ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఈదురు గాలులతో భారీ వర్షాలు- రహదారులపై నిలిచిన నీరు- స్తంభించిన జనజీవనం - Heavy Rains in Andhra Pradesh

Heavy Rains in Andhra Pradesh : రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఈదురు గాలులతో కురిసిన వర్షాలు భీభత్సం సృష్టించాయి. రహదారులు జలమయమయ్యాయి. పలు చోట్ల హోర్డింగ్​లు, వృక్షాలు నేలకొరిగాయి. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్​ తీగలు తెగి విద్యుత్​ ​ సరఫరా నిలిచిపోయింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 19, 2024, 12:48 PM IST

Updated : Jun 19, 2024, 3:31 PM IST

Etv Bharat
Etv Bharat (Etv Bharat)

Heavy Rains Kadapa District Roads Filled with Rain Water :వైఎస్‌ఆర్‌ జిల్లాలో గత రెండు రోజుల నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షం ధాటికి కడప నగరంలోని రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. నగరంలో మురికి కాలువల నిర్మాణం జరుగుతున్నందున వర్షం నీరు ఎటు వెళ్లలేని పరిస్థితుల్లో మోకాళ్ల లోతు వరకు నిల్వ ఉంది. ఆర్టీసీ బస్టాండ్ రోడ్డు, జిల్లా కోర్టు రోడ్డు, రైల్వే స్టేషన్ రోడ్డు, భరత్ నగర్, భాగ్యనగర్ కాలనీ, అప్సర కూడలి ప్రాంతాలన్నీ వర్షం నీటితో నిండిపోయాయి. దీంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బస్టాండ్ ప్రాంగణంలోకి వర్షం నీరు చేరింది. ప్రొద్దుటూరు, రాజుపాలెం, మైదుకూరు, బద్వేల్ ప్రాంతాల్లోనూ భారీ వర్షం కురిసింది. లోతట్ట ప్రాంతాల్లోకి వర్షం నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Property Damage Due to Heavy Rain & Strong Winds in Guntur :గుంటూరు జిల్లా తెనాలిలో భారీ వర్షం కారణంగా జనజీవనానికి అస్తవ్యస్తం అయ్యింది. భారీ వర్షానికి ఈదురు గాలులు తోడవటంతో భారీగా ఆస్తి నష్టం జరిగింది. గంటన్నర సేపు కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. నెహ్రూ రోడ్డులో కోటి నాగయ్య వైద్యశాల నుంచి రజకచెరువు పార్క్ వరకు రోడ్డుపై ద్విచక్ర వాహనాలు మునిగిపోయాయి. వాహనదారులతో పాటు స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈదురు గాలులకు తెనాలి విజయవాడ రోడ్డులో నందివెలుగు వద్ద చెట్లు విరిగి రోడ్డుపై పడ్డాయి. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నందివెలుగు కూడలిలో ఏర్పాటు చేసిన భారీ హోర్డింగ్ విరిగిపడింది. నందివెలుగు నుంచి గుంటూరు మార్గంలో ఎరుకలపూడి అడ్డరోడ్డు వద్ద విద్యుత్ లైన్లు తెగి రోడ్డుపై పడ్డాయి. వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. రోడ్లు భవనాల శాఖ కార్యాలయం, పోస్టాఫీసు ప్రాంగణాల్లోకి వర్షపు నీరు వచ్చి చేరింది.

మన్యం, అనకాపల్లి జిల్లాల్లో వర్షం బీభత్సం - గాలికి నేలకొరిగిన చెట్లు, విద్యుత్‌ స్తంభాలు - Wind Rain Disaster in AP

Power Supply Stopped Due Heavy Rains in Srikakulam District : శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో అర్ధరాత్రి ఈదురుగాలులతో వర్షం పడి పలుచోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగింది. పలు ప్రాంతాల్లో రాకపోకలు స్తంభించాయి. మున్సిపల్ కార్యాలయం సమీపంలో ప్రధాన రహదారి వద్ద భారీ చెట్టు నేలకొరిగి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రైల్వే స్టేషన్​కు వెళ్లే ప్రాంతంలో భారీ చెట్టు రోడ్డుపై నిలిపి ఉన్న ఆటో పై పడింది. దీంతో రైల్వేస్టేషన్‌కు వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా ఈరోజు (బుధవారం) ఉదయం భారీ వర్షం కురిసింది జిల్లాలో సగటు వర్షపాతం 25.70 మిల్లీమీటర్ల నమోదయింది. జిల్లా కేంద్రం అమలాపురం సహా 22 మండలాల్లోనూ వర్షం కురిసింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా దెబ్బతిన్న రహదారులు వర్షానికి చెరువులను తలపిస్తున్నాయి.

ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో గాలి-వాన బీభత్సం సృష్టించాయి. ఒక్కసారిగా వాతావరణం మారిపోయి ఈదురుగాలులు వీచాయి. దీంతో పలు గ్రామాల్లో భారీ చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. జంగారెడ్డిగూడెంలో ప్రచార హోల్డింగ్ ద్విచక్ర వాహనంపై పడడంతో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. బాధితున్ని స్థానికులు ఆస్పత్రికి తరలించి వైద్యం అందించారు. జంగారెడ్డిగూడెం నుంచి ఏలూరు వెళ్లే ప్రధాన రహదారిలో గురయిగూడెం వద్ద భారీ చెట్టు రోడ్డుకు అడ్డంగా పడడంతో వాహన రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే దేవులపల్లి వద్దనున్న తాటి చెట్టు విద్యుత్ తీగలపై పడటంతో విద్యుత్తుకు అంతరాయం ఏర్పడింది.

ఉమ్మడి కర్నూలు జిల్లాలో విస్తారంగా వర్షాలు- ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగులు - Heavy Rains in Kurnool District

Last Updated : Jun 19, 2024, 3:31 PM IST

ABOUT THE AUTHOR

...view details