తెలంగాణ

telangana

ETV Bharat / state

రైతులకు "వ్యయసాయ ఆదాయ ధ్రువీకరణ పత్రం" - ఆన్​లైన్​లో ఎలా అప్లై చేసుకోవాలో తెలుసా? - AGRICULTURE INCOME CERTIFICATE TG

- రైతులకు మేలు చేసే వ్యవసాయ ఆదాయ ధ్రువీకరణ పత్రం - నిమిషాల్లో అప్లై చేసుకోండిలా!

How to Apply Agriculture Income Certificate
How to Apply Agriculture Income Certificate (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : 6 hours ago

How to Apply Agriculture Income Certificate : ఇన్‌కమ్ సర్టిఫికేట్.. ఇది చాలా మందికి అనేక పనుల కోసం అవసరం అవుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న పలు సంక్షేమ పథకాల ప్రయోజనాలను పొందాలంటే.. ఈ సర్టిఫికెట్​ తప్పనిసరి. అయితే ఆదాయ ధ్రువీకరణ పత్రం అంటే సాధారణంగా కుటుంబ ఆదాయాన్ని నిర్ధారించేందిగా మాత్రమే తెలుసు. కానీ వ్యవసాయ ఆదాయానికి ప్రత్యేకంగా ఓ సర్టిఫికెట్​ ఉందని మీకు తెలుసా? అదే వ్యయసాయ ఆదాయ ధ్రువీకరణ పత్రం. మరి ఈ పత్రం అంటే ఏమిటి? ఎలా పొందాలి? కలిగే ప్రయోజనాలేంటి? అనే పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

వ్యవసాయ ఆదాయ ధ్రువీకరణ పత్రం అంటే ఏమిటి?: వ్యవసాయ ఆదాయ ధ్రువీకరణ పత్రం అనేది వ్యవసాయ భూమి నుంచి వచ్చే ఆదాయానికి సాక్ష్యంగా పనిచేసే పత్రం . ఇది అద్దె, పంటలు, జంతువులు, నర్సరీలు సహా వ్యవసాయ కార్యకలాపాల నుంచి ఉత్పత్తి అయ్యే అన్ని రకాల ఆదాయాలను కలిగి ఉంటుంది. వ్యవసాయం.. పన్ను పరిధిలోకి రానందున, రైతులు తమ ఆదాయాన్ని ధ్రువీకరించడానికి చెల్లుబాటు అయ్యే పత్రాన్ని కలిగి ఉండరు. ఈ సమస్యను పరిష్కరించడానికి తెలంగాణ ప్రభుత్వంవ్యవసాయ ఆదాయ ధ్రువీకరణ పత్రాన్ని ప్రవేశపెట్టింది. ఈ సర్టిఫికేట్ ప్రభుత్వ పథకాలు, రుణాలు, సబ్సిడీలను పొందడంతోపాటు వివిధ ప్రయోజనాల కోసం ఉపయోగపడుతుంది.

సాధారణఆదాయ ధ్రువీకరణ పత్రం అనేది వ్యవసాయం కాకుండా వ్యాపారం, పెట్టుబడులు, జీతం లేదా డివిడెండ్స్ వంటి ఇతర వనరుల నుంచి మీ ఆదాయాన్ని రుజువు చేసే పత్రం. వ్యవసాయ ఆదాయ ధృవీకరణ పత్రం.. పంటలు, అద్దె, అమ్మకాలు, పశువులు లేదా నర్సరీలు వంటి వ్యవసాయ కార్యకలాపాల ద్వారా మీ ఆదాయాన్ని ప్రత్యేకంగా రుజువు చేస్తుంది. ఈ రెండు రకాల సర్టిఫికెట్లు రుణాలు, ప్రభుత్వ పథకాలు, సబ్సిడీలు పొందేందుకు ఉపయోగపడతాయి.

వ్యవసాయ ఆదాయ పత్రం కోసం కావాల్సిన పత్రాలు :

  • రైతు ఆధార్​ కార్డ్​
  • రేషన్​ కార్డ్​
  • పట్టాదారు పాస్​బుక్​
  • భూమి వివరాలు

ఎలా దరఖాస్తు చేయాలి:వ్యవసాయ ఆదాయ ధ్రువీకరణ పత్రం కోసం మీ సేవా కేంద్రం ద్వారా ఆన్‌లైన్‌లో లేదా T యాప్​ ఫోలియో లేదా తహసీల్దార్ కార్యాలయంలో నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు.

మీసేవా కేంద్రం ద్వారా ఆన్​లైన్​లో అప్లై చేసుకునే విధానం:

  • ముందుగా తెలంగాణ మీ సేవ అధికారిక పోర్టల్​ను ఓపెన్​ చేయాలి. https://ts.meeseva.telangana.gov.in/
  • మీకు మీసేవా సిటిజన్​ లాగిన్​ ఉంటే హోమ్​ పేజీలో కుడివైపున లాగిన్ బాక్స్​లో వివరాలు ఎంటర్​ చేసి​ లాగిన్​ అవ్వాలి. ఒకవేళ మీ దగ్గర లాగిన్​ ఐడీ లేకపోతే లాగిన్​లోనే New User ఆప్షన్​పై క్లిక్​ చేసి రిజిస్ట్రేషన్​ పూర్తి చేసుకోవాలి. రిజిస్ట్రేషన్​ తర్వాత ఆ వివరాలతో లాగిన్​ అవ్వాలి.
  • లాగిన్​ అయిన తర్వాత Certificates లేదా సెర్చ్​ బార్​లో Agriculture Income Certificate అని సెర్చ్​ చేసి ఆ ఆప్షన్​పై క్లిక్​ చేయండి. లేదంటే హోమ్​ పేజీలో Citizen Servicesలో Revenueపై క్లిక్​ చేసి Agriculture Income Certificateపై క్లిక్​ చేయండి.
  • మీకు స్క్రీన్​ మీద అప్లికేషన్​ ఫారమ్​ డిస్​ప్లే అవుతుంది. అందులో వివరాలు ఎంటర్​ చేయాలి. అవి..
  • దరఖాస్తుదారుడి వివరాలు(పూర్తి వివరాలు, ఆధార్​)
  • భూమి వివరాలు
  • చిరునామా
  • ఆదాయ వివరాలు
  • పూర్తి వివరాలు ఎంటర్​ చేసిన తర్వాత కావాల్సిన పత్రాలు pdf ఫార్మాట్​లో అప్​లోడ్​ చేయాలి.
  • అన్ని వివరాలను మరొక్కసారి వెరిఫై చేసుకుని Submit బటన్​పై క్లిక్​ చేసి పేమెంట్​ పూర్తి చేయాలి.
  • పేమెంట్​ అయిపోయిన తర్వాత మీకు రసీదు జనరేట్​ అవుతుంది. దానిని సేవ్​ చేసి, ప్రింట్​ తీసి భద్రపరచుకోండి.
  • మీరు వ్యవసాయ ఆదాయ ధ్రువీకరణ పత్రం కోసం అప్లై చేసుకున్న పది రోజుల్లో మీకు అఫ్రూవల్​ వస్తుంది.
  • అప్రూవల్​ అయితే మీ మొబైల్​ నెంబర్​కు నోటిఫికేషన్​ వస్తుంది. అప్పుడు మీసేవా పోర్టల్​ ద్వారా డౌన్​లోడ్​ చేసుకోవచ్చు.

అప్లికేషన్​ స్టేటస్​ చెక్​ చేసుకోవడం ఎలా:వ్యవసాయ ఆదాయ ధ్రువీకరణ పత్రం కోసం అప్లై చేసుకున్న వారు మీ స్టేటస్​ ఈజీగా తెలుసుకోవచ్చు. అది ఎలాగంటే..

  • ముందుగా తెలంగాణ మీ సేవ అధికారిక పోర్టల్​ను ఓపెన్​ చేయాలి. https://ts.meeseva.telangana.gov.in/
  • హోమ్​ పేజీలో కుడివైపున సెక్షన్​లో Know Your Application Status బాక్స్​లో మీసేవా అప్లికేషన్​ నెంబర్​ ఎంటర్​ చేసి సెర్చ్​ సింబల్​పై క్లిక్​ చేయాలి.
  • మీ దరఖాస్తు ఏ దశలో ఉందో దానికి సంబంధించిన వివరాలు స్క్రీన్​ మీద కనిపిస్తాయి.

మీకు ఈ కార్డు ఉందా? - లేకపోతే చాలా పథకాలు మిస్ అయినట్లే- ఎలా అప్లై చేయాలో తెలుసా?

వడ్డీ లేకుండానే మహిళలకు రూ.5 లక్షల రుణం - ఎలా అప్లై చేసుకోవాలో తెలుసా?

ABOUT THE AUTHOR

...view details