తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ - ఒక్క క్లిక్​తో మీ దగ్గరలోని ఆసుపత్రుల లిస్టు తెలుసుకోండి! - NEAREST RAJIV AAROGYASRI HOSPITAL

సమీపంలోని రాజీవ్​ ఆరోగ్యశ్రీ అందుబాటులో ఉన్న హాస్పిటల్ - ఈజీగా ఇలా కనుగొనండి!

How to Know Rajiv Aarogyasri Available Hospital
Rajiv Aarogyasri Hospital (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jan 2, 2025, 5:41 PM IST

How to Know Rajiv Aarogyasri Available Hospital :తెలంగాణ ప్రభుత్వం పేదోడి వైద్యానికి భరోసా కల్పించేందుకు వివిధ సంక్షేమ పథకాలను అందిస్తోంది. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం. ఈ స్కీమ్ కింద కార్పొరేట్‌ స్థాయిలో పేదలకు ఉచితంగా అందించే ఆరోగ్య శ్రీ సేవల పరిమితిని రూ.5 లక్షల నుంచి 10 లక్షల వరకు పెంచిన విషయం తెలిసిందే. అలాగే, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంలో ఇటీవల 163 చికిత్సలను యాడ్ చేసింది ప్రభుత్వం. ప్రస్తుతం కొత్తగా చేర్చిన చికిత్సలతో కలిపి మొత్తం 1,835 చికిత్సలకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద రూ.10 లక్షల దాకా ఉచిత వైద్యం అందిస్తోంది.

అయితే, ఈ పథకం కింద రాష్ట్రంలోని అన్నీ హాస్పిటల్స్​లో ఉచిత వైద్య చికిత్స పొందలేము. ఎందుకంటే ఆరోగ్యశ్రీ కార్డ్​ని ఆమోదించే కొన్ని హాస్పిటల్స్​లో మాత్రమే రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్యం పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి, దగ్గరలోని ఏ హాస్పిటల్​లో రాజీవ్ ఆరోగ్యశ్రీ అందుబాటులో ఉందని తెలుసుకోవడమెలా అని ఆలోచిస్తున్నారా? డోంట్​వర్రీ మీ ఫోన్​లో ఒక్క క్లిక్ ద్వారా ఈజీగా మీకు సమీపంలోని హాస్పిటల్ తెలుసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం.

రాజీవ్ ఆరోగ్యశ్రీ సౌకర్యం ఉన్న హాస్పిటల్ తెలుసుకోండిలా..

  • ఇందుకోసం ముందుగారాజీవ్ ఆరోగ్యశ్రీ పోర్టల్​ని https://www.rajivaarogyasri.telangana.gov.in/ASRI2.0/ సందర్శించాలి.
  • అనంతరం టాప్​ సర్వీస్ బార్​లో కనిపించే "Hospitals" అనే ఆప్షన్​పై క్లిక్ చేయాలి.
  • అప్పుడు Rajiv Aarogya Sri Hospitals అనే దానిపై నొక్కితే మీకు Search by Geography, Search by Speciality, Search by Locality అనే మూడు ఆప్షన్లు కనిపిస్తాయి.
  • ఈ మూడు ఆప్షన్ల ద్వారా దగ్గరలోని రాజీవ్ ఆరోగ్యశ్రీ హాస్పిటల్ కనుగొనవచ్చు. అప్పుడు మీరు అందులో ఎంచుకున్న ఆప్షన్​పై క్లిక్​ చేస్తే న్యూ పేజీ ఓపెన్ అవుతుంది.
  • మీరు ఎంచుకున్న దాని​ ప్రకారం సెర్చ్​ ఆప్షన్​లో మీ జిల్లా, మండలం, హాస్పిటల్, స్పెషాలిటీ, గవర్నమెంట్ లేదా ప్రైవేట్‌ని సెలెక్ట్ చేసుకోవాలి.
  • అనంతరం మీకు దగ్గరలోని రాజీవ్​ ఆరోగ్యశ్రీ అందుబాటులో ఉన్న హాస్పిటల్స్ డిస్​ప్లే మీద కనిపిస్తాయి. అప్పుడు మీకు ఇష్టమైన హాస్పిటల్​ని ఎంచుకోవచ్చు.
  • అదేవిధంగా హాస్పిటల్ అడ్రస్, ఆరోగ్య మిత్ర సభ్యుల పేర్లు, ఫోన్ నంబర్లు, ఆ హాస్పిటల్​లో రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద అందించే వైద్య సేవలు వంటి వివరాలను మీరు చూడవచ్చు.
  • కాబట్టి, మీరు రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్యం పొందాలనుకుంటే ఇలా సింపుల్​గా మీకు దగ్గరలోని హాస్పిటల్​ని తెలుసుకోండి. ఇంకేదైనా సందేహం ఉంటే మీరు వెళ్లాలనుకుంటున్న హాస్పిటల్ ఆరోగ్య​ మిత్ర సభ్యులకు ఫోన్ చేసి రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద మీరు పొందాలనుకుంటున్న వైద్య సేవలు ఆ హాస్పిటల్​లో అందుబాటులో ఉన్నాయో లేదో తెలుసుకొని వెళ్లడం బెటర్!

ABOUT THE AUTHOR

...view details