తెలంగాణ

telangana

ETV Bharat / state

భార్య సహకారంతో అత్యాచారం చేస్తాడు - ఆపై నిలువునా దోచేసి, క్రూరంగా హింసించి చంపేస్తాడు - Hyd Couple Given Life Sentence - HYD COUPLE GIVEN LIFE SENTENCE

Hyderabad Couple Given Life Sentence : మహిళలను అత్యాచారం చేసి హత్య చేస్తున్న భర్త, అతడికి సహకరిస్తున్న భార్యకు రంగారెడ్డి కోర్టు జీవితఖైదు విధించింది. మహిళలను నమ్మించి నిర్మానుష్య ప్రదేశాల్లోకి తీసుకెళ్లి నిలువునా దోచుకుని, ఆపై అత్యాచారానికి పాల్పడి, హత్యలు చేస్తున్న ఈ దంపతులకు తాజాగా కోర్టు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది.

Wife Helping Husband to Rape and Kill Women
Wife Helping Husband to Rape and Kill Women (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Sep 14, 2024, 8:18 AM IST

Updated : Sep 14, 2024, 10:36 AM IST

Wife Helping Husband to Rape and Kill Women :అత్యాచారం చేసి, నిలువు దోపిడీలకు పాల్పడుతున్న భర్త, అతడికి సహకరించిన భార్యకు న్యాయస్థానం జీవిత ఖైదు శిక్ష విధించింది. సంచలనం సృష్టించిన ఈ భార్యభర్తల నేరాల కేసుల్లో శుక్రవారం రంగారెడ్డి జిల్లా కోర్టు విడివిడిగా తీర్పులు వెల్లడించింది. ప్రాసిక్యూషన్‌ వివరాల ప్రకారం, వికారాబాద్‌ జిల్లా పెద్దేముల్‌ మండలంలోని జనగాం గ్రామానికి చెందిన కురువ స్వామి అలియాస్‌ రవి (30), మాసనమొల్ల నర్సమ్మ అలియాస్‌ కురువ నర్సమ్మ భార్యాభర్తలు. వీరు సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారంలోని వైఎస్సార్‌ కాలనీలో స్థిరపడ్డారు. ముందుగా కూలీ చేసుకుంటూ జీవనం సాగించే వీరు, విలాసవంతమైన జీవితం కావాలనుకున్నారు. అందుకు సులువుగా డబ్బులు సంపాదించడానికి మార్గాలు వెతికారు. ఒంటరిగా ఉండే మహిళలను మాయమాటలతో నమ్మించి తీసుకెళ్లి దోపిడీ చేయాలని నిర్ణయించుకున్నారు.

అత్యాచారం చేసి నగలు దోచుకుని హత్య : 2021 జులై 25న మల్లంపేట్ అడ్డాలో పని కోసం చూస్తున్న ఓ మహిళను కూలీ పని ఉందని చెప్పి బైక్‌పై తీసుకెళ్లారు. దుండిగల్ ఠాణా పరిధిలోని మంత్రికుంట గ్రామ శివారులోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి ఆమెపై రవి అత్యాచారానికి ప్రయత్నించాడు. ఆమె ప్రతిఘటించడంతో భార్య నర్సమ్మ గట్టిగా బంధించగా, స్వామి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అనంతరం బాధితురాలి ఒంటి మీదున్న ఆభరణాలు దోచుకున్నారు. ఆపై క్రూరంగా హింసించి హత్య చేశారు. దుండిగల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితులను అరెస్టు చేశారు. కోర్టులో అభియోగ పత్రం దాఖలు చేశారు. కేసు విచారించిన రంగారెడ్డి జిల్లా మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి డా.కె.పట్టాభిరామారావు శుక్రవారం తీర్పు వెల్లడించారు.

బాలికను గర్భవతి చేసిన ముగ్గురు యువకులు- ఒకరికి తెలియకుండా మరొకరు అత్యాచారం - Minor Girl Rape in Siddipet

సెల్‌ఫోన్‌, బంగారం తీసుకుని పరార్ :శంకర్‌పల్లి పోలీస్‌ స్టేషన్ పరిధిలో 2021 జులై 18న సింగాపురం గ్రామంలో కూలీ పని చూపిస్తామని స్వామి అతని భార్య ఓ మహిళను బులక్‌పూర్‌గేట్‌ సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లారు. భయభ్రాంతులకు గురి చేసి భార్య నర్సమ్మ సాయంతో స్వామి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఆమెపై దాడి చేయగా అచేతనావస్థలోకి చేరుకోగా, చనిపోయిందని భావించి ఆ మహిళ సెల్‌ఫోన్‌, బంగారం తీసుకొని వెళ్లిపోయారు. శంకర్‌పల్లి పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. కేసు విచారించిన కోర్టు భర్తకు పదేళ్లు, భార్యకు ఏడేళ్లు జైలు శిక్ష విధించింది. ఈ తరహాలోనే అమీన్‌పూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మరో దోపిడీకి పాల్పడ్డ ఈ దంపతులకు, కోర్టు ఏడాది చొప్పున జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది.

నర్సుపై గ్యాంగ్​రేప్ అటెంప్ట్- డాక్టర్ ప్రైవేట్ పార్టులను కోసేసిన బాధితురాలు - Gang Rape Attempt On Nurse

సిద్దిపేటలో దారుణం - ఆడిస్తానని తీసుకెళ్లి మూడేళ్ల చిన్నారిపై అత్యాచారం - Three Year old Girl Raped

Last Updated : Sep 14, 2024, 10:36 AM IST

ABOUT THE AUTHOR

...view details