People Suffered Many Problems due to Heavy Rains :రాజధాని హైదరాబాద్ మహానగరంలో చినుకు పడితే చాలు చిత్తడే. అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి. డ్రైనేజీలు జలమయంగా మారి చిన్నపాటి వాగుల్లా పొంగిపొర్లుతున్నాయి. హైదరాబాద్‌లో ఇవాళ ఉదయం కురిసిన భారీ వానకు నగరం తడిసిముద్దయింది. కురిసింది కొద్ది గంటలే అయినా ప్రజల్ని నానా ఇబ్బందులు పెట్టింది. రోడ్లపై నీరు చేరడంతో వాహనదారులు తెగ ఇబ్బందులు పడ్డారు.
బడికి వెళ్లాలంటే - అమ్మా నన్నెత్తుకో (ETV Bharat) మరోవైపు విద్యార్థులు స్కూళ్లకు వెళ్లలేని పరిస్థితి ఎదురైంది. దీంతో చిన్నారులను బడులకు పంపేందుకు వారి తల్లిదండ్రులు ఆపోసోపాలు పడ్డారు. ఈ క్రమంలోనే యూసఫ్‌గూడ శ్రీ కృష్ణానగర్‌లో కొన్ని సంఘటనలు ఈటీవీ భారత్ కెమెరాకు చిక్కాయి. తమ పిల్లలను వరదలో తడవకుండా ఎత్తుకెళ్లిన దృశ్యాలు కనిపించాయి. కాసేపు దంచికొట్టిన వానతో నగరం అస్తవ్యస్తమైంది.
వరద నీటిలో సైకిల్‌పై రయ్ రయ్ (ETV Bharat) చిన్నారిని ఎత్తుకొని బడికి తీసుకెళ్తున్న తండ్రి (ETV Bharat) Hyderabad Rains Today : సికింద్రాబాద్‌లోనూ పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. రైల్వే స్టేషన్ చిలకలగూడ ప్యాట్నీ ప్యారడైజ్ బేగంపేట్ మారేడుపల్లి ప్రాంతాలలో వర్షం పడింది. అలానే కోఠి, సుల్తాన్ బజార్, అబిడ్స్, నాంపల్లి, బషీర్ బాగ్, లకిడికపుల్, ఖైరతాబాద్ హిమాయత్ నగర్, నారాయణ గూడ తదితర ప్రాంతాల్లో కూడా వర్షం భారీగా కురిసింది.
మ్యాన్‌హోల్ నుంచి పొంగుతున్న వర్షపు నీరు (ETV Bharat) ఉదయం కురిసిన వర్షానికి నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయ్యింది. ట్యాంక్ బండ్, తెలుగు తల్లి ఫ్లై ఓవర్, లక్డీకాపుల్, రవీంద్రభారతి పరిసరాల్లో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రాత్రి కురిసిన వర్షానికి రోడ్డుపై వర్షపు నీరు నిలిచింది. ట్రాఫిక్ జామ్‌తో వివిధ పనులపై వెళ్లిన ప్రభుత్వ, ప్రవేటు ఉద్యోగులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నిదానంగా వాహనాలు కదులుతున్నాయి.
వాగుల్లా మారిన నగరపు రోడ్లు (ETV Bharat)