తెలంగాణ

telangana

ETV Bharat / state

పక్షులు, జంతువులనూ ప్రేమగా పెంచుకోవడమే కాదు - ఇంటి అలంకరణలోనూ భాగం చేయొచ్చు! - HOME DECORATING IDEAS AND TIPS

ఇల్లు కట్టుకోగానే సరిపోదు, దాన్ని అందంగా అలంకరించుకోవడమూ ముఖ్యమే. ఎన్నో కలలతో నిర్మించుకున్న మీ సౌధానికి మరింత వన్నె తెచ్చేలా ఈ కొన్ని చిట్కాలు మీకోసం..

Some tips for home decoration
Some tips for home decoration (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Nov 1, 2024, 6:01 PM IST

Home Decorating Tips And Ideas :ఏంటి ? సింహం, కోతి, నెమలి, పెద్ద పులి.. అన్నీ గోడ ఎక్కేశాయినకుంటున్నారా? మరి పక్షులు, జంతువులు మన జీవితంలో ఆ స్థాయిలో మమేకమయ్యాయి. ప్రేమగా వీటిని పెంచుకోవడమే కాదు, ఇంటి డెకరేషన్​లోనూ భాగం చేస్తున్నారు ఇప్పుడు. సృజనాత్మకతను అద్దుకుని ఇలా ముద్దొచ్చే యానిమల్స్​, పక్షులు డిజైన్లలో వచ్చేస్తున్నాయి. అలాంటి వాటిలోవే ఇళ్లలో ఇప్పుడు ట్రెండీగా మారిన ఈ ‘వాల్‌ లైట్‌లు’ కూడా. బెడ్‌రూమ్, హాల్, బాత్‌రూమ్‌.. ఏ గోడకు అయినా వీటిని సులభంగా తగిలించేయొచ్చు. ఈ రంగురంగుల డిమ్‌ బల్బులు గది అందాన్నే పూర్తిగా మార్చేస్తాయి. ప్రశాంతమైన వాతావరణాన్ని ఇచ్చి, మన మనసులను కట్టిపడేస్తాయి. పడుకునే ముందు ట్యూబ్‌లైట్‌కు బదులుగా ఈ డిమ్‌ లైట్‌లు ఆన్‌ చేస్తే చాలు. పక్షులన్నీ ఆకాశంలో విహరిస్తున్నట్లుగా, జంతువులు మనతో ముచ్చటిస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఆ అనుభూతిని పొందాలంటే ఓసారి ప్రయత్నించి చూడండి.

Home Decorating With Animals And Birds (ETV Bharat)
Home Decorating With Animals (ETV Bharat)
Home Decorating With Birds (ETV Bharat)
Home Decorating With Animals (ETV Bharat)
Home Decorating with Birds (ETV Bharat)
Home Decorating With Birds (ETV Bharat)

పాతచీరతో ఇంటి అలంకరణ :ఇంట్లో కాస్త పాడైపోయినవో, చిరిగిపోయిన చీరలు చాలానే ఉంటాయి. వాటిని వృథాకాకుండా టెక్నాలజీని వినియోగించికొని కొత్త డిజైన్లలోకి మార్చుకోవచ్చు. అది ఎలానో చూసేద్దాం, మార్కెట్‌లో అనేక రకాల ఫ్యాన్సీ డిజైన్ల డోర్‌ మ్యాట్ల్‌ను కొంటుంటాం. దాన్ని బదులుగా ఈ సారి మీరు వినియోగించని పాత చీరలతో ఇలా అల్లేయండి. సౌకర్యంతో పాటూ ఎంతో మన్నికగానూ ఉంటాయి.

✵ వాడని రెండు మూడు రకాల సారీలను ఎంచుకుని వాటిని కర్టెన్లలా కుట్టి వేలాడదీయండి. గది లైట్​ఫుల్​గా కనిపిస్తుంది. అలానే కాస్త మెరుపు, ఆడంబరమైన అంచులు ఉండే సిల్క్‌ చీరలను ప్రత్యేక సందర్భాల్లో బ్యాక్‌డ్రాప్‌లగానూ వాడుకోవచ్చు.

✵ హాల్లో సోఫాల మీద ఉంచే దిండ్లకు ఓల్డ్​ శారీస్​తో తయారు చేసిన కవర్లను కుట్టి చూడండి. ఎంత క్లాసీ లుక్‌ని తెచ్చిపెడతాయో! డైనింగ్‌ టేబుల్‌ మీద సైతం పాత వాటిని పరిచి కొత్త అందాన్ని తెచ్చేయొచ్చు.

✵ దుమ్మూ ధూళీ, ఎండ వంటివాటి నుంచి రక్షణగా కట్టుకునే స్కార్ఫ్‌లనూ ఉపయోగించని చీరలతో కుట్టించుకోవచ్చు.

✵ మెడలో వేసుకునే జ్యూయెలరీ, చేతి గాజులను, హ్యాండ్‌ బ్యాగులను కూడా ప్రయత్నించి వైవిధ్యంగా కనిపించొచ్చు.

Home decoration with old saree (ETV Bharat)

హిస్టరీ రిపీట్ : బంగారం, బట్టలు ఏం కొనాలన్నా - దుకాణమే మీ ఇంటికొస్తుంది

ఇంటికి రంగులు వేయిస్తున్నారా? - ఈ పెయింట్స్​ వాడితే ఇంటికి అందం - మనకు ఆరోగ్యం!

ABOUT THE AUTHOR

...view details