Hyderabad Astrologer Satyanarayana Expired Due To Health Issues :జ్యోతిష్య, వాస్తు పండితుడు, సినిమా ముహూర్త సిద్ధాంతి సత్యనారాయణ చౌదరి కన్నుమూశారు. ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల మండలం సింగరాజుపాలెంనకు చెందిన ఆయన, గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. 4 రోజులుగా తీవ్ర జ్వరంతో జూబ్లీహిల్స్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందారు.
సినిమాల ముహూర్త సిద్ధాంతి కొఠారు సత్యనారాయణ కన్నుమూత - ASTROLOGER SATYANARAYANA EXPIRED
సినిమాల ముహూర్త సిద్ధాంతి కొఠారు సత్యనారాయణ కన్నుమూత - 4 రోజులుగా హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స - ఆరోగ్యం విషమించడంతో మృతి
Hyderabad Astrologer Satyanarayana Expired Due To Health Issues (ETV Bharat)
Published : Jan 2, 2025, 12:10 PM IST
ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో కోలుకోలేకపోయారని వైద్యులు తెలిపినట్లు బంధువులు చెప్పారు. స్వగ్రామంలో గురువారం ఉదయం అత్యక్రియలు జరుగుతాయని తెలిపారు. రాజకీయ, ఆర్థిక, పారిశ్రామిక, సినీ, క్రీడాంశాలపై జ్యోతిష్యాన్ని సత్యనారాయణ చౌదరి విశ్లేషిస్తారు. ఆయనకు భార్య, కూమారుడు, కుమార్తె ఉన్నారు.