిన సామాజిక మాధ్యమాల ఖాతాల డీపీలను ఉపయోగించి డబ్బులు డిమాండ్‌ చేస్తున్నారు. తాజాగా కేటుగాళ్లు న్యూడ్ ​వీడియో కాల్‌ పేరిట మరో కొత్త ఎత్తుగడకు తెర తీశారు. సోషల్ మీడియా ద్వారా సెల్​ఫోన్ నంబర్లు సేకరించి పరిచయం పెంచుకుంటున్నారు. ఆ తర్వాత వాట్సాప్ వీడియో కాల్ చేసి నగ్నంగా మహిళలు దర్శనమిస్తున్నారు. ఆయా దృశ్యాలను రికార్డు చేసి బ్లాక్ మెయిల్ చేస్తున్నారు.

అంతటితో ఆగకుండా ఆ వీడియోలను కుటుంబ సభ్యులు, బంధువులకు పంపిస్తామని బెదిరింపులకు గురి చేస్తున్నారు. దీనిని తప్పించుకోవాలంటే తాము అడిగినంతా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో భయపడిన బాధితులు వారికి డబ్బులు బదిలీ చేస్తున్నారు. తీరా మోసపోయామని గ్రహించి పోలీసులను ఆశ్రయిస్తున్నారు.తాజాగా తెలంగాణలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

Cyber Frauds Rising in Telangana : ఆదిలాబాద్‌ సంజయ్‌నగర్‌కు చెందిన ఓ విద్యార్థి(22) ఘట్‌కేసర్‌లోని ఓ ఇంజినీరింగ్‌ కళాశాలలో చదువుతున్నాడు. అతను చౌదరిగూడ మల్లమ్మకాలనీలో అద్దెకు ఉంటున్నాడు. గురువారం రాత్రి అతడి సెల్​ఫోన్ వాట్సాప్‌కు దీక్షికా అగర్వాల్‌ పేరిట వీడియో కాల్‌ వచ్చింది. ఎలా ఉన్నారు ?బాగున్నావా? ఎలా చదువుతున్నావు పరీక్షలు ఎప్పుడు అంటూ మాట్లాడింది. ఆమె అడిగిన ప్రశ్నలకు అతను సమాధానం చెప్పాడు.

ఈ క్రమంలోనే ఆమె హఠాత్తుగా నగ్నంగా మారింది. ఆ వీడియోను రికార్డు చేసింది. కొన్ని నిమిషాల తర్వాత బాధిత విద్యార్థికి నగ్నంగా ఉన్న వీడియోను పంపి డబ్బులు డిమాండ్‌ చేసింది. ఇవ్వకపోతే కుటుంబ సభ్యులకు, స్నేహితులకు పంపిస్తానని బెదిరించింది. దీంతో అతను మూడు విడతలుగా రూ.20,000లు ఆన్‌లైన్‌లో పంపించాడు. మరిన్ని డబ్బులు పంపించాలని బెదిరించడంతో భయపడిపోయిన విద్యార్థి పోచారం ఐటీకారిడార్‌ పోలీసులను ఆశ్రయించాడు.

దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇలాంటి వాటిపట్ల అప్రమత్తంగా ఉండాలని, అలాంటి కాల్స్‌ వస్తే వెంటనే ఫిర్యాదు చేయాలని పోలీసులు చెబుతున్నారు. అపరిచితుల వీడియో కాల్స్ మాట్లాడవద్దని సూచిస్తున్నారు. ఎవరైనా సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోతే వెంటనే 1930కి కాల్ చేయాలని వివరిస్తున్నారు.

'న్యూడ్​ వీడియో కాల్స్'​తో తస్మాత్​ జాగ్రత్త!

Nude video call వివాహితను భయపెట్టి నగ్న వీడియో కాల్‌, ఆపై బెదిరించి

ABOUT THE AUTHOR

...view details