Husband Killed Wife in Hyderabad: ఎంతో అన్యోన్యంగా జీవించే ఆ జంట బతుకుదెరువు కోసం హైదరాబాద్ వచ్చింది. రాగానే ఇక్కడ ఓ పనిలో కుదిరారు. ఇద్దరు పిల్లలను తమ సొంతూళ్లో వదిలేసి, నెలల పసికందును వెంట పెట్టుకుని భాగ్యనగరానికి వచ్చి నాలుగు రోజులైనా కాలేదు అప్పుడే ఆ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. క్షణికావేశంలో భర్త భార్య తలపై ఇటుకరాయితో బాదడంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. నెలల పసికందుతో పాటు మరో ఇద్దరు ఆడబిడ్డలు తల్లిలేని వారైపోయారు. ఈ ఘటన నగరంలోని కూకట్పల్లి సమీపంలోని ప్రగతినగర్లో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం :మహారాష్ట్రకు చెందిన రవీనా దూబే(26), నవీన్ దుర్వే దంపతులు ఈ నెల 26న భాగ్యనగరానికి ఉపాధి నిమిత్తం వలస వచ్చారు. ప్రగతి నగర్లోని ఓ కళాశాల వసతి గృహం సమీపంలో గుడిసెలో తాత్కాలికంగా నివాసమున్నారు. వారికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. ఇద్దరు కుమార్తెలను సొంతూరులోనే ఉంచి ఏడాది వయసున్న బాబుతో హైదరాబాద్కు వచ్చారు. సోమవారం సాయంత్రం భార్యాభర్తలు బయటకు వెళ్లి రాత్రి 9 గంటలకు తిరిగి వచ్చారు.
ఇబ్రహీంపట్నంలో పరువు హత్య - ప్రేమ వ్యవహారం నచ్చక కుమార్తెను కొట్టి చంపిన తల్లి