How to Check CAN in HMWSSB:హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (HMWSSB).. ద్వారా నీటి కనెక్షన్ పొందిన వారు కచ్చితంగా నీటి బిల్లులు చెల్లించాలి. ఇందుకోసం చాలా మంది అధికారిక వెబ్‌సైట్ లేదా ఇతర యాప్స్ ద్వారా బిల్స్ పే చేసేవారు. అయితే ఎలా బిల్ చెల్లించినా.. మీ వినియోగదారు ఖాతా నెంబర్(CAN) అనేది కచ్చితంగా ఎంటర్ చేయాలి. అయితే కొన్నిసార్లు ఈ నెంబర్‌ను మర్చిపోవడం జరుగుతుంటుంది. ఈ నెంబర్ లేకపోతే బిల్ చెల్లించలేము. అలాంటి సందర్భంలో చాలా మంది ఆందోళన చెందుతుంటారు. అయితే.. ఇకపై ఆ టెన్షన్ లేకుండా చాలా ఈజీగా CAN ను కనుగొనవచ్చని అధికారులు చెబుతున్నారు. మరి అది ఎలా కనుగొనాలి? అసలు CAN అంటే ఏంటి? CAN నెంబర్‌తో ఆన్లైన్ వాటర్ బిల్ ఎలా పే చేయాలి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..
CAN అంటే ఏమిటి: వినియోగదారు ఖాతా సంఖ్య (Consumer Account Number) అనేది ప్రతి HMWSSB వినియోగదారుకు ఉంటుంది. ఇది ప్రత్యేకమైన తొమ్మిది అంకెల సంఖ్యకు కలిగి ఉంటుంది. ఇది వినియోగదారునికి, హైదరాబాద్ మెట్రోపాలిటన్ నీటి సరఫరా, మురుగునీటి బోర్డు (HMWSSB) మధ్య లింక్‌గా పనిచేస్తుంది. వివిధ రకాల సేవలను యాక్సెస్ చేయడానికి.. ముఖ్యంగా నీటి కనెక్షన్ బుకింగ్, బిల్లింగ్ సమస్యలు, నీటి కాలుష్యం, ఇతర నీటి బిల్లు సంబంధిత సమస్యల గురించి ఫిర్యాదులు చేయడానికి ఈ నెంబర్ ఉపయోగపడుతుంది.
ఇంతటి ముఖ్యమైన ఈ నెంబర్‌ను మర్చిపోతే ఎలా అనుకుంటున్నారా? నో వర్రీ.. కేవలం నిమిషాల్లోనే HMWSSB అధికార వెబ్‌సైట్‌ను ఉపయోగించి కనుక్కోవచ్చు. అది ఎలాగంటే..
- ముందుగా TS HMWSSB పోర్టల్‌ని ఓపెన్ చేయండి. https://www.hyderabadwater.gov.in/en/index.php/
- హోమ్ పేజీలో Services ఆప్షన్‌పై క్లిక్ చేసి Customer Servicesలో Search Your Account NO(CAN)ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
- మీకు స్క్రీన్ మీద కొన్ని వివరాలు కనిపిస్తాయి. అంటే ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఫైల్ నెం, CAN, ఇంటి నెంబర్, ఫోన్ నెంబర్ అనే బాక్స్‌లు కనిపిస్తాయి.
- ఏదైనా ఒక బాక్స్‌లో వివరాలు ఎంటర్ చేసి View ఆప్షన్‌పై క్లిక్ చేస్తే వివరాలు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతాయి.
- ఉదా.. మీరు ముందుగా ఫస్ట్ నేమ్‌ను ఎంటర్ చేస్తే ఆ పేరుకు సంబంధించి ఎంత మందికి కనెక్షన్లు ఉన్నాయో.. వారి వివరాలు అన్ని స్క్రీన్ మీద కనిపిస్తాయి. అందులో మీ పేరు కనుక్కొని మీ CAN నెంబర్‌ను నోట్ చేసుకోవచ్చు.