High Demand for Lands in Hyderabad: హైదరాబాద్‌లో స్థలమైనా, ఇళ్లైనా కొనుక్కోవాలని చాలా మంది కోరుకుంటారు. అయితే కొందరు మాత్రం ఫ్లాట్ ఏ ప్రాంతంలో ఉండే బాగుంటుందో అనే విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులతో పాటు భవిష్యత్తును సైతం దృష్టిలో పెట్టుకొని కొనుగోలు చేస్తున్నారు. ముఖ్యంగా చాలా మంది హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లి, చందానగర్, అమీన్‌పూర్ మధ్య ప్రాంతాన్ని ఎక్కువగా ఎంచుకుంటున్నారు. చందానగర్‌లోని శ్రీదేవి థియేటర్ రోడ్డు నుంచి అమీన్‌పూర్ వైపు వెళ్లే దారిలో శరవేగంగా కాలనీలు ఏర్పడుతున్నాయి. గచ్చిబౌలి, మాదాపూర్‌లోని సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగుల్లో ఈ ఏరియాని సెలక్ట్ చేసుకుంటున్నారు.
ఈ ప్రాంతాన్ని మాత్రమే సెలక్ట్ చేసుకోవడానికి కారణాలేంటి?:ఈ ప్రాంతం ఓవైపు జాతీయ రహదారికి, మరోవైపు ఓఆర్‌ఆర్‌కు దగ్గర ఉంది. భవిష్యత్‌లో ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందడమే కాకుండా, అన్ని అవసరాలకూ అనువుగా ఉంటుందని కొనుగోలుదారులు భావిస్తున్నారు. దీంతో స్థలాల కొనుగోలు నుంచి ఇళ్ల నిర్మాణాలతో శరవేగంగా కాలనీలు ఏర్పడుతున్నాయి.
జాతీయ రహదారికి దగ్గరగా :జాతీయ రహదారి దగ్గరగా నివాసం ఉంటే చాలా విధాలుగా మేలు చేస్తుంది. ఏ సమయంలో ఎక్కడకి వెళ్లాలన్నా ఎటువంటి సమస్యలు ఉండవు. అదే విధంగా జాతీయ రహదారి నుంచి ఓఆర్‌ఆర్‌కు సులువుగా చేరుకోవచ్చు. చందానగర్ నుంచి అమీన్‌పూర్ వరకు రహదారిని 150 అడుగులకు విస్తరించే పనులపై జీహెచ్‌ఎంసీ దృష్టి సారించడంతో, కొనుగోలుదారులు త్వరపడుతున్నారు. ఇప్పటికే ఈ ప్రాంతంలో పలురకాల దుకాణాలు, చిన్నపాటి కాంప్లెక్స్‌లు వెలిశాయి.
రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్ చేయాలా? ఈ టాప్-5 టిప్స్ పాటిస్తే లాభాలు గ్యారెంటీ!