ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉమ్మడి కర్నూలు జిల్లాలో విస్తారంగా వర్షాలు- ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగులు - Heavy Rains in Kurnool District - HEAVY RAINS IN KURNOOL DISTRICT

Heavy Rains in Kurnool District : రుతుపవనాలు ప్రభావంతో కర్నూలు జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. తీవ్ర ఉష్ణోగ్రతలతో అల్లాడిపోయిన ప్రజలకు కాస్త ఉరట లభించింది. పలుచోట్ల వాగులు ఉద్ధృతంగా ప్రవహించడంతో గ్రామాల ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు.

rains_in_kurnool
rains_in_kurnool (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 6, 2024, 12:23 PM IST

Heavy Rains in Kurnool District :కర్నూలు జిల్లాలో కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కర్నూలులో కురిసిన భారీ వర్షానికి గార్గేయపురం చెరువు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో సమీపంలోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. కర్నూలు సమీపంలోని వెంకాయపల్లి, నూతనపల్లి, నందవరం, మిలిటరీ కాలనీ, లక్ష్మీనగర్, భూపాల్ నగర్ లోని పలు కాలనీల్లోకి భారీగా వర్షపు నీరు చేరింది. దీంతో కాలనీవాసులు తీవ్రఇబ్బందులు పడుతున్నారు.

రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల ప్రభావం - రాబోయే 4 రోజులు పాటు వర్షాలు కురుస్తాయన్న అధికారులు - Rain Effect In AP

కర్నూలులో విస్తరంగా వర్షాలు - ఉద్ధృతంగా ప్రవహిస్తున్న గార్గేయపురం చెరువు (ETV Bharat)

స్థానిక వెంకాయపల్లె ఎల్లమ్మ దేవాలయంలోకి వర్షపు నీరు చేరింది. తరచూ ముంపుతో కష్టాలు పడుతున్నామని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంట్లోకి వర్షం నీరు చేరడంతో బియ్యం పాటు తదితర నిత్యవసర వస్తువులు తడిచిపోయాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై పాలకులు, అధికారులకు ఎన్ని సార్లు విన్నవించుకున్న ఎలాంటి ఫలితం లేదని వాపోయారు. తమ ప్రాంతంలో ముంపు నివారణకు చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. నగర వద్ద చెరువు పొంగిపొర్లుతుంది. పంట పొలాల్లోకి వరద చేరి రైతులు నష్టపోయారు.

రుతుపవనాల ప్రభావంతో దంచికొట్టిన వానలు - పలు గ్రామాలకు నిలిచిన రాకపోకలు - Heavy Rains In Andhra Pradesh

నంద్యాల జిల్లా కురిసిన భారీ వర్షం కారణంగా ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురయ్యింది. బనగానపల్లెతో పాటు పలు మండల్లో కురిసిన భారీ వర్షానికి పాలేరు వాగు పొంగి ప్రవహిస్తుంది. 4 అడుగుల మేర వంతెనపై వరద నీరు ప్రవహిస్తుండడంతో కోయిలకుంట్ల డిపోకు చెందిన బస్సు వరద నీటిలో చిక్కుకుంది. బస్సులో దాదాపుగా 25 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. బస్సు వంతెన పైనుంచి వాగులోకి ఒకవైపు ఒరిగింది. ప్రమాదాన్ని గుర్తించిన ఆర్టీసీ డ్రైవర్ బస్సును నిలిపివేశారు. ప్రయాణికులను బస్సులో నుంచి క్షేమంగా కిందికి దిగారు. పాలేరు వాగు వంతెనపై వర్షపు నీరు ప్రవహిస్తుండంతో సంజామల తిమ్మనేనిపేట రహదారిలో రాకపోకలు నిలిచిపోయాయి.

ABOUT THE AUTHOR

...view details