Heavy Rains in Hyderabad : సికింద్రాబాద్ పరిధిలోని బోయిన్పల్లి, తిరుమలగిరి, అల్వాల్, మారేడుపల్లి, చిలకలగూడ బేగంపేట్ ప్యారడైజ్ ప్రాంతాల్లో వాన కురుస్తుంది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం ఏకధాటిగా పడుతోంది. వాన కారణంగా రహదారులన్ని జలమయమయ్యాయి. పలుచోట్ల వర్షం దాటికి డ్రైనేజీలు పొంగిపొర్లడంతో పాటు వాహనదారులు ట్రాఫిక్ ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
హైదరాబాద్లో మళ్లీ భారీ వర్షం - వాహనదారులకు తప్పని ట్రాఫిక్ తిప్పలు - Telangana Rains Report - TELANGANA RAINS REPORT
Heavy Rains in Telangana : రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. ప్రధానంగా హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వాన పడటంతో, రోడ్లన్నీ జలమయమయ్యాయి. గత రెండు రోజులుగా సాయంత్రం కురుస్తున్న ఈ వానల ధాటికి వాహనదారులకు ట్రాఫిక్ తిప్పలు తప్పటం లేదు. కాగా రాగల మూడు రోజుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ ఇప్పటికే ప్రకటించింది.
Published : May 19, 2024, 4:44 PM IST
Telangana Weather Report Today :రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈరోజు మాత్రం కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతోపాటు గంటకు 30 నుంచి 40కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.
నైరుతి ఋతుపవనాలు ఈ రోజు మాల్దీవుల్లో కొంతవరకు, కోమరిన్ ప్రాంతంలో కొంత వరకు, దక్షిణ బంగాళాఖాతం, నికోబార్ దీవులు, దక్షిణ అండమాన్ సముద్రంలోని కొన్ని ప్రాంతాల వరకు విస్తరించాయని వాతావరణ కేంద్రం సంచాలకులు వివరించారు. దక్షిణ ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ, రాయలసీమ మీదుగా దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు సగటు సముద్ర మట్టానికి 3.1 కి.మీ ఎత్తులో కొనసాగిన ఆవర్తనం ఇవాళ బలహీన పడిందని పేర్కొన్నారు.