తెలంగాణ

telangana

ETV Bharat / state

అడ్డగోలు సంపాదనతో 214 ఎకరాల కొనుగోలు - శివబాలకృష్ణ 'అక్రమ' లీలలు అన్నీఇన్నీ కావయా!

HMDA Shiva Balakrishna Case Update : అక్రమాస్తుల కేసులో హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్‌ శివబాలకృష్ణ ఏసీబీ కస్టడీ ముగిసింది. నిందితుడిని నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టగా, మరో 14 రోజులు రిమాండ్‌ను పొడిగించింది. 8 రోజుల విచారణలో శివబాలకృష్ణ చెప్పిన విషయాలు, బయటపడుతున్న ఆస్తులు, వాటిని కూడబెట్టేందుకు ఆయన అనుసరించిన విధానాలను చూసి ఏసీబీ అధికారులే నిర్ఘాంతపోతున్నారు.

HMDA Shiva Balakrishna Case Update
HMDA Shiva Balakrishna Case

By ETV Bharat Telangana Team

Published : Feb 8, 2024, 9:34 AM IST

తవ్వేకొద్దీ బయటపడుతున్న శివబాలకృష్ణ బాగోతం - అక్రమాస్తులు రూ. 250 కోట్ల పైమాటే.!

HMDA Shiva Balakrishna Case Update : ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టైన 'రెరా' మాజీ కార్యదర్శి శివబాలకృష్ణ(shivabalakrishna) భారీగా ఆస్తులు కూడబెట్టినట్టు ఏసీబీ కస్టడీలో బయటపడింది. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా రూ.250 కోట్లు విలువ చేసే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో వందల ఎకరాల్లో భూములు, ఖరీదైన విల్లాలు, బంగారం, ఇలా పెద్ద ఎత్తున ఆస్తులు కూడబెట్టినట్టు తేలింది. శివబాలకృష్ణ అక్రమ ఆస్తుల చిట్టా తవ్వేకొద్దీ బయటపడుతోంది. 8 రోజుల పాటు కస్టడీలోకి తీసుకున్న ఏసీబీ(ACB) అధికారులు అనేక కీలక విషయాలు రాబట్టారు.

ముగిసిన శివబాలకృష్ణ ఏసీబీ కస్టడీ - రూ.250 కోట్ల పైనే ఆస్తులున్నట్లు గుర్తింపు

Ex HMDA Director Shiva Balakrishna Case : బినామీల పేరిటే 214 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్టు తేలింది. అత్యధికంగా జనగామ జిల్లాలో 102 ఎకరాలు, నాగర్‌కర్నూల్‌ జిల్లాలో 39, సిద్దిపేట జిల్లాలో 7, యాదాద్రి జిల్లాలో 66 ఎకరాల వ్యవసాయ భూములను గుర్తించారు. అతని పేరిట మొత్తం 29 ఇళ్ల స్థలాలు ఉండగా ఏపీలోని విశాఖపట్నం, విజయనగరంలో కూడా స్థలాలు ఉన్నట్టు వెల్లడించారు. ప్రస్తుతం శివబాలకృష్ణ నివాసముంటున్న విల్లాతో పాటు హైదరాబాద్‌లో 4, రంగారెడ్డి జిల్లాలో 3 బహుళ అంతస్తుల భవనాల్లో ఫ్లాట్లు ఉన్నట్టు విచారణలో బయటపడింది. ఈ వ్యవహారంలోశివబాలకృష్ణకు అతని సోదరుడు నవీన్‌కుమార్‌తో పాటు మరో ముగ్గురు బినామీలు ఉన్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు.

నేటితో ముగియనున్న ఏసీబీ కస్టడీ - శివబాలకృష్ణపై 8వ రోజూ ప్రశ్నల వర్షం

Shiva Balakrishna Case : కస్టడీ ముగిసిన తర్వాత ఉస్మానియాలో వైద్య పరీక్షలకు తరలించారు. బుధవారంతో శివబాలకృష్ణ రిమాండ్‌ ముగియడంతో నాంపల్లి కోర్టులో హాజరు పరిచి తర్వాత చంచల్‌గూడ జైలుకు తరలించారు. మరోవైపు శివబాలకృష్ణ వల్ల నష్టపోయిన నలుగురు వ్యక్తులు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. దాన్ని కూడా పరిగణలోకి తీసుకొని రిమాండ్‌ పొడిగించే అవకాశం ఉంది. రెండు రోజుల క్రితం హెచ్ఎమ్​డీఏ కార్యాలయాల్లో సోదాలు చేసిన అనిశా పలు దస్త్రాలను స్వాధీనం సైతం చేసుకుంది. శివబాలకృష్ణ కస్టడీ విచారణలో భాగంగా అతని బంధువులను కూడా ఏసీబీ అధికారులు విచారించారు. వారి నుంచి సేకరించిన సమాచారంతో మరిన్ని ఆస్తులు బయటపడే అవకాశం ఉందని వెల్లడించారు.

"గత ఎనిమిది రోజుల పోలీస్​ కస్టడీలో 240 ఎకరాల వ్యవసాయ భూమి అక్రమంగా సంపాదించినట్లు గుర్తించాం. అత్యధికంగా జనగామ జిల్లాలో 102 ఎకరాలు, 29 ఇళ్ల స్థలాల్లో రంగారెడ్డిలోని వివిధ మండలాల్లో 12 ఇళ్ల స్థలాలు శివబాలకృష్ణ పేరిట ఉన్నట్లు తేలింది. నాగర్ కర్నూల్​ జిల్లాలో 39, సిద్దిపేటలో 7, యాదాద్రిలో 66 ఎకరాల స్థలాలు ఉన్నట్లు విచారణలో గుర్తించాం. ఈ బినామీ ఆస్తులు బాలకృష్ణ బంధువుల పేరిట రిజిస్ట్రర్​ చేయించుకున్నారు. విచారణ ఇంకా కొనసాగుతుంది." - సుధీంద్ర, అ.ని.శా సంయుక్త సంచాలకులు

ఏసీబీ కస్టడీకి శివబాలకృష్ణ - 15 బ్యాంకు ఖాతాల లవాదేవీలపై అధికారుల ఆరా

ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్న శివబాలకృష్ణ లీలలు - అజ్ఞాతంలోకి ఆ నలుగురు!

ABOUT THE AUTHOR

...view details