తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆరు కేజీల బంగారం పట్టివేత - దాని విలువ ఎంతో తెలుసా? - Huge Gold Seized at Choutuppal

6 KG Gold Seized at Panthangi Toll Plaza : చౌటుప్పల్​లోని పంతంగి టోల్ ప్లాజా వద్ద ఆరు కేజీల బంగారాన్ని డీఆర్​ఐ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ.4.31 కోట్లు ఉంటుందని అంచనా. బంగారు కడ్డీలను స్వాధీనం చేసుకోగా, నలుగురు నిందితులను అరెస్టు చేశారు. ఈ సంఘటన గురువారం జరిగింది.

6 KG Gold Seized at Panthangi Toll Plaza
gold seized at telangana (etv bharat)

By ETV Bharat Telangana Team

Published : May 3, 2024, 8:29 PM IST

Huge Gold Seized at Panthangi Toll Plaza : రాష్ట్రంలో ఎన్నికల హడావిడి జోరుగా సాగుతోంది. ఈ అవకాశాన్ని ఆసరాగా తీసుకుని స్మగ్లర్లు రెచ్చిపోవాలని చూశారు. ఏకంగా రూ.4.31 కోట్ల విలువ చేసే 6 కిలోల బంగారాన్ని నగరంలోకి తరలించాలని చూశారు. కానీ డీఆర్​ఐ పోలీసులు చాకచక్యంగా ముందే ఆ విషయాన్ని పసిగట్టి కారులో తనిఖీలు చేయడంతో నలుగురు నిందితులు అరెస్టు చేసి బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన చౌటుప్పల్​లోని పంతంగి టోల్​ ప్లాజా వద్ద గురువారం జరిగింది.

కారులో ఆరు కేజీల బంగారం దాచిన చోటు (etv bharat)

రోడ్లపై బంగారం స్మగ్లింగ్​కు సంబంధించిన వాటిని పట్టుకునేందుకు డీఆర్​ఐ విజయవాడ-హైదరాబాద్​ హైవేపై ప్రయాణిస్తున్న వాహనాన్ని ట్రాక్​ చేసింది. గురువారం చౌటుప్పల్​లోని లింగోజీ గూడ పంతంగి టోల్​ ప్లాజా వద్ద కోల్​కతా నుంచి నలుగురు వ్యక్తులతో వెళుతున్న ఫోర్డ్​ ఎకో స్పోర్ట్స్​ కారును అధికారులు ఆపారు. వాహనంలో ఉన్న వారిని ప్రశ్నించడంతో పాటు వాహనాన్ని తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో భాగంగా 35 బంగారు కడ్డీలు ముక్కలు సుమారు 5.964 కిలోల బరువున్న వాటిని స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.4.31 కోట్లు ఉంటుందని అంచనా. కారులో రహస్య ప్రదేశంలో ఈ బంగారాన్ని ఉంచి వారు ప్రయాణిస్తున్నారు. దీంతో పోలీసులు ఆ వాహనంలో ఉన్న నలుగురిని అరెస్టు చేశారు. కారు, బంగారాన్ని స్వాధీనం చేసుకుని 1962 కస్టమ్స్​ చట్టంలోని నిబంధనలు ప్రకారం వారిని అరెస్టు చేశారు.

ABOUT THE AUTHOR

...view details