Heavy Rainfall in Hyderabad :హైదరాబాద్‌ను మరోసారి భారీ వర్షం కుదిపేసింది. ఉదయం నుంచి ఆశామంతా మేఘావృతమై ఉండగా ఒక్కసారిగా వర్షం పడడంతో రోడ్లన్ని జలమయమయ్యాయి. బంజారాహిల్స్, అమీర్‌పేట్, సనత్‌నగర్, మియాపూర్ చందానగర్, మాదాపూర్ గచ్చిబౌలి, రాయదుర్గం, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో బోరబండ, మధురానగర్, పంజాగుట్ట, ఖైరతాబాద్ జగద్గిరిగుట్ట, షాపూర్‌నగర్, జీడిమెట్ల ప్రాంతాల్లో వాన పడుతుంది.
హైదరాబాద్‌లోని మళ్లీ వర్షం - ప్రధాన ప్రాంతాల్లో దంచి కొడుతున్న వాన - Heavy Rainfall in Hyderabad - HEAVY RAINFALL IN HYDERABAD
Heavy Rain in Hyderabad : హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తోంది. ఉదయం నుంచి మేఘావృత్తమై ఉన్న వాతావరణం ఇప్పుడు వాన పడుతోంది. ప్రధాన ప్రాంతాలైన కోఠీ, అబిడ్స్, బంజారాహిల్స్, అమీర్‌పేట్, సనత్‌నగర్, మియాపూర్ చందానగర్, మాదాపూర్ గచ్చిబౌలి, రాయదుర్గం, జూబ్లీహిల్స్ వర్షం దంచి కొడుతుంది.
Published : Sep 8, 2024, 3:45 PM IST
వర్షం కురవడంతోనే జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. ట్రాఫిక్ సమస్యలు రాకుండా, రోడ్లపై నీరు నిలవకుండా తగిన చర్యలు చేపట్టారు. ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్‌రోడ్, చిక్కడపల్లి ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. నాంపల్లి, కోఠి, అబిడ్స్, బషీర్‌బాగ్, ఖైరతాబాద్, లక్డీకాపుల్, హిమాయత్‌నగర్, నారాయణగూడా, చైతన్యపూరి, దిల్‌సుఖ్‌నగర్ తదితర ప్రాంతాల్లో వర్షం దంచికొడుతుంది.
అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. అల్పపీడనం వాయువ్య పరిసర మధ్య బంగాళాఖాతంలో ప్రస్ఫుటమైన అల్పపీడన ప్రాంతంగా ఏర్పడినట్లు ఐఎండీ సంచాలకులు తెలిపారు. ఇది ఉత్తర దిశగా కదులుతూ బలపడి ఉత్తర ఒడిశా, పశ్చిమ బంగాల్ తీరంలోని వాయువ్య బంగాళాఖాతం వద్ద ఆదివారం వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది. తరువాత ఇది పశ్చిమ, వాయువ్య దిశగా కదులుతూ వచ్చే 3 రోజుల్లో గంగేటిక్ పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా, ఝార్ఖండ్, ఉత్తర ఛత్తీస్‌గఢ్ మీదుగా కొనసాగే అవకాశం ఉన్నట్లు ప్రకటించింది.