Heavy Rains in Hyderabad Due to Southwest Monsoon : హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. సాయంత్రం కమ్ముకున్న మేఘాలకు తోడు ఈదురుగాలులు, ఉరుములతో పలు ప్రాంతాల్లో వర్షం ప్రారంభయింది. బషీర్ బాగ్, నాంపల్లి, అబిడ్స్, లిబర్టీ, హిమాయత్ నగర్, నారాయణగూడ, ట్యాంక్‌బండ్, పంజాగుట్ట, మేడ్చల్, కండ్లకోయ, కృష్ణాపూర్, దుండిగల్, గండి మైసమ్మ, గచ్చిబౌలి, పాతబస్తీ చార్మినార్ చాంద్రాయణగుట్ట, కోండాపుర్, లింగంపల్లి, బహదూర్పురా, మియాపూర్, ఫలక్ నుమ, బార్కస్, ఉప్పుగూడ, ఎల్బీనగర్, అబ్దుల్లాపూర్ మేట్, శేరిలింగంపల్లి నియోజకవర్గం పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. కూకట్ పల్లి, కేపీహెచ్‌బీ, నిజం పేట్, బాచుపల్లి, జగద్గిరిగుట్ట, బోరబండలలో ఉరుములతో కూడిన భారీ వర్షం పడింది. వర్షంతో వాహనదారులు తడిసిముద్దయ్యారు. వేడిమి ఉక్కపోతతో అల్లాడిన ప్రజలు కాసేపు ఉపసమనం పొందారు.
Hyderabad Rains: సాయంత్రం వేళ భాగ్యనగరంలో వర్షం పడడంతో పనికి వెళ్లిన ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్లే ఉద్యోగులు, వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. హైదరాబాద్‌లో కురిసిన వర్షానికి మాదాపూర్‌లో వాహన రాకపోకలు స్తంభించిపోయాయి. వర్షం కారణంగా సుమారు గంటసేపు వాహనాలు నిలిచిపోయాయి. జూబ్లీహిల్స్ నుంచి హైటెక్ సిటీ వెళ్లే మార్గంలో అధికంగా ట్రాఫిక్ జామ్ ఉంది.
Heavy Traffic in Hyderabad : మాదాపుర్ మైండ్ స్పేస్ సర్కిల్ నుంచి ఐకియా గచ్చిబౌలి బయోడైవర్సిటి మార్గంలో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. జూబ్లీహిల్స్ నుంచి మాదాపూర్ మార్గంల ట్రాఫిక్ జామ్ అధికంగా ఉంది. భారీ వర్షం కారణంగా రోడ్లపై వరద నీరు ఎక్కువగా చేరింది. హైటెక్ సిటీ శిల్పారామం వద్ద రహదారిపై వర్షపు నీరు నిలిచిపోయింది. శ్రీకృష్ణనగర్‌లో మ్యాన్ హోళ్లు పొంగుతున్నాయి. పలుచోట్ల నాలాలు పొంగడంతో రహదారిపై వరద నీరు ప్రవహిస్తోంది. జీహెచ్ఎంసీ సిబ్బంది వర్షపు నీటిని తొలగిస్తున్నారు. పోలీసులు సిబ్బందితో కలిసి ట్రాఫిక్ క్రమబద్ధీకరిస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలోని షాబాద్ మండలంలో పిడుగుపాటుతో ఓ వ్యక్తి మరణించాడు.