తెలంగాణ

telangana

ETV Bharat / state

చంచల్‌గూడ జైలుకు శివబాలకృష్ణ - బినామీలను విచారించడంపై ఏసీబీ ఫోకస్ - RERA Secretary ShivBalakrishna case

HMDA Ex Director Shiva Balakrishna Case Updates : ఆదాయానికి మించిన అస్తుల కేసులో తెలంగాణ రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ(రెరా) కార్యదర్శి, హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ప్రణాళిక విభాగం అధికారి శివబాలకృష్ణకు ఏసీబీ కోర్టు 14 రోజుల జ్యూడిషల్ రిమాండ్‌ విధించింది. అంతకుముందు ఆయన నివాసంతో పాటు బంధువుల ఇళ్లలో సోదాలు జరిపిన ఏసీబీ అధికారులు, భారీగా నగదు, బంగారం, వెండి ఆభరాణాలను స్వాధీనం చేసుకున్నారు. అతనికి వివిధ ప్రాంతాల్లో స్ధిరాస్తులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వాటి విలువ బహిరంగ మార్కెట్‌లో కోట్లలో ఉంటుందని అంచనా వేస్తున్నారు.

RERA Secretary Shiva Balakrishna Case Updates
RERA Secretary Shiva Balakrishna Case Updates

By ETV Bharat Telangana Team

Published : Jan 26, 2024, 10:53 AM IST

HMDA Ex Director Shiva Balakrishna Case Updates : తెలంగాణ రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ(రెరా) కార్యదర్శి, హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ప్రణాళిక విభాగం అధికారి శివబాలకృష్ణపై (RERA Secretary Shiva Balakrishna) ఆదాయానికి మించిన ఆస్తుల కేసును ఏసీబీ అధికారులు నమోదు చేశారు. బుధవారం తెల్లవారుజామున 4 గంటల నుంచి అర్ధరాత్రి వరకు 16 బృందాలతో అధికారులు సోదాలు నిర్వహించారు. హైదరాబాద్ మణికొండ పుప్పాలగూడలోని ఆదిత్య పోర్ట్‌వ్యూ విల్లాలోని అతని నివాసంతోపాటు బంధువులు, సన్నిహితుల ఇళ్లు, కార్యాలయాల్లో అనిశా బృందాలు దాడులు జరిపాయి.

ACB Arrested Shiva Balakrishna :ఈ తనిఖీల్లో భాగంగా రూ.99.60లక్షల నగదు, పలు ఆస్తిపత్రాలు, రిజిస్ట్రేషన్ దస్తావేజులు, సుమారు రెండుకిలోల బంగారు ఆభరాణాలు, ఆరు కిలోల వెండిని ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. శివబాలకృష్ణకు రూ.5.96కోట్ల స్థిరాస్తులు ఉన్నాయిని గుర్తించారు. బహిరంగ మార్కెట్‌లో వీటి విలువ రూ.8.26కోట్లు ఉంటుందని అనిశా అధికారులు వెల్లడించారు.

ACB Caught PanchayatRaj AE : అనిశా వలలో మరో అవినీతి చేప.. లంచం తీసుకుంటూ రెడ్​హ్యాండెడ్​గా పట్టుబడ్డ పంచాయతీరాజ్​ ఏఈ

శివబాలకృష్ణ ఆస్తులకు సంబంధించి కొద్దిరోజుల క్రితమే ఏసీబీకి ఫిర్యాదు అందింది. అందులోని సమాచారం ఆధారంగా పలు ఆస్తుల దస్తావేజుల్ని సంపాదించిన అనిశా అధికారులు, బుధవారం తెల్లవారుజామునే పలుచోట్ల ఏకకాలంలో దాడులు నిర్వహించింది. బాలకృష్ణతోపాటు కుటుంబసభ్యులు తనిఖీలకు సహకరించపోవడంతో గంటల తరబడి ప్రక్రియ కొనసాగింది. అలాగే అతడు తన అక్రమ సంపాదనతో పలువురు బినామీల పేరిట ఆస్తులు కొనుగోలు చేసినట్లు అవినీతి నిరోధక శాఖ అధికారులు సమాచారం సేకరించారు.

ACB Raids in RERA Secretary Shiva Balakrishna House :తనిఖీల అనంతరం శివబాలకృష్ణను బంజారాహిల్స్‌లోని అవినీతి నిరోధక శాఖ కార్యాలయానికి తీసుకెళ్లి విచారించారు. ఆ తర్వాత అనిశా అధికారులు బాలకృష్ణను ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. విచారణ జరిపిన కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో అధికారులు అతడిని చంచల్‌గూడ జైలుకు తరలించారు.

మరోవైపు శివబాలకృష్ణ లీలలు ఒక్కొకటిగా బయటకు వస్తున్నాయి. హైకోర్టు వివాదంలో ఉన్న విలువైన భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు కట్టబెట్టారని బాధితుడు సూర్యప్రకాశ్ ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా పుప్పాలగూడ సర్వేనెంబర్ 446 పరిధిలోని వివాదస్పద భూముల్లో కట్టడాలకు అనుమతి ఇచ్చినట్టు వివరించారు. ఈ అక్రమ అనుమతులపై హైకోర్టుకు వెళ్తే కోర్టును తప్పుదోవ పట్టించి నకిలీ అఫిడవిట్ వేశారని అన్నారు. ఇందులో ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారులు ఉన్నారని చెప్పారు. గతంలో తనను కూడా బెదిరించారని వెల్లడించారు. శివబాలకృష్ణపై సమగ్ర దర్యాప్తు జరిపి న్యాయం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అతడి హయాంలో జరిగిన అవినీతిపై త్వరలోనే ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేస్తానని సూర్యప్రకాశ్ వెల్లడించారు.

Banjarahills CI Bribe Case Updates : బంజారాహిల్స్ పోలీసుల వసూళ్ల పర్వంపై లోతుగా విచారణ.. ముడుపులు, కమీషన్లపై అనిశా ఆరా

RERA Secretary Shiva Balakrishna Case :సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలోనూ శివబాలకృష్ణ లీలలు వెలుగులోకి వచ్చాయి. నిబంధనలకు విరుద్ధంగా గత సంవత్సరం అక్కడి ఐడీఏ బొల్లారం పారిశ్రామికవాడలో రెసిడెన్షియల్‌ విల్లాలకు అనుమతులు ఇచ్చాడు. ఓ పరిశ్రమకు కేటాయించిన 8 ఎకరాలను, ఓ స్థిరాస్తి సంస్థ కొనుగోలు చేసి హెచ్‌ఎండీఏ నుంచి దొడ్డిదారిన అనుమతి పొంది ఇండ్ల నిర్మాణాలు చేపట్టింది. ఈ నేపథ్యంలోనే పరిశ్రమల యాజమాన్యాలు అభ్యంతరం తెలిపినా పట్టించుకోలేదు. ఇళ్లను నిర్మించేందుకు ఆ భూమిలో ఎకరం పరిధిలో ఉన్న ఓ నీటి కుంటను సైతం పూడ్చివేశారు.

ఏళ్ల తరబడి హెచ్ఎండీఏలో విధులు నిర్వహించిన శివబాలకృష్ణ కోట్ల రూపాయలు కొల్లగొట్టారని ఏసీబీ అధికారులు (Telangana ACB) భావిస్తున్నారు. అతడిని కస్టడీలోకి తీసుకొని విచారిస్తే మరింత సమాచారం రాబట్టవచ్చని చెబుతున్నారు. బినామీలను విచారించడంపైనా దృష్టి పెట్టారు. ఇప్పటివరకు అతడి బ్యాంకు లాకర్లపై అధికారులు దృష్టి పెట్టారు. కానీ అతనికి ఎలాంటి లాకర్లు లేనట్లు సమాచారం.

హెచ్ఎండీఏ డైరెక్టర్‌ ఇంట్లో ఏసీబీ సోదాలు - రూ.100 కోట్లకుపైగా ఆస్తులు గుర్తింపు

గొర్రెల నిధుల గోల్‌మాల్‌పై ఏసీబీ లోతైన దర్యాప్తు - 2 కోట్ల నిధులకు పైగా దారి మళ్లినట్లు గుర్తింపు

ABOUT THE AUTHOR

...view details