Heavy Rain Again in Hyderabad : హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో వర్షం పడింది. ఓ మోస్తరు కురిసిన వానతో నగర వాసులు తడిసి ముద్దయ్యారు. ఈదురు గాలులతో కురిసిన వర్షానికి వివిధ పనులపై బయటకు వచ్చిన వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నగరంలోని బేగంబజార్, కోఠి, సుల్తాన్ బజార్, అబిడ్స్, నాంపల్లి, బషీర్‌బాగ్, లిబర్టీ, హిమాయత్ నగర్, లక్డీకాపుల్, ఖైరతాబాద్‌లో తదితర ప్రాంతాల్లో రహదారులు నీరు చేరింది.
రోడ్లపై వాన నీరుతో వాహనదారులు, బాటసారులు ఇబ్బందులు పడ్డారు. మరోవైపు కూకట్‌పల్లి, కె.పి.హెచ్.బి కాలనీ, హైదర్ నగర్, మూసాపేట పరిసర ప్రాంతాలలో జోరుగా వర్షం పడింది. మేడ్చల్ జిల్లాలోని మేడ్చల్, కృష్ణాపూర్, కండ్లకోయ, దుండిగల్ , గండిమైసమ్మ, పరిసర ప్రాంతాలలో ఉరుములు, మెరుపులతో వాన ముంచెత్తింది. దీంతో లోతట్టు ప్రాంతాలకు భారీగా వరద నీరు వచ్చి చేరింది.
GHMC Teams Alert on Heavy Rains : మరోవైపు జీహెచ్ఎంసీ అధికారులు సైతం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీచేశారు. పట్టణ వాసులు వానలు పడుతున్న సమయంలో అత్యవసరం అయితే బయటకు రావొద్దని సూచించారు. వాహనదారులు రోడ్లపై భారీగా నీళ్లు చేరడంతో జాగ్రత్తగా వెళ్లాలని సూచించారు. ఈ నేపథ్యంలో సమస్యలపై సంప్రదించేందుకు 040 21111111, 9000113667 నెంబర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.