Rs 1 Crore Alprazolam Seized in Sangareddy :సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం కొత్తపల్లి శివారులో కోళ్ల ఫారంపై టీజీ-నాబ్ ప్రత్యేక టాస్క్‌ఫోర్స్, స్థానిక పోలీసులు సంయుక్తంగా దాడులు జరిపి కోటి రూపాయలు విలువ గల 2.6 కిలోల ఆల్ఫా జోలంతో పాటు, ముడి పదార్థాలు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో మత్తు పదార్ధాలను తయారు చేస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.
అంజిరెడ్డి, ప్రభాకర్‌గౌడ్, సాయికుమార్‌తో పాటు వికారాబాద్ జిల్లా పంచలింగాలకి చెందిన కెమిస్ట్ రాకేశ్ వ్యవసాయ భూమిని లీజుకు తీసుకొని కోళ్లఫారం నిర్వహిస్తూ అక్రమంగా ఆల్ఫా జోలం తయారు చేస్తున్నారు. తయారు చేసిన మత్తుపదార్ధాన్ని అదే గ్రామానికి చెందిన ప్రభాకర్ గౌడ్ అనే కల్లు దుకాణాల్లో అమ్మి డబ్బులు సంపాదిస్తున్నాడు.
రూ.కోటి విలువ చేసే అల్ఫాజోలం పట్టివేత :పక్కా సమాచారం మేరకు దాడులు నిర్వహించిన పోలీసులు కోటి రూపాయలు విలువైన 2.6 కిలోల ఆల్ఫాజోలంతో పాటు, రూ.60 లక్షలు విలువైన ముడిసరుకు స్వాధీనం చేసుకున్నారు. నలుగురు నిందితుల్లో అంజిరెడ్డి, రాకేశ్ అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రభాకర్‌గౌడ్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. మరో నిందితుడు సాయికుమార్ గౌడ్ జైల్లో ఉన్నట్లు ఎస్పీ రూపేశ్ తెలిపారు. వీరు వ్యవసాయ భూమిని లీజుకు తీసుకుని కోళ్ల ఫారం నిర్వహిస్తూ ఈ అక్రమ నిషేధిత మత్తు పదార్థం తయారీ చేస్తున్నారని వివరించారు.