How to Apply for Recounting After SSC Results: పదో తరగతి.. ప్రతి స్టూడెంట్ జీవితంలో కీ రోల్ పోషిస్తుంది. ఈ క్లాస్‌లో సాధించే మార్కులు, సబ్జెక్ట్ నైపుణ్యాలు భవితకు పునాదిగా నిలుస్తాయి. అంతేకాదు.. పదో తరగతి సబ్జెక్ట్‌ల్లో సాధించే మార్కుల ఆధారంగానే తర్వాత చేరాల్సిన ఉన్నత విద్య కోర్సుపై ఓ క్లారిటీ వస్తుంది. ఇంతటి కీలకమైన టెన్త్ క్లాస్ 2024 రిజల్ట్స్ ఏపీలో ఆల్రెడీ విడుదలయ్యాయి. తెలంగాణలో మరికొన్ని రోజుల్లో రిలీజ్ కానున్నాయి.
ఇదిలా ఉంటే.. పదో తరగతిలో ఆశించిన మార్కుల కంటే తక్కువ మార్కులు పొందామని ఫీలయ్యేవారు రీకౌంటింగ్‌కు వెళుతుంటారు. తమ అంచనాలకు భారీగా తేడా అనిపిస్తే రీ వాల్యూయేషన్‌ను ఆశ్రయిస్తారు. కాగా.. మరి రీకౌంటింగ్‌కు ఎలా అప్లై చేసుకోవాలో మీకు తెలుసా?
రీ-కౌంటింగ్, రీ-వాల్యూయేషన్ అంటే ఏమిటి?:
రీ-కౌంటింగ్ అనేది విద్యార్థులు తమ మార్కులతో సంతృప్తి చెందనట్లయితే వారి మార్కులను తిరిగి కౌంట్ చేయమనడానికి అప్లై చేసుకునే ప్రక్రియ. ఫలితాల ప్రకటన తర్వాత నిర్ణీత వ్యవధిలోపు మార్కుల రీకౌంటింగ్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్.. విద్యార్థులకు అనుమతిస్తుంది. ఇక రీవాల్యుయేషన్ అంటే సమాధాన పత్రాలను మళ్లీ తనిఖీ చేసి, మార్కులను మళ్లీ లెక్కించడం.
వైన్ షాపులు మళ్లీ బంద్ - వారంలోనే రెండోసారి! - మందు బాబులకు షాక్! - Liquor Shops Close in Hyderabad