తెలంగాణ

telangana

ETV Bharat / state

తెలంగాణ జొన్నరొట్టె, అంకాపూర్ చికెన్, హైదరాబాద్​ బిర్యానీ : హీరో నాగార్జున వీడియో - NAGARJUNA ON TELANGANA TOURISM

తెలంగాణలోని ప్రముఖ స్థలాలు, ఫుడ్​పై హీరో నాగార్జున ప్రత్యేక వీడియో - "జరూర్​ ఆనా హమారా తెలంగాణ" అంటూ ఆసక్తి రేకెత్తించిన నాగార్జున

TELANGANA TOURISM
ACTOR NAGARJUNA SPECIAL VIDEO (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : 16 hours ago

Nagarjuna Special Video on Telangana Tourism : తెలంగాణకు పర్యాటకులు రావాలని, ఇక్కడ ఎన్నో అద్భుతమైన ప్రదేశాలున్నాయని ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున వీడియో ద్వారా పిలుపునిచ్చారు. తెలంగాణ పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడంలో భాగంగా ప్రభుత్వానికి తనవంతు సహకారాన్ని అందిస్తూ నాగార్జున మాట్లాడిన ప్రత్యేక వీడియో తెలంగాణ టూరిజం విడుదల చేసింది. తెలంగాణలోని ప్రముఖ ప్రదేశాలు, తనకు నచ్చిన ఆహార విషయాలను ఆ వీడియోలో పంచుకున్నారు.

"అందరికీ నమస్కారం నేను మీ నాగార్జున. చిన్నప్పటి నుంచి తెలంగాణలో మొత్తం తిరిగాను. ఇక్కడ అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి. బొగత జలపాతం, జోదేఘాట్‌ వ్యాలీ, మిట్టే అందంగా ఉంటాయి. ఇక దేవాలయాల విషయానికొస్తే, వరంగల్‌లో వెేయి స్తంభాల గుడి, రామప్ప దేవాలయం. దీన్ని వరల్డ్​ హెరిటేజ్​ సంపదగా యునెస్కో గుర్తించింది. ప్రతి ఒక్కరూ చూడాలి. నిజంగా ఎంతో అందమైందే కాదు, ఆధ్యాత్మికతను పెంపొందిస్తుంది. యాదగిరి గుట్ట పుణ్యక్షేత్రానికి చాలా సార్లు వెళ్లాను. ఆ ఆధ్యాత్మిక అనుభూతిని మాటల్లో చెప్పలేను. ఇక ఫుడ్​ విషయానికి వస్తే తెలంగాణ భోజనంలో జొన్నరొట్టె, అంకాపూర్‌ చికెన్‌, సర్వపిండి చాలా ఇష్టం. ఇరానీ ఛాయ్‌, కరాచీ బిస్కెట్‌, హైదరాబాద్‌ బిర్యానీ గురించి మీకు స్పెషల్​గా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసిందే. ఇవన్నీ మర్చిపోలేను. మీతో చెబుతుంటే నా ఊరిళ్లొస్తున్నాయి. ప్రజల ఆదరణ కూడా వీటికి చాలా బాగుంటుంది. మీరందరూ రండి. జరూర్​ ఆనా హమారా తెలంగాణ"-హీరో నాగార్జున

తెలంగాణ జొన్నరొట్టె, అంకాపూర్ చికెన్, హైదరాబాద్​ బిర్యానీ : హీరో నాగార్జున వీడియో (ETV Bharat)

వర్ణించలేని అద్భుతాలు : తెలంగాణలో చిన్నప్పటి నుంచి విడిగా తిరిగిన తనకు ఎన్నో అద్భుతమైన ప్రదేశాలు తెలుసన్నారు. వరంగల్​లో వేయి స్తంభాల గుడి, రామప్ప దేవాలయం, యాదగిరి గుట్ట లాంటి మాటల్లో వర్ణించలేని ఎన్నో అద్భుతాలున్నాయని తెలిపారు. అలాగే తెలంగాణ భోజనంలో జొన్నరొట్టె, అంకాపూర్ చికెన్​తో పాటు సర్వపిండి, ఇరానీ ఛాయ్, కరాచీ బిస్కెట్ పేర్లు చెబితే నోరూరుతుందన్నారు. తెలంగాణలోని ప్రతి ప్రాంతాన్ని ఆస్వాదించేందుకు పర్యాటకులు రావాలని నాగార్జున విజ్ఞప్తి చేశారు.

ఈ వీడియోలో తెలంగాణలోని ప్రాంతాల గురించి మాట్లాడినందుకు నటుడు నాగార్జునకు తెలంగాణ టూరిజం కృతజ్ఞతలు తెలిపింది. ఇక నాగార్జున ప్రస్తుతం తమిళ దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌ చిత్రికరిస్తున్న కూలి అనే సినిమాలో నటిస్తున్నారు. కథానాయకుడిగా సూపర్​ స్టార్​ రజనీకాంత్‌ నటిస్తున్నారు. అలాగే తెలుగు డైరెక్టర్​ శేఖర్‌ కమ్ముల డైరెక్షన్​లో కుబేరలోనూ నాగార్జున ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.

భారత్‌లోనే తొలిసారి అలా - 'పుష్ప 2'తో ప్రారంభం : హీరో నాగార్జున

కాబోయే కోడలిపై నాగ్​ మామ ప్రశంసలు - ఇంతకీ ఆయన ఏమన్నారంటే?

ABOUT THE AUTHOR

...view details