తిరుమలలో 8 అడుగుల నాగుపాము - భయభ్రాంతులకు గురైన భక్తులు - HUGE COBRA IN TIRUMALA
తిరుమలలో భారీ నాగుపాము కలకలం - పామును చాకచక్యంగా పట్టుకుని అవ్వాచారి కోనలో విడిచిపెట్టిన ఫారెస్ట్ ఆఫీసర్

Published : Nov 27, 2024, 11:44 AM IST
Huge Cobra in Tirumala :తిరుమలలో భారీ నాగుపాము కలకలం సృష్టించింది. మంగళవారం స్థానిక రింగ్‌రోడ్డు సమీపంలోని బి-టైప్ క్వార్టర్స్ 23వ రూమ్ వద్ద 08 అడుగుల నాగుపామును స్థానికులు గుర్తించారు. భారీ నాగు కనిపించడంతో భక్తులు ఒక్కసారిగా ఉలిక్కపడ్డారు. వెంటనే టీటీడీకి చెందిన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉద్యోగి భాస్కర్‌నాయుడికి సమాచారం ఇవ్వడంతో ఆయన అక్కడకు చేరుకున్నారు. కింగ్ కోబ్రాను చాకచక్యంగా పట్టుకుని అవ్వాచారి కోనలో విడిచిపెట్టారు. నాగు పామును అక్కడి నుంచి తరలించడంతో స్థానికులు ఒక్కసారిగా ఊపిరిపీల్చుకున్నారు.