How To Spend Money Carefully :దీపావళి.. అన్ని వయసుల వారికి ఉత్సాహాన్ని అందించే పండుగ. మిఠాయిలు, కొత్త బట్టలు ఇష్ట పడనివారు ఎవరుంటారు చెప్పండి. అవి కాకుండా దీపావళి పండుగ అంటేనే టపాకాయలు కాల్చడం. కొందరికి టపాసులు కాల్చడం ఇష్టమైతే, మరికొందరు ఇంటిని రంగురంగుల దీపాలతో అలంకరించడానికి ఇష్టపడతారు. ఈ పండుగ వచ్చిందంటే చాలు చాలామంది ఇంటికి రంగులేసి, కొత్తగా ముస్తాబు చేసుకుంటారు. మరికొందరు ఇంట్లో ఫర్నీచర్ అంతా మార్చేసి కొత్తవి కొనుక్కుంటారు. ఇంకోటి ఏటంటే పండుగ ఆఫర్లు భారీగా ఉంటాయి.
ముహూర్త్ ట్రేడింగ్ జరపుతారు : కారు, స్కూటర్, టీవీ, ఫ్రిజ్ లాంటివి ఈ సమయంలోనే ఎక్కువగా కొంటుంటారు. ఇక ఇన్ని తీసుకుంటున్నప్పుడు వంటింటి సామాను మాత్రం ఎందుకు మార్చకూడదూ అనే గృహిణులు ఉండకపోరు. పప్పు దినుసులు, ఉప్పులు పోసుకోవడానికి ఒకసారి టప్పర్ వేర్, మరోసారి స్టీల్, ఇంకోసారి గ్లాస్ ఇలా ఏది ట్రెండింగ్‌లో ఉంటే వాటిని కొని కిచెన్‌లో పెట్టాలి అనుకుంటారు. దాంతోపాటే డిన్నర్ సెట్టూ మార్చేస్తే ఇల్లంతా కొత్తగా, అందంగా ఉంటుంది. ఇంత చేసుకున్నాక బంధుమిత్రులతో ఒక గెట్ టూ గెదర్ పెట్టుకోకపోతే ఎలా అని అదీ కానిచ్చేస్తారు. షేర్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టేవారికీ ఇది పండుగే సుమా! సెలవే అయినా వారి కోసం ప్రత్యేకంగా ఒక గంట సమయం ముహూర్త్ ట్రేడింగ్ జరుపుతారు.
ఆదాయం తక్కువగా, ఖర్చులు ఎక్కువగా ఉన్నాయా? ఈ 10 టిప్స్ మీ కోసమే! - How To Save Money Fast
ఇన్ని రకాలుగా డబ్బును నీళ్లలా ఖర్చు పెట్టేవారిని చూస్తుంటే చిన్న కథ గుర్తుకొస్తుంది. డచ్ దేశం వ్యాపారంగా బాగా రాణిస్తున్న రోజులవి. ఓ వ్యాపారవేత్త విదేశాల నుంచి ట్యులిప్ పువ్వుల్ని తెప్పించుకుని ఇంట్లో పార్టీ ఏర్పాటు చేసి గర్వంగా ప్రదర్శించాడు. అందమైన ఆ కొత్త పువ్వు అతిథుల మనసును దోచుకుంది. దీంతో క్రమంగా ట్యులిప్ పువ్వులను ఇంట్లో అలంకరించుకోవడం దేశంలోని సంపన్నులకు ఒక స్టేటస్ సింబల్‌గా మారింది. వేలం పాటలో బోలెడు డబ్బు వెచ్చించి మరీ సొంతం చేసుకునే స్థాయిలో ఆ పువ్వులకు డిమాండ్ ఏర్పడింది.