తెలంగాణ

telangana

ETV Bharat / state

కేపీహెచ్​బీ సరికొత్త రికార్డ్ - వేలంపాటలో గజం రూ.లక్షా 85 వేలు - HIGH COURT ON KPHB SITES AUCTION

కేపీహెచ్​బీ ఖాళీ స్థలాల వేలం పాట - గజం రూ.లక్షా 85వేలు పలికిన ధర - వేలం పాట దక్కినవారికి ప్లాట్లు కేటాయించకూడదని హైకోర్టు ఆదేశం

High Court Inquiry on KPHB Sites Auction
High Court Inquiry on KPHB Sites Auction (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jan 24, 2025, 4:04 PM IST

Updated : Jan 24, 2025, 5:21 PM IST

High Court on KPHB Plots Auction :కేపీహెచ్​బీలో పలు స్థలాలకు జరుగుతున్న వేలంపాటలో గజం ధర రికార్డు స్థాయిలో పలికింది. ఒకచోట గజానికి రూ.లక్షా 85వేల ధర పలకగా, అత్యల్పంగా రూ.లక్షా 50వేలు ధర పలికింది. ఇవాళ కూకట్​పల్లి హౌసింగ్​ బోర్డు పశ్చిమ డివిజన్​ పరిధిలోని పలు స్థలాలకు వేలం పాట పూర్తయింది. భారీ పోలీసు బందోబస్తు మధ్య ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేలంపాటలో పాల్గొనడానికి డీడీలతో కొనుగోలుదారులు పెద్ద సంఖ్యలో వచ్చారు. మొత్తం 24 స్థలాలకు వేలం నిర్వహించగా 23 స్థలాలకు వేలం పూర్తయింది.

వేలం పాటపై హైకోర్టులో పిటిషన్ :మరోవైపు ఈ స్థలాలు విక్రయించరాదంటూ ఫేజ్-15 కాలనీ వాసులు వేసిన పిటిషన్​పై తెలంగాణ హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి. పిటిషన్​పై జస్టిస్ టి.వినోద్ కుమార్ విచారణ చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా ప్లాట్లను వేలం వేస్తున్నారని పిటిషన్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. 80 ఫీట్లుగా ఉన్న రహదారిని వంద ఫీట్లు రహదారిగా మార్చేందుకు ప్రతిపాదన ఉందని, కానీ అధికారులు రహదారికి అటు ఇటువైపు ఉన్న పది ఫీట్ల స్థలాలను ప్లాట్లగా మార్చి విక్రయిస్తున్నారని న్యాయవాది రూపేందర్ వాదించారు.

కోర్టు ప్రశ్నలు : లేఅవుట్​లో 54.29 ఎకరాల స్థలంలో ఉందని అందులో 10శాతం గ్రీనరీ కోసం కేటాయించారా అని ప్రశ్నించారు. గ్రీనరీ కోసం కేటాయించిన స్థలాన్ని ప్లాట్లుగా విక్రయిస్తున్నారా అని అడిగారు. ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు. దీనికి సమాధానమిస్తూ 10శాతం ఖాళీ స్థలాన్ని ఇప్పటికే జీహెచ్​ఎంసీకి అప్పగించామని కోర్టుకు తెలిపారు.

ప్లాట్లు కేటాయించొద్దు :ఆసియాలోనే అతిపెద్ద, పాతదైన లేఅవుట్, పాతదైన లేఅవుట్ కేపీహెచ్​బీ ఆని ప్రశ్నించగా, అక్కడక్కడ మిగిలిన ప్లాట్లను మాత్రమే వేలం వేస్తున్నట్లు ఏడీ వివరించారు. 30 గజాల స్థలం కేవలం వ్యాపార అవసరాలకు మాత్రమే ఉపయోగపడుతుందని, అలాగే లేఅవుట్ గ్రీనరీ కోసం కేటాయించిన 10శాతం భూమి వివరాలు సమర్పించాలని ధర్మాసనం ఆదేశించింది. వేలం నిర్వహించుకోవచ్చని, కానీ ప్లాట్లు దక్కించుకున్న వాళ్లకు, తదుపరి ఆదేశాలు వచ్చేవరకు కేటాయించొద్దని తెలిపింది.

భారీ బందోబస్తు మధ్య వేలంపాట :

'హౌసింగ్‌ బోర్డు' ఫర్​ సేల్ - ఆ 2 రోజుల్లో వేలం - త్వరపడండి

Last Updated : Jan 24, 2025, 5:21 PM IST

ABOUT THE AUTHOR

...view details