తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్సు కోసం అప్లై చేస్తున్నారా? - ఈ డాక్యుమెంట్లు తప్పనిసరి - INTERNATIONAL DRIVING LICENSE - INTERNATIONAL DRIVING LICENSE

How to Apply for International Driving License in Telugu : విదేశీ రహదారులపై రయ్​రయ్​మంటూ దూసుకెళ్లాలనే కోరిక చాలా మందికి ఉంటుంది. కానీ అలా వెళ్లాలంటే అంతర్జాతీయ డ్రైవింగ్​ పర్మిట్​ తప్పనిసరి. ఈ ఐడీపీ ఉంటేనే అక్కడి రోడ్లపై ఎంచక్కా తిరగవచ్చు. మరి అలా తిరగాలంటే భారత్​ నుంచి వెళ్లేటప్పుడే అంతర్జాతీయ డ్రైవింగ్​ లైసెన్సుకు దరఖాస్తు చేసుకోవాలి. ఇంతకీ ఈ లైసెన్సుకు ఎలా అఫ్లై చేస్తారు. చేస్తే ఎన్నిరోజుల్లో వస్తుంది?

How to Apply for IDP
How to Apply for IDP (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Aug 23, 2024, 2:51 PM IST

Documents For International Driving License Application :విదేశీ రోడ్లపై కారు మీద చక్కర్లు కొట్టాలని చాలా మందికి ఉంటుంది. అలాగే కార్లపై రయ్​ రయ్​ మంటూ పర్యాటక ప్రదేశాలను చుట్టి రావాలని అనుకుంటారు. ముఖ్యంగా యూట్యూబర్స్​, చదువు, ఉద్యోగం, పర్యాటకం పేరుతో విదేశాలకు వెళ్లి అక్కడి ప్రదేశాలను చూడాలని అనుకుంటారు. కానీ వారికి కచ్చితంగా ఐడీపీ ఉండాల్సిందే. ఇంతకీ ఐడీపీ అంటే ఏంటి?. అది ఉంటేనే విదేశాల్లో వాహనం నడపడానికి ఆస్కారం ఉందా? అంటే అందరూ అవుననే సమాధానం చెబుతారు. ఎందుకంటే అక్కడ ఐడీపీ అంత ముఖ్యం.

ఇంతకీ ఐడీపీ అంటే అంతర్జాతీయ డ్రైవింగ్​ పర్మిట్​. ఈ లైసెన్సు ఉంటే విదేశాల్లో డ్రైవింగ్​ చేయడానికి అర్హత ఉన్నట్లు. లేకపోతే అక్కడి రోడ్లపై వాహనం నడపడానికి వీల్లేదు. ఈ ఐడీపీ లేకపోతే విదేశాల్లో పర్యాటక ప్రదేశాలు చూడడానికి వెళ్లినప్పుడు జేబులు ఖాళీ అవ్వక తప్పదు. అందుకే ఐడీపీకి దరఖాస్తు చేసుకొండి. అసలు ఈ లైసెన్సును పొందడానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి. ఎక్కడ చేసుకోవాలో తెలుసా?

దరఖాస్తు విధానం :

  • ముందుగా ఆర్టీఏ వెబ్​సైట్​ లేదంటే సమీపంలోని ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లాలి.
  • అక్కడ దరఖాస్తు కోసం ఫారం-4ఎ ను నింపాలి. ఈ ఫారం-4ఎతో పాటు ఈ కింది వాటిని అటాచ్​ చేయాలి.
  • డ్రైవింగ్​ లైసెన్సు జిరాక్స్​
  • ఆరోగ్య ధ్రువీకరణ పత్రం
  • పాస్​పోర్టు జిరాక్స్​
  • 4 పాస్​పోర్టు సైజు ఫొటోలు
  • నిర్ణీత రుసుం చెల్లించాలి.
  • వీటిని పరిశీలించిన తర్వాత ఇంటికే స్పీడ్​ పోస్టులో ఐడీపీ కార్డు పంపిస్తారు.

ఐడీపీ కార్డు పొందడానికి అర్హతలు :

  • ఈ ఐడీపీ కార్డు పొందడానికి 18 ఏళ్లు పైబడి వయసు ఉండాలి. దరఖాస్తు చేసిన తేదీ నుంచి కనీసం 6 నెలలపాటు చెల్లుబాటు అయ్యేలా పాస్​పోర్టు తప్పనిసరి. ఇంటి చిరునామా తెలిపే ఆధార్​, కరెంట్​ బిల్​ జత చేయాలి.
  • ఈ ఏడాది ఏప్రిల్​ నుంచి ఇప్పటివరకు 10,838 మంది ఈ ఐడీపీ లైసెన్సులు తీసుకొని విదేశాలకు వెళ్లారు. అంతర్జాతీయ డ్రైవింగ్​ లైసెన్సునే అంతర్జాతీయ డ్రైవింగ్​ పర్మిట్​గా వ్యవహరిస్తారు.
  • చదువుతోపాటు పార్ట్​టైం ఉద్యోగాలు చేసేందుకు కొన్ని దేశాల్లో నిబంధనలు చెల్లవు. దీంతో అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్సుతో తెలిసిన వారి వద్ద ఉద్యోగాలు చేసుకోవచ్చు.
  • మనదేశంలో తీసుకున్న లైసెన్సుతో దాదాపు 150 దేశాల్లో వాహనాలు నడపవచ్చు. ప్రస్తుతం అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్సు కావాలంటే భారత్​లో డ్రైవింగ్​ లైసెన్సు తప్పనిసరి.
  • ఐడీపీ ఉంటే స్థానికంగా తెలియని రోడ్లను సైతం సులువుగా నావిగేట్​ చేసుకోవచ్చు.
  • విదేశాల్లో అనేక కంపెనీలు వాహనాలు అద్దెకు ఇస్తుంటాయి. మన దగ్గర అంతర్జాతీయ డ్రైవింగ్​ లైసెన్సు ఉంటే జేబులుకు చిల్లు పడదు. ఎందుకంటే అక్కడ డ్రైవర్​లు దొరకడం కష్టం. లేకపోతే అక్కడి డ్రైవర్​ను పెట్టుకుంటే భారీ చెల్లింపులు చేయాలి.
  • చాలా మంది విదేశాలకు పర్యాటకం పేరుతో వెళుతుంటారు. అక్కడి దేశాలు చుట్టి యూట్యూబ్​ ఛానల్​లో వింతలు, విశేషాలు రికార్డు చేసి వారి ఛానళ్లలో పెడుతుంటారు. ఇలాంటి వారికి వారికి ఐడీపీ అనేది గ్లోబల్​ మొబిలిటీని కల్పిస్తుందని అనడంతో సందేహం లేదు.

ఇంటర్నేషనల్​ డ్రైవింగ్ లైసెన్స్ కావాలా? ఆన్​లైన్​లో అప్లై చేసుకోండిలా! - International Driving Licence

డ్రైవింగ్ లైసెన్స్ పాత పద్ధతిలోనే - ఆర్టీఏ నయా రూల్స్​కు స్పందించని రాష్ట్ర ప్రభుత్వం! - Driving License same as old system

ABOUT THE AUTHOR

...view details