ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

LIVE UPDATES : వరద నీరు తగ్గింది - పుకార్లు నమ్మవద్దని ప్రజలను కోరుతున్నాం: సీఎం చంద్రబాబు - AP Rains Live Updates - AP RAINS LIVE UPDATES

AP Rains Live Updates
AP Rains Live Updates (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 4, 2024, 7:15 AM IST

Updated : Sep 4, 2024, 10:50 PM IST

Heavy Rains in Andhra Pradesh Today : ఆంధ్రప్రదేశ్​లో వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చాలా ప్రాంతాల్లోని ప్రజలు వరద గుప్పిట్లో చిక్కుకుని బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వరద సహాయక చర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. మంత్రులు, అధికారులకు సలహాలు, సూచనలు చేస్తున్నారు. మరోవైపు ఎన్డీఆర్​ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయ చర్యలను ముమ్మరం చేశారు. బాధితులకు ఆహారం, తాగునీరు అందిస్తున్నారు. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

LIVE FEED

10:49 PM, 4 Sep 2024 (IST)

  • కష్టాల్లో ఉన్నప్పుడు మానవత్వం చాటుకోవాల్సి ఉంది: సీఎం చంద్రబాబు
  • బురదలోనూ ఉన్నతాధికారులు బాగా పనిచేశారు: సీఎం చంద్రబాబు
  • ఆహారం, తాగునీటి సరఫరాలో ఉద్యోగులు చిత్తశుద్ధితో పనిచేశారు: సీఎం
  • త్వరగా పాడయ్యే ఆహారాన్ని తేవద్దని కోరుతున్నాం: సీఎం చంద్రబాబు
  • నిల్వ ఉన్న ఆహారం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి: సీఎం చంద్రబాబు
  • పాడవని ఆహార పదార్థాలు ఇవ్వాలని దాతలకు విజ్ఞప్తి: సీఎం చంద్రబాబు
  • పది రోజుల్లో బీమా క్లెయిం చేయాలని కోరాం: సీఎం చంద్రబాబు
  • వరద బాధితులందరికీ నిత్యావసరాలు అందిస్తాం: సీఎం చంద్రబాబు
  • గతంలో వరదలు వచ్చినప్పుడు జగన్‌ పట్టించుకున్నారా..: సీఎం చంద్రబాబు
  • నేను వెళ్లాను కనుకే అధికారులు వేగంగా స్పందించారు: సీఎం చంద్రబాబు
  • వాగుకు, నదికి తేడా తెలియని వ్యక్తి.. జగన్‌: సీఎం చంద్రబాబు
  • బుడమేరు ఎక్కడ ఉంది.. నా ఇల్లు ఎక్కడ ఉంది..: సీఎం చంద్రబాబు
  • జగన్ లాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండటం మన దురదృష్టం: సీఎం చంద్రబాబు
  • విలాసంగా బతికేవారికి ప్రజల కష్టాలు తెలియవు: సీఎం చంద్రబాబు

10:29 PM, 4 Sep 2024 (IST)

  • వరద ప్రాంతాల్లో రేపు నిత్యావసరాలు పంపిణీ చేస్తాం: సీఎం
  • ఒక్కో ఇంటికి 25 కిలోల బియ్యం, లీటర్ పామాయిల్‌, కిలో పప్పు ఇస్తాం: సీఎం
  • కిలో చక్కెర, 2 కిలోల బంగాళాదుంపలు, 2 కిలోల ఉల్లిపాయలు ఇస్తాం: సీఎం
  • వరద ప్రాంతాల్లో తాగునీటి ట్యాంకర్లు సరఫరా చేస్తున్నాం: సీఎం
  • రేపు సాయంత్రానికి విద్యుత్ సరఫరా పూర్తిగా పునరుద్ధరిస్తాం: సీఎం
  • ఇళ్లు, దుకాణాల వద్ద బురద తొలగించేందుకు సత్వర చర్యలు: సీఎం
  • రేపట్నుంచి చెత్త తొలగింపు వాహనాలు పనిచేస్తాయి: సీఎం
  • రెండు గండ్లు పూడ్చాం.. మరొకటి పూడ్చాల్సి ఉంది..: సీఎం
  • వరదనీరు తగ్గింది.. ఇంకా తగ్గుతుంది..: సీఎం
  • పుకార్లు నమ్మవద్దని ప్రజలను కోరుతున్నాం: సీఎం
  • వరద బాధితులకు వేలమంది ఆర్థిక సాయం చేస్తున్నారు: సీఎం

10:29 PM, 4 Sep 2024 (IST)

  • బ్యాంకర్లు, బీమా కంపెనీలతో మాట్లాడాం: సీఎం
  • ఐఆర్‌డీఏ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌తోనూ మాట్లాడాం: సీఎం
  • వరద ప్రాంతాల్లో వాహనాలు దెబ్బతిన్నాయి: సీఎం
  • బీమా ఉన్న, లేని వాహనాలను విభజిస్తున్నాం: సీఎం
  • వాహనాలకు త్వరగా బీమా సొమ్ము ఇవ్వాలని కోరాం: సీఎం
  • కొన్ని దుకాణాలు పూర్తిగా దెబ్బతిన్నాయి: సీఎం
  • నిబంధనలు సరళతరం చేసి రుణాలు ఇచ్చేలా చేస్తాం: సీఎం
  • కొన్నిచోట్ల గృహోపకరణాలు పూర్తిగా పాడయ్యాయి: సీఎం
  • బాధితులను ఎలా ఆదుకోవాలని దానిపై చర్చిస్తున్నాం: సీఎం
  • వరద బాధితుల రుణాలు రీషెడ్యూల్ చేయాలని కోరాం: సీఎం
  • వరద ప్రాంతాల్లో కష్టపడి పనిచేసిన అధికారులకు అభినందనలు: సీఎం

9:56 PM, 4 Sep 2024 (IST)

  • తెలుగు రాష్ట్రాల్లోని వరద బాధితులకు రామోజీ గ్రూప్ అండ
  • వరద బాధితుల సహాయార్థం రూ.5 కోట్లతో 'ఈనాడు' సహాయ నిధి
  • వరద బాధితులను ఆదుకునేందుకు ప్రజల నుంచి విరాళాలు ఆహ్వానించిన 'ఈనాడు'
  • 'ఈనాడు' రిలీఫ్ ఫండ్‌, యూబీఐ ఖాతా నెంబరు 370602010006658
  • యూబీఐ, సైఫాబాద్ బ్రాంచ్‌, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ UBIN0537063

9:55 PM, 4 Sep 2024 (IST)

  • విజయవాడ: బ్యాంకర్లు, బీమా కంపెనీల ప్రతినిధులతో సీఎం సమావేశం
  • వరదల్లో నష్టపోయిన వారికి సాయం చేసేందుకు బ్యాంకర్లు, బీమా కంపెనీలతో భేటీ
  • వరదల్లో దెబ్బతిన్న వాహనాలకు త్వరగా బీమా ఇచ్చే అంశంపై చర్చించిన సీఎం
  • ఈఎంఐలపై బ్యాంకర్ల నుంచి ఒత్తిడి లేకుండా చూసేందుకు ప్రభుత్వం చర్యలు
  • బీమా కంపెనీలు 10 రోజుల్లో క్లెయిమ్స్ పూర్తి చేయాలని ప్రభుత్వం సూచన
  • వరద బాధితులకు భరోసా కల్పనలో బ్యాంకులు కీలకపాత్ర పోషించాలి: సీఎం
  • ప్రభుత్వం, బ్యాంకులు, కంపెనీలు కలిసి బాధితులకు ఆక్సిజన్‌ అందిద్దాం: సీఎం
  • నిబంధనలు సరళతరం చేసి వరద బాధితులకు రుణాలు ఇవ్వాలి: సీఎం
  • బీమా ఉన్నవారికి, లేనివారికి ఎలా సాయం చేయాలో ఆలోచిస్తున్నాం: సీఎం
  • వరద బాధితులకు వీలైనంత ఎక్కువగా సాయం అందేలా చర్యలు: సీఎం
  • కేంద్రం, ఆర్‌బీఐతో రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు చేస్తోంది: సీఎం

9:35 PM, 4 Sep 2024 (IST)

  • తెలుగు రాష్ట్రాల వరద బాధితులకు సాయి దుర్గ తేజ్‌ విరాళం
  • వరద బాధితులకు రూ.25 లక్షల విరాళం ప్రకటించిన సాయి దుర్గ తేజ్‌
  • రెండు రాష్ట్రాల సీఎంఆర్‌ఎఫ్‌లకు చెరో రూ.10 లక్షల చొప్పున విరాళం
  • విజయవాడలోని అమ్మ ఆశ్రమం, స్వచ్ఛంద సంస్థలకు రూ.5లక్షలు విరాళం

9:20 PM, 4 Sep 2024 (IST)

  • ఏపీ వరద పరిస్థితిపై స్పందించిన ప్రధాని, హోంమంత్రికి ధన్యవాదాలు: సీఎం
  • ఆన్ ద స్పాట్ అసెస్‌మెంట్‌కు కేంద్ర బృందం పర్యటనను స్వాగతిస్తున్నాం: సీఎం
  • కేంద్ర బృందం సిఫారసుల కోసం ఎదురుచూస్తున్నాం: సీఎం చంద్రబాబు
  • కేంద్ర బృందానికి మా ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుంది: సీఎం
  • వరద బాధితులకు సకాలంలో సాయం అందించాలని కేంద్రానికి విజ్ఞప్తి: సీఎం

9:12 PM, 4 Sep 2024 (IST)

  • ఏపీలో వరద పరిస్థితిని కేంద్రం నిశితంగా పరిశీలిస్తోంది: ఎక్స్‌లో అమిత్ షా
  • హోంశాఖ ఆధ్వర్యంలో నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేశాం: అమిత్ షా
  • ఏపీలోని వరద ప్రాంతాలను కేంద్ర బృందం పరిశీలిస్తుంది: అమిత్ షా
  • వరద నిర్వహణ, డ్యామ్‌ల భద్రతను కేంద్ర బృందం అంచనా వేస్తుంది: అమిత్ షా
  • రాష్ట్రంలో పర్యటించాక సాయంపై కేంద్ర బృందం సిఫారసు చేస్తుంది: అమిత్ షా

9:03 PM, 4 Sep 2024 (IST)

  • బుడమేరుకు మళ్లీ వరద అంటూ.. వస్తున్న పుకార్లు నమ్మొద్దు: కలెక్టర్‌ సృజన
  • బుడమేరులో ప్రమాదకరస్థాయిలో నీళ్లు లేవు: కలెక్టర్‌ సృజన
  • బుడమేరుకు మళ్లీ వరద వస్తే సమాచారం ఇస్తాం: కలెక్టర్‌ సృజన
  • ప్రజలు జాగ్రత్తగా సురక్షిత ప్రాంతంలో ఉండాలి: కలెక్టర్‌ సృజన
  • బుడమేరు ప్రాంత ప్రజలకు ప్రస్తుతం ఎలాంటి ప్రమాదం లేదు: కలెక్టర్‌ సృజన

8:51 PM, 4 Sep 2024 (IST)

  • జగన్ జేసీబీలను కూల్చేందుకు వాడితే, చంద్రబాబు ప్రజలను కాపాడేందుకు వాడారు: పయ్యావుల
  • వాగు, వంక, నదికి కూడా జగన్‌కు తేడా తెలియదు: మంత్రి పయ్యావుల కేశవ్‌
  • ఏనాడూ జలవనరుల శాఖ సమీక్ష చేశాడా?: మంత్రి పయ్యావుల కేశవ్‌
  • ఎక్కడ కష్టం ఉంటే అక్కడ రాజకీయలబ్ది పొందేందుకు జగన్‌ చూస్తారు: పయ్యావుల
  • బుడమేరు వరదల పాపం జగన్ దే: మంత్రి పయ్యావుల కేశవ్‌
  • వరద సహాయక చర్యలకు ఆటంకం కలిగిచేందుకే జగన్ పర్యటన: పయ్యావుల
  • జగన్ కొన్ని రోజులు ప్యాలెస్ నుంచి బయటకు రాకుంటే మంచిది: పయ్యావుల
  • 6నెలలు, ఏడాది కాలం జగన్‌ లండన్‌లోనే ఉంటే బాగుంటుంది: పయ్యావుల

8:51 PM, 4 Sep 2024 (IST)

  • వరద ముంపు బాధితులకు ఎంపీ సి.ఎం.రమేష్ విరాళం
  • వరద బాధితులకు రూ.కోటి విరాళం ప్రకటించిన ఎంపీ సీఎం.రమేష్
  • వరద బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వానికి చేయూతగా ఆర్థికసాయం: సీఎం.రమేష్‌

8:50 PM, 4 Sep 2024 (IST)

  • భారీ వర్షాలు, వరదల వల్ల రాష్ట్రవ్యాప్తంగా 32 మంది మృతి: ప్రభుత్వం
  • అత్యధికంగా ఎన్టీఆర్ జిల్లాలో 24 మంది మృతి: ప్రభుత్వం
  • గుంటూరు జిల్లాలో ఏడుగురు, పల్నాడు జిల్లాలో ఒకరు మృతి: ప్రభుత్వం
  • 1.69 లక్షల ఎకరాల్లో పంటలు, 18,424 ఎకరాల్లో ఉద్యాన పంటలు నష్టం: ప్రభుత్వం
  • వరదల వల్ల 2.34 లక్షలమంది రైతులు నష్టపోయారు: ప్రభుత్వం
  • వరదల వల్ల 60 వేల కోళ్లు, 222 పశువులు చనిపోయాయి: ప్రభుత్వం
  • వరదల వల్ల 22 సబ్‌స్టేషన్లు దెబ్బతిన్నాయి: ప్రభుత్వం
  • వరదల వల్ల 3,973 కిలోమీటర్ల రోడ్లు దెబ్బతిన్నాయి: ప్రభుత్వం
  • వరదల వల్ల 78 చెరువులు, కాలువలకు గండ్లు పడ్డాయి: ప్రభుత్వం
  • వరదల వల్ల 6,44, 536 మంది నష్టపోయారు: ప్రభుత్వం
  • 193 శిబిరాల్లో 42,707 మంది ఆశ్రయం పొందుతున్నారు: ప్రభుత్వం
  • వరద ప్రాంతాల్లో 6 హెలికాప్టర్లు, 228 బోట్లు తిరుగుతున్నాయి: ప్రభుత్వం

8:06 PM, 4 Sep 2024 (IST)

  • వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం పిలుపు
  • విరాళాలను ఆన్‌లైన్‌ చెల్లింపుల ద్వారా బ్యాంకు ఖాతాలకు జమ చేయవచ్చు
  • ఎస్‌బీఐ ఖాతా నెంబర్‌ 38588079208కు విరాళాలు పంపవచ్చు
  • సీఎంఆర్‌ఎఫ్‌, ఎస్‌బీఐ బ్రాంచ్‌, ఏపీ సెక్రటేరియట్‌, వెలగపూడి
  • ఎస్‌బీఐ బ్యాంకు ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ SBIN0018884
  • యూబీఐ ఖాతా నెంబర్‌ 110310100029039కు విరాళాలు పంపవచ్చు
  • సీఎంఆర్‌ఎఫ్‌, యూబీఐ బ్రాంచ్‌, ఏపీ సెక్రటేరియట్‌, వెలగపూడి
  • యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ UBIN0830798

7:52 PM, 4 Sep 2024 (IST)

  • వరద బాధితులకు ప్రభుత్వానికి ఇచ్చే విరాళాలకు పన్ను మినహాయింపు
  • విరాళాలకు సీఎస్‌ఆర్‌ కింద పన్ను మినహాయింపు ఉంటుందన్న ప్రభుత్వం
  • విరాళాలు ఇచ్చేవారికి ఫామ్-1 పన్ను మినహాయింపు ధ్రువపత్రాలు: ప్రభుత్వం
  • విరాళాలను యూబీఐ ఖాతా 307911100000061కు పంపవచ్చు: ప్రభుత్వం
  • యూబీఐ, సెక్రటేరియట్‌ బ్రాంచ్‌, వెలగపూడి ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ UBIN0830798
  • చెక్కులు, డీడీలను సీఈవో, స్మార్ట్‌ ఆంధ్రప్రదేశ్‌ ఫౌండేషన్‌ పేరుతో పంపవచ్చని వెల్లడి
విరాళాలు ప్రకటించిన టాలీవుడ్ (ETV Bharat)

7:51 PM, 4 Sep 2024 (IST)

  • ప్రకాశం బ్యారేజ్‌కు వేగంగా తగ్గుతున్న వరద ఉద్ధృతి
  • ప్రకాశం బ్యారేజ్‌కు 3.07 లక్షల క్యూసెక్కుల వరదనీరు
  • బ్యారేజ్‌ నుంచి కాల్వలకు 202 క్యూసెక్కులు విడుదల
  • ప్రకాశం బ్యారేజ్‌ వద్ద 11.5 అడుగుల నీటిమట్టం

7:50 PM, 4 Sep 2024 (IST)

  • వరద బాధితులకు ఒకరోజు వేతనం విరాళం ఇచ్చిన ఏయూ ఉద్యోగులు
  • సీఎం సహాయనిధికి విరాళం ఇచ్చిన ఏయూ ఉద్యోగులు, సిబ్బంది

7:31 PM, 4 Sep 2024 (IST)

  • పులిచింతల ప్రాజెక్టు గేట్లు మూసివేసిన అధికారులు
  • ప్రకాశం బ్యారేజ్‌కు మరింత తగ్గనున్న వరద ప్రవాహం

7:31 PM, 4 Sep 2024 (IST)

  • ఏపీ సీఎం సహాయనిధికి రూ.కోటి విరాళం ప్రకటించిన భారత్ బయోటెక్

7:31 PM, 4 Sep 2024 (IST)

  • వరద బాధితులకు రూ.10 లక్షల విరాళం ఇచ్చిన ఒంగోలు ఎంపీ మాగుంట
  • విరాళం చెక్కును ప్రకాశం జిల్లా కలెక్టర్‌కు అందించిన పార్టీ నేతలు

7:08 PM, 4 Sep 2024 (IST)

  • వరదలో మునిగిన వాహనాలకు బీమా మొత్తం వచ్చేలా ప్రభుత్వం చర్యలు
  • కాసేపట్లో బ్యాంకర్లు, బీమా కంపెనీల ప్రతినిధులతో సీఎం చంద్రబాబు భేటీ
  • వరద ప్రాంతాల్లో పెద్దఎత్తున నీటమునిగిన బైకులు, కార్లు, ఆటోలు
  • లక్షల సంఖ్యలో వాహనాలు నీటమునిగి ఉంటాయని అంచనా
  • వాహనాల మరమ్మతులకే ఒక్కో కుటుంబానికి వేలల్లో ఖర్చవుతుందని అంచనా
  • వరద బాధితులకు భారం తగ్గించేందుకు బీమా కంపెనీలతో సీఎం సంప్రదింపులు
  • బీమా ఉన్న వాహనాలెన్ని.. లేనివెన్ని.. లెక్కలు తీయనున్న ప్రభుత్వం
  • బీమా చెల్లింపుల్లో సాంకేతిక సమస్యలను పక్కనపెట్టాలని కోరనున్న ప్రభుత్వం
  • పరిస్థితి అర్థం చేసుకుని మానవతా దృక్పథంతో వ్యవహరించాలన్న సీఎం

7:08 PM, 4 Sep 2024 (IST)

  • విజయవాడ: రాజరాజేశ్వరిపేటకు వెళ్లిన బొత్సను నిలదీసిన మహిళలు
  • ఇళ్లు మునిగిన 5 రోజుల తర్వాత ఎందుకొచ్చారని ప్రశ్నించిన మహిళలు
  • వరద బాధితులకు ఏం సాయం చేశారని ప్రశ్నించిన మహిళలు
  • మహిళలకు సమాధానం చెప్పలేక వెనుదిరిగిన మాజీమంత్రి బొత్స

6:05 PM, 4 Sep 2024 (IST)

  • వరద బాధితులకు రూ.120 కోట్ల విరాళం ప్రకటించిన ఎన్జీవో ఐకాస నేతలు
  • సీఎం చంద్రబాబును కలిసి రూ.120 కోట్ల విరాళం ప్రకటించిన ఐకాస నేతలు
  • ఒకరోజు వేతనం రూ.120 కోట్ల విరాళం ప్రకటించిన ఎన్జీవో ఐకాస నేతలు
  • ఉద్యోగులు, ఉపాధ్యాయులు పింఛన్ల నుంచి విరాళం ప్రకటించిన నేతలు
  • సీఎం చంద్రబాబుకు అంగీకారపత్రం అందించిన కె.వి.శివారెడ్డి, విద్యాసాగర్

5:59 PM, 4 Sep 2024 (IST)

  • విజయవాడ: సింగ్‌నగర్ ప్రాంతంల్లోని పలు కాలనీల్లో విద్యుత్‌ సరఫరా పునరుద్ధరణ
  • వరద ప్రభావం తగ్గడంతో పలు కాలనీలకు విద్యుత్ సరఫరా పునరుద్ధరణ
  • 3 రోజులుగా విద్యుత్ సరఫరా లేక తీవ్రఇబ్బందులు ఎదుర్కొన్న స్థానికులు
  • విద్యుత్ వైర్లు, లైన్ల పరిస్థితి పరిశీలించాక విద్యుత్‌ పునరుద్ధరించిన సిబ్బంది

5:59 PM, 4 Sep 2024 (IST)

  • విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటన
  • నాలుగో రోజు వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటన

5:58 PM, 4 Sep 2024 (IST)

  • వరదబాధితుల సహాయార్థం తెనాలి డబుల్‌ హార్స్‌ ఫౌండేషన్‌ రూ.10 లక్షలు విరాళం
  • సీఎం సహాయ నిధికి చెక్కు ఇవ్వనున్న తెనాలి డబుల్‌ హార్స్‌ ఫౌండేషన్‌ ట్రస్టీ యజుర్వేద్‌

5:58 PM, 4 Sep 2024 (IST)

  • విజయవాడ వరద బాధితులకు టీడీపీ నేత మన్నవ మోహనకృష్ణ సాయం
  • విజయవాడకు లక్ష వాటర్ బాటిళ్లు పంపిన మన్నవ మోహనకృష్ణ

5:58 PM, 4 Sep 2024 (IST)

  • విజయవాడ: రాజరాజేశ్వరిపేటలో వరద బాధితులను పరామర్శించిన జగన్
  • కేవలం రెండు గంటల్లోనే ముగిసిన జగన్ పర్యటన
  • కాలనీ ప్రధాన రోడ్డుపై 500 మీటర్ల దూరం పర్యటించి వెళ్లిపోయిన జగన్
  • ఇళ్లు మునిగిన ఐదురోజుల తర్వాత ఎందుకొచ్చారని నిలదీసిన బాధితులు
  • వరద సాయం ఏం చేశారని వైసీపీ నేతలను నిలదీసిన బాధితులు
  • బాధితులకు సాయం అందకుండా అడ్డుపడుతున్నారని వైసీపీ నేతలపై ఆగ్రహం

5:13 PM, 4 Sep 2024 (IST)

  • వరద బాధితులకు సాయం చేసేందుకు ముందుకొచ్చిన ఆర్టీసీ కార్మిక పరిషత్‌
  • ఒకరోజు వేతనం విరాళం ఇచ్చేందుకు సిద్ధమన్న ఆర్టీసీ కార్మిక పరిషత్‌
  • మిగతా సంఘాలతో ఏపీపీటీడీ ఎండీ మాట్లాడాలన్న కార్మిక పరిషత్‌ నేతలు
  • సీఎంఆర్‌ఎఫ్‌కు విరాళం ఇచ్చేందుకు అనుమతి కోరిన అధ్యక్షుడు సూరపనేని శేషగిరిరావు

5:00 PM, 4 Sep 2024 (IST)

వారిపై కఠిన చర్యలు: సీపీ

  • వరద బాధితుల నుంచి డబ్బు వసూలు చేస్తే కఠిన చర్యలు: సీపీ
  • పాలు, ఆహారపదార్థాలు ఎక్కువ ధరకు అమ్మితే కేసులు: సీపీ
  • బోట్లు నడిపేవారు డబ్బు తీసుకోకూడదు: సీపీ రాజశేఖర్‌బాబు

4:49 PM, 4 Sep 2024 (IST)

  • ప్రకాశం బ్యారేజ్‌కు తగ్గుతున్న వరద ఉద్ధృతి
  • ప్రకాశం బ్యారేజ్‌ ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 3.43 లక్షల క్యూసెక్కులు
  • ప్రకాశం బ్యారేజ్‌ 70 గేట్లు ఎత్తి నీటి విడుదల
  • బ్యారేజ్‌ నుంచి కాల్వలకు 202 క్యూసెక్కులు విడుదల
  • ప్రకాశం బ్యారేజ్‌ వద్ద 11.5 అడుగుల నీటిమట్టం

4:49 PM, 4 Sep 2024 (IST)

  • గోదావరి నదికి పెరుగుతున్న వరద ప్రవాహం
  • భద్రాచలం వద్ద 44.1 అడుగుల నీటిమట్టం
  • ధవళేశ్వరం వద్ద ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 6.61 లక్షల క్యూసెక్కులు
  • ప్రభావిత 6 జిల్లాల అధికారులను అప్రమత్తం చేసిన విపత్తుల సంస్థ
  • గోదావరి పరివాహకప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: విపత్తుల సంస్థ

4:49 PM, 4 Sep 2024 (IST)

  • విజయవాడ: వరద ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి రామ్‌ప్రసాద్‌రెడ్డి
  • రామలింగేశ్వరనగర్‌లో ఆహార పొట్లాలు, పండ్లు పంపిణీ చేసిన మంత్రి

4:49 PM, 4 Sep 2024 (IST)

  • వ‌ర‌ద‌ బాధితుల‌కు రూ.50 లక్షల విరాళం ఇచ్చిన మేకపాటి రాజమోహన్‌రెడ్డి
  • ఏపీకి రూ.25 లక్షలు, తెలంగాణకు రూ.25 లక్షల విరాళం ఇచ్చిన మేక‌పాటి

4:48 PM, 4 Sep 2024 (IST)

  • బుడమేరు గండి పూడ్చివేత పనులు పర్యవేక్షిస్తున్న మంత్రి లోకేష్
  • క్షేత్రస్థాయిలో ఉన్న మంత్రి నిమ్మలతో మాట్లాడుతున్న మంత్రి లోకేష్‌
  • వివిధ శాఖల సమన్వయంతో యంత్రాలు, సామగ్రి పంపుతున్న లోకేష్
  • సీఎంకు డ్రోన్ లైవ్ వీడియో చూపిస్తూ పనుల పురోగతి వివరించిన లోకేష్
  • ప్రధానంగా 2, 3 వంతెనల వద్ద పడిన గండ్లపై దృష్టిపెట్టామన్న లోకేష్‌
  • ఈ రెండుచోట్ల నుంచే అజిత్‌సింగ్‌నగర్‌లోకి వరదనీరు వస్తోందన్న లోకేష్
    ప్రస్తుతం బుడమేరులో 5 వేల క్యూసెక్కులు ప్రవహిస్తోందన్న లోకేష్‌

4:48 PM, 4 Sep 2024 (IST)

  • కేంద్రమంత్రి అమిత్ షాతో ఫోన్‌లో మాట్లాడా: సీఎం చంద్రబాబు
  • వరద ప్రాంతాల్లో పర్యటించాలని అమిత్‌ షాను కోరా: సీఎం చంద్రబాబు
  • విజయవాడ, అమరావతి.. ముంపుబారిన పడకుండా కార్యాచరణ: సీఎం
  • పడవల్లో తరలించేవాళ్లు డబ్బులు తీసుకుంటే కేసులు పెడతాం: సీఎం
  • నిత్యావసరాలు, కూరగాయలకు ఫిక్స్‌డ్ రేటు పెడతాం: సీఎం చంద్రబాబు
  • ఈ సాయంత్రం లేదా రేపట్నుంచి నిత్యావసరాలు పంపిణీ: సీఎం చంద్రబాబు
  • వివిధ ఉద్యోగసంఘాలు ఒకరోజు జీతం విరాళంగా ఇస్తామన్నారు: సీఎం

4:06 PM, 4 Sep 2024 (IST)

రామ్‌చరణ్‌ ఆర్థిక సాయం

  • తెలుగు రాష్ట్రాల్లోని వరద బాధితులకు రూ.కోటి విరాళం ఇచ్చిన రామ్‌చరణ్‌
  • ఏపీ, తెలంగాణకు రూ.50 లక్షల చొప్పున రామ్‌చరణ్‌ ఆర్థిక సాయం

4:05 PM, 4 Sep 2024 (IST)

  • అమరావతి మునిగిందని దుష్ప్రచారం చేస్తున్నారు: చంద్రబాబు
  • ప్రజలు కష్టాల్లో ఉంటే తప్పుడు ప్రచారం చేస్తారా?: చంద్రబాబు
  • అమరావతి మునిగిందా.. వీళ్లను పూడ్చాలి.. అప్పుడే బుద్ధి వస్తుంది: సీఎం
  • తప్పుడు ప్రచారం చేసేవారిని సంఘ బహిష్కరణ చేయాలి: సీఎం చంద్రబాబు
  • వైసీపీ లాంటి పార్టీకి రాష్ట్రంలో ఉండే అర్హత లేదు: సీఎం చంద్రబాబు
  • బాధితులకు ఏమీ సాయం చేయరు.. పైగా నిందలు.. తప్పుడు ప్రచారం: సీఎం

3:56 PM, 4 Sep 2024 (IST)

మొండితోక జగన్మోహన్‌రావును నిలదీసిన ప్రజలు

  • కంచికచర్లలో నందిగామ మాజీ ఎమ్మెల్యే మొండితోకకు పరాభవం
  • వరద బాధితుల వద్దకు వెళ్లిన మొండితోక జగన్మోహన్‌రావును నిలదీసిన ప్రజలు
  • మూడ్రోజులు పట్టించుకోకుండా ఇప్పుడెందుకు వచ్చారని నిలదీసిన స్థానికులు
  • కంచికచర్ల ఓసీ క్లబ్‌ పునరావాస కేంద్రానికి వచ్చిన వైసీపీ నేత జగన్మోహన్‌రావు
  • కూటమి నేతల ఆధ్వర్యంలో 3 రోజులుగా బాధితులకు ఆహార పానీయాలు
  • మొండితోక జగన్మోహన్‌రావుకు వ్యతిరేకంగా నినాదాలు చేసిన వరద బాధితులు
  • గో బ్యాక్ నినాదాలు చేసిన వరద బాధితులను దూషించిన మొండితోక
  • మొండితోక వాహనానికి అడ్డుపడిన కొందరు వరద బాధితులు

3:30 PM, 4 Sep 2024 (IST)

పవన్ కల్యాణ్‌ భారీ విరాళం

  • వరద బాధితుల కోసం పవన్ కల్యాణ్‌ భారీ విరాళం
  • వరద బాధితులకు వ్యక్తిగతంగా రూ.6 కోట్లు విరాళం ప్రకటించిన పవన్‌
  • రెండు రాష్ట్రాల సీఎంఆర్‌ఎఫ్‌లకు చెరో రూ.కోటి చొప్పున పవన్‌ విరాళం
  • ఏపీలోని 400 పంచాయతీలకు రూ.4 కోట్లు విరాళం ఇచ్చిన పవన్‌
  • ఒక్కో పంచాయతీకి రూ.లక్ష చొప్పున విరాళం ప్రకటించిన పవన్‌

3:19 PM, 4 Sep 2024 (IST)

  • తెలుగు రాష్ట్రాలకు రూ.50 లక్షల చొప్పున అక్కినేని కుటుంబం విరాళం
  • వరద బాధితులు త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నాం: అక్కినేని నాగార్జున

3:19 PM, 4 Sep 2024 (IST)

  • తెలుగు రాష్ట్రాలకు రూ.3 లక్షల చొప్పున నటుడు అలీ విరాళం

2:55 PM, 4 Sep 2024 (IST)

  • వరద బాధితులు అందరికీ న్యాయం చేస్తాం:చంద్రబాబు
  • రేపు ఉదయానికి వరద పూర్తిగా తగ్గిపోతుంది:చంద్రబాబు
  • వైసీపీ నేతలు.. తప్పులు చేసి తిరిగి ఎదురుదాడి చేస్తున్నారు:చంద్రబాబు
  • అమరావతి మునిగిపోయిందని తప్పుడు ప్రచారం సరికాదు:చంద్రబాబు
  • అధికారులను కూడా వరద ప్రాంతాల్లో పనిచేయిస్తున్నాం:చంద్రబాబు
  • అనేకమంది స్వచ్ఛందంగా వచ్చి బురద ప్రాంతాల్లో తిరుగుతున్నారు:చంద్రబాబు
  • విమర్శలు చేసేటప్పుడు ఇంగితజ్ఞానం ఉండాలి..:చంద్రబాబు
  • వైద్యశిబిరాలు ఏర్పాటు చేశాం.. మందులు సరఫరా చేస్తున్నాం..:చంద్రబాబు
  • 7 లక్షలమందికి సరఫరా చేసినప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి:చంద్రబాబు
  • ఇలాంటి విపత్తును నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు:చంద్రబాబు
  • వరద ప్రాంతాల్లో బోట్లకు ఎవరూ డబ్బులు ఇవ్వవద్దు:చంద్రబాబు
  • తక్కువ ధరకే కూరగాయలు అందేలా చూస్తాం:చంద్రబాబు
  • విపత్తు సమయంలో మానవత్వం చూపించాలి:చంద్రబాబు
  • కష్టసమయంలో బాధితులను దోచుకోవడం మంచిదికాదు:చంద్రబాబు
  • నిత్యావసరాలు ఎక్కువ ధరకు అమ్మినవారిని అరెస్టు చేస్తాం:చంద్రబాబు
  • మృతదేహాలు కనిపిస్తే అధికారులకు చెప్పాలని కోరుతున్నాం:చంద్రబాబు
  • పశువుల కళేబరాలు కనిపిస్తే వెంటనే తొలగిస్తాం:చంద్రబాబు

2:48 PM, 4 Sep 2024 (IST)

  • విజయవాడకు బుడమేరు చాలా సమస్యగా తయారైంది:చంద్రబాబు
  • చిన్న చిన్న వాగులన్నీ కలిసి బుడమేరు పెద్దదిగా మారింది:చంద్రబాబు
  • బుడమేరును గత ప్రభుత్వం పట్టించుకోలేదు:చంద్రబాబు
  • అటు కృష్ణా నది, ఇటు బుడమేరు రెండూ కలిసి విజయవాడను ముంచెత్తాయి:చంద్రబాబు
  • గత ఐదేళ్లపాటు ఏం చేశారని వైసీపీ నేతలను ప్రశ్నిస్తున్నాం:చంద్రబాబు
  • వాగులను కబ్జా చేయడమే ఈ దుస్థితికి కారణం:చంద్రబాబు
  • ఆఖరికి పోలవరం కాలవలోనూ మట్టి తవ్వేశారు:చంద్రబాబు
  • బుడమేరు నీరు కొల్లేరు, కృష్ణానదికి వెళ్లేలా చర్యలు తీసుకుంటాం:చంద్రబాబు
  • బుడమేరు ప్రవాహ దారిలో కాలవలు, వాగుల్లో కబ్జాలు తొలగిస్తాం:చంద్రబాబు
  • ఇలాంటి విపత్తులను అందరూ సమష్టిగా ఎదుర్కోవాలి:చంద్రబాబు

2:47 PM, 4 Sep 2024 (IST)

  • సహాయచర్యల్లో 32 మంది ఐఏఎస్‌లు పనిచేస్తున్నారు:సీఎం
  • 179 సచివాలయాలకు 179 మంది సీనియర్‌ అధికారులను ఇన్‌ఛార్జులుగా పెట్టాం:సీఎం
  • నిన్న 9,09,191 ఆహార ప్యాకెట్లు పంపిణీ చేశాం:సీఎం
  • ఇవాళ 6 లక్షల ఆహార ప్యాకెట్లు పంపిణీ చేశాం:సీఎం
  • 8 లక్షల 50 వేల తాగునీటి బాటిళ్లు అందించాం:సీఎం
  • 3 లక్షల లీటర్ల పాలు, 5 లక్షల బిస్కెట్‌ ప్యాకెట్లు అందించాం:సీఎం
  • 5 లక్షలమందికి భోజన ఏర్పాట్లు చేశాం:సీఎం
  • గర్భిణీలకు ప్రత్యేక వైద్యం అందించాలని ఆదేశించాం:సీఎం

2:47 PM, 4 Sep 2024 (IST)

  • వరద తగ్గుముఖం పడుతున్నందున బురద తొలగింపు చర్యలు ప్రారంభమయ్యాయి:సీఎం
  • 2100 మంది పారిశుద్ధ్య సిబ్బందిని ఏర్పాటు చేశాం:సీఎం
  • వందకు పైగాఫైరింజన్లు వచ్చి సహాయచర్యల్లో పాల్గొన్నాయి:సీఎం
  • పొక్లెయినర్లు, టిప్పర్లతో వేస్టేజ్‌ను తరలిస్తున్నాం:సీఎం
  • అపరిశుభ్ర వాతావరణం లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం:సీఎం
  • ఎవరైనా చనిపోతే మృతదేహాలను బంధువులకు అప్పగిస్తున్నాం:సీఎం
  • మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు అందించాలని ఆదేశాలిచ్చాం:సీఎం

2:45 PM, 4 Sep 2024 (IST)

  • సహాయ చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి:సీఎం
  • ప్రజల అభిప్రాయాలు కూడా తీసుకుంటున్నాం:సీఎం
  • ఆహార పదార్థాలు, తాగునీటి బాటిళ్ల పంపిణీ జరుగుతోంది:సీఎం
  • ఎక్కడ ఎలాంటి అవసరమొచ్చినా అండగా ఉంటామని భరోసా ఇస్తున్నాం:సీఎం
  • 62 మెడికల్‌ క్యాంపులు ఏర్పాటు చేశాం:సీఎం
  • బుడమేరు వద్ద గండ్లు పూడిక చర్యలు కొనసాగుతున్నాయి:సీఎం

2:35 PM, 4 Sep 2024 (IST)

  • పంచాయతీరాజ్‌ నుంచి జాయింట్‌ యాక్షన్ కమిటీ లక్షా 64 వేలమంది విరాళమిచ్చారు:పవన్‌ కల్యాణ్‌
  • సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు రూ.14 కోట్లు అందజేస్తున్నారు:పవన్‌ కల్యాణ్‌
  • విరాళమిచ్చిన ఉద్యోగులకు ధన్యవాదాలు తెలుపుతున్నా:పవన్‌ కల్యాణ్‌
  • పంచాయతీరాజ్ ఇంజినీరింగ్‌ విభాగం నుంచి రూ.75 లక్షలు విరాళమిస్తున్నారు:పవన్‌ కల్యాణ్‌

2:33 PM, 4 Sep 2024 (IST)

  • ఈ వరదల్లో దాదాపు 29 మంది చనిపోయారు, ఇద్దరు గల్లంతయ్యారు:పవన్‌ కల్యాణ్‌
  • 200కు పైగా పశువులు మృత్యువాతపడ్డాయి:పవన్‌ కల్యాణ్‌
  • 59,848 కోళ్లు, ఇతర జంతువులు చనిపోయాయి:పవన్‌ కల్యాణ్‌
  • 131 వైద్య శిబిరాలు ఏర్పాటు చేశాం:పవన్‌ కల్యాణ్‌
  • దాదాపు 60 మత్స్యకారుల పడవులు దెబ్బతిన్నాయి:పవన్‌ కల్యాణ్‌
  • 3,312 కి.మీ. మేర రహదారులు దెబ్బతిన్నాయి:పవన్‌ కల్యాణ్‌
  • లక్షా 69 వేల హెక్టార్లలో పంటనష్టం జరిగింది:పవన్‌ కల్యాణ్‌
  • 18,424 హెక్టార్లలో ఉద్యానవన పంట నష్టపోయింది
  • సహాయచర్యల్లో 26 ఎన్డీఆర్‌ఎఫ్‌, 22 ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు
  • నేవీ నుంచి రెండు బృందాలు సహాయచర్యల్లో పాల్గొన్నాయి:పవన్‌ కల్యాణ్‌

2:33 PM, 4 Sep 2024 (IST)

  • బుడమేరు పరివాహక ప్రాంతం దాదాపు 90 శాతం ఆక్రమణలో ఉంది
  • ఆక్రమణలే విజయవాడకు శాపంగా మార్చేశాయి:పవన్‌ కల్యాణ్‌
  • ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఇళ్లు నిర్మించారు:పవన్‌ కల్యాణ్‌
  • విజయవాడ సగం నగరాన్ని వరద నీరు ముంచేసింది:పవన్‌ కల్యాణ్‌
  • ఇప్పుడు హైదరాబాద్‌లో ఆక్రమణలను హైడ్రా కూల్చేస్తోంది:పవన్‌ కల్యాణ్‌
  • 20 ఏళ్లుగా వరదల్లేవు.. నీళ్లు లేవని ఆక్రమించి కట్టేశారు:పవన్‌ కల్యాణ్‌
  • వాగులు, వంకలు వెళ్లే దిశలో నిర్మాణాలు కట్టేశారు:పవన్‌ కల్యాణ్‌
  • ఒక్కరి పని కాదు... దశాబ్దాలుగా ఆక్రమణలు కొనసాగాయి:పవన్‌ కల్యాణ్‌
  • ఇలాంటి సందర్భంలో సీఎం చంద్రబాబు ఎలా చేస్తున్నారో చూస్తున్నాం
  • వెళ్లలేని ప్రదేశాల్లోకి కూడా పొక్లెయినర్లు, ట్రాక్టర్లు ఎక్కి చంద్రబాబు పర్యటిస్తున్నారు
  • సీఎంను అభినందించాల్సిన సమయంలో విమర్శలు మంచిది కాదని వైసీపీకి చెబుతున్నా
  • ఉమ్మడి సమస్యను పరిష్కరించుకోవాల్సిన బాధ్యత అందరిదని వైసీపీని కోరుతున్నా
  • నేను కనబడట్లేదని విమర్శలు చేస్తున్నారు:పవన్‌ కల్యాణ్‌
  • నేను వస్తే సహాయ చర్యలకు ఆటంకమనే రాలేదు:పవన్‌ కల్యాణ్‌
  • ఇంకా విమర్శించాలనుకుంటే భవిష్యత్తులో నాతోపాటు రావచ్చు:పవన్‌ కల్యాణ్‌
  • విమర్శించే వాళ్లు ముందుగా వాళ్లు సాయం చేసి మాట్లాడాలి:పవన్‌ కల్యాణ్‌
  • వైసీపీ నాయకులు ఇళ్లలో కూర్చొని విమర్శలు చేయడం మంచిది కాదు:పవన్‌ కల్యాణ్‌

2:08 PM, 4 Sep 2024 (IST)

  • విపత్తు సమయంలో సహాయ చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయి : పవన్‌ కల్యాణ్‌
  • హెలికాప్టర్లు, డ్రోన్ల ద్వారా బాధితులకు ఆహార పదార్థాలు అందించాం : పవన్‌ కల్యాణ్‌
  • సీఎం చంద్రబాబు అనుభవం ఏంటో ఈ విపత్తు సమయంలో చూస్తున్నాం : పవన్‌ కల్యాణ్‌
  • గతంలో హుద్‌హుద్‌ తుపాను సమయంలోనూ చంద్రబాబు ముందుచూపు చూశాం : పవన్‌ కల్యాణ్‌
  • వరద బాధితుల కోసం రూ.కోటి ప్రకటించా త్వరలోనే సీఎంకు అందజేస్తా : పవన్‌ కల్యాణ్‌
  • ప్రభుత్వాన్ని విమర్శించడం చాలా తేలిక కానీ పని చేసేవాళ్లకే అది తెలుస్తుంది : పవన్‌ కల్యాణ్‌

1:58 PM, 4 Sep 2024 (IST)

సీఎం సహాయనిధికి బీఎస్ఆర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఎండీ శ్రీనివాసరావు రూ.కోటి విరాళం

  • సీఎం సహాయనిధికి బీఎస్ఆర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఎండీ శ్రీనివాసరావు రూ.కోటి విరాళం
  • సీఎం సహాయనిధికి సినీ నిర్మాత అశ్వనీదత్ రూ.25 లక్షలు ఆర్థికసాయం
  • సీఎం సహాయనిధికి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రూ.25 లక్షలు విరాళం

1:57 PM, 4 Sep 2024 (IST)

బుడమేరుకు మళ్లీ క్రమంగా పెరుగుతున్న వరద

  • బుడమేరుకు మళ్లీ క్రమంగా పెరుగుతున్న వరద
  • నిన్న దాదాపు వెయ్యి క్యూసెక్కులే ఉన్న వరద ప్రవాహం
  • ఇవాళ ఎగువ ప్రాంతం నుంచి 8 వేల క్యూసెక్కుల వరద వస్తుందని అంచనా
  • 8,000ల క్యూసెక్కులతో అదనంగా మరో అడుగు పెరగొచ్చని అధికారుల అంచనా
  • గండిపడిన చోట ప్రస్తుతం 3 అడుగులు ఉన్న బుడమేరు బెడ్ లెవల్
  • ఇప్పటికే మొదటి గండి పూడ్చి, మిగతా 2 గండ్లు పూడ్చేలా జరుగుతున్న పనులు
  • పెరుగుతున్న వరద ప్రవాహంతో గండి పూడ్చే పనులకు ఆటంకం
  • దగ్గరుండి పనులు పర్యవేక్షించిన మంత్రులు నారా లోకేశ్, నిమ్మల
  • మళ్లీ ప్రవాహం పెరుగుతుందని స్థానికులను అప్రమత్తం చేస్తున్న అధికారులు
  • మిగిలిన గండ్లు పూడ్చే ప్రక్రియను పర్యవేక్షించాలని నిమ్మలను కోరిన లోకేశ్
  • క్షేత్రస్థాయిలోనే ఉండి పర్యవేక్షించాలని రామానాయుడిని కోరిన లోకేశ్
  • తన బాధ్యత అని లోకేశ్​కు చెప్పిన మంత్రి నిమ్మల రామానాయుడు

1:14 PM, 4 Sep 2024 (IST)

రేపల్లెలో మంత్రులు అనగాని, గొట్టిపాటి రవికుమార్ పర్యటన

  • రేపల్లెలో మంత్రులు అనగాని, గొట్టిపాటి రవికుమార్ పర్యటన
  • రేపల్లె మండలంలోని వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన మంత్రులు
  • పునరావాస కేంద్రాల్లో బాధితులతో మాట్లాడి అండగా ఉంటామని భరోసా
  • భారీ వర్షాలతో ముంపుకు గురైన పొలాలను పరిశీలించిన మంత్రులు

1:13 PM, 4 Sep 2024 (IST)

ఇంటికన్నె-కేసముద్రం మధ్య రైల్వేట్రాక్‌ పునరుద్ధరణ పనులు పూర్తి

  • మహబూబాబాద్ జిల్లాలో రైల్వేట్రాక్‌ పునరుద్ధరణ పనులు పూర్తి
  • ఇంటికన్నె-కేసముద్రం మధ్య రైల్వేట్రాక్‌ పునరుద్ధరణ పనులు పూర్తి
  • అప్‌లైన్‌ మార్గంలో రైల్వేట్రాక్‌ పునరుద్ధరణ పనులు పూర్తి
  • డౌన్‌లైన్‌లో అర్ధరాత్రి కల్లా పనులు పూర్తి: ద.మ.రైల్వే
  • వరదల వల్ల మహబూబాబాద్‌ జిల్లాలో ధ్వంసమైన రైల్వేట్రాక్‌
  • 52 గంటల్లో రైల్వేట్రాక్‌ పునరుద్ధరణ పనులు పూర్తి

1:13 PM, 4 Sep 2024 (IST)

బుడమేరుకు పడిన మొదటి గండిని పూడ్చిన అధికారులు

  • బుడమేరుకు పడిన మొదటి గండిని పూడ్చిన అధికారులు
  • మిగతా గండ్లు పూడ్చాలని అధికారులకు మంత్రులు లోకేశ్, నిమ్మల ఆదేశాలు

1:13 PM, 4 Sep 2024 (IST)

వరద బాధితుల సహాయార్థం అల్లు అర్జున్‌ విరాళం

  • వరద బాధితుల సహాయార్థం అల్లు అర్జున్‌ విరాళం
  • తెలుగు రాష్ట్రాల సీఎంల సహాయనిధికి రూ.50 లక్షల చొప్పున విరాళం

1:12 PM, 4 Sep 2024 (IST)

వరద బాధితుల సహాయార్థం ప్రభాస్‌ భారీ విరాళం

  • వరద బాధితుల సహాయార్థం ప్రభాస్‌ భారీ విరాళం
  • తెలుగు రాష్ట్రాల సీఎంల సహాయనిధికి రూ.కోటి చొప్పున విరాళం

1:11 PM, 4 Sep 2024 (IST)

బుడమేరు గండి పూడ్చే పనులు పరిశీలిస్తున్న మంత్రులు లోకేశ్, నిమ్మల

  • బుడమేరు గండి పూడ్చే పనులు పరిశీలిస్తున్న మంత్రులు లోకేశ్, నిమ్మల
  • రహదారి లేకపోవడంతో బురదలోనే గండిపడిన ప్రాంతానికి వెళ్లిన మంత్రులు
  • బుడమేరుకు విజయవాడ నగరంవైపు 3గండ్లు, అవతలివైపు 4గండ్లు
  • వరద ఉద్ధృతితో సవాల్‌గా మారిన గండ్లు పూడ్చే పనులు
  • ఒక్కో గండి 50మీటర్లకు పైగా ఉండటంతో సవాల్‌గా మారిన పనులు

1:10 PM, 4 Sep 2024 (IST)

విజయవాడలో నాలుగోరోజు ముంపులోనే వరద బాధితులు

  • విజయవాడలో నాలుగోరోజు ముంపులోనే వరద బాధితులు
  • ఉద్ధృతి తగ్గినా దిగువ ప్రాంతాలను వీడని వరద
  • పునరావాస కేంద్రాలకు వేలాది మంది బాధితుల తరలింపు
  • అజిత్‌ సింగ్‌నగర్ ప్రాంతంలో తగ్గుతున్న వరద
  • సహాయచర్యలు ముమ్మరం చేసిన సిబ్బంది
  • ప్రజలకు ఆహారం, తాగునీరు, మందులు అందిస్తున్న ప్రభుత్వం
  • సహాయచర్యల్లో పాల్గొన్న పలు స్వచ్ఛంద సంస్థలు
  • విజయవాడకు వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న పారిశుద్ధ్య కార్మికులు
  • వరద ప్రభావం తగ్గిన ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు చేపడుతున్న కార్మికులు
  • విజయవాడ భవానీపురంలో ఇళ్లలోకి వర్షపు నీరు చేరడంతో ప్రజల ఇబ్బందులు
  • ప్రకాశం బ్యారేజీ నుంచి వరద తగ్గడంతో బయటపడుతున్న లంక గ్రామాలు
  • ఇళ్ల పైనుంచి కిందకు దిగి ఇళ్లు శుభ్రం చేసుకుంటున్న లంక గ్రామస్థులు
  • లంక గ్రామాల చుట్టూ ఇప్పటికీ వరద ప్రవాహం
  • సాయంత్రానికి లంక గ్రామాల చుట్టూ వరద తగ్గే అవకాశం
  • లంక వాసులు, వరద బాధితులకు బోట్ల ద్వారా అల్పాహారం సరఫరా
  • వరద బాధితులకు సహాయం చేస్తున్న స్వచ్ఛంద సంస్థలు
  • వరద బాధితులకు ఆహార పొట్లాలు, తాగునీటి బాటిళ్లు, పండ్లు పంపిణీ
  • దేవీనగర్ వాసులు సురక్షిత ప్రాంతాలకు తరలింపు
  • బుడమేరుకు గండితో సురక్షిత ప్రాంతాలకు బాధితుల తరలింపు
  • నిడమానూరు, ఎనికెపాడు కాల్వ గట్ల ప్రాంతాల వారికి అలర్ట్‌ మెసేజ్‌లు
  • ప్రసాదంపాడులోని కాల్వగట్ల ప్రాంత వాసులకు అలర్ట్‌ మెసేజ్‌లు
  • కాల్వ గట్ల ప్రాంత వాసులు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని ఆదేశాలు
  • బుడమేరు గండితో కాల్వలపై ఉన్న ఇళ్లలోకి నీరు రావచ్చని హెచ్చరిక

12:17 PM, 4 Sep 2024 (IST)

విజయవాడ - హైదరాబాద్ మధ్య రైలు సర్వీసులు పునరుద్ధరణ

  • విజయవాడ - హైదరాబాద్ మధ్య రైలు సర్వీసులు పునరుద్ధరణ
  • కాజీపేట వద్ద ట్రాక్ మరమ్మతులు పూర్తికావడంతో రైలు సర్వీసులు ప్రారంభం
  • వరంగల్ మీదుగా హైదరాబాద్ వెళ్లే రైళ్లను పంపుతున్న అధికారులు
    ట్రయల్ రన్‌గా విజయవాడ నుంచి గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌ను పంపిన అధికారులు
  • గుంటూరు, విజయవాడ, వరంగల్ మీదుగా హైదరాబాద్ వెళ్లనున్న గోల్కొండ ఎక్స్‌ప్రెస్

12:16 PM, 4 Sep 2024 (IST)

వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయచర్యలపై సీఎం టెలీకాన్ఫరెన్స్‌

  • వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయచర్యలపై సీఎం టెలీకాన్ఫరెన్స్‌
  • మంత్రులు, కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం టెలీకాన్ఫరెన్స్
  • విస్తృతంగా చర్యలు చేపట్టి సాధారణ స్థితికి తీసుకొస్తున్నాం: సీఎం
  • ప్రతి ఇంటికి సహాయం అందించాలి: అధికారులతో సీఎం
  • వరదల్లో చనిపోయిన వారిని గుర్తించి వారి కుటుంబాలకు అప్పగించాలి: సీఎం
  • ఎవరూ రాకపోతే ప్రభుత్వం తరఫునే గౌరవంగా అంత్యక్రియలు నిర్వహించాలి: సీఎం
  • మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు పరిహారం ప్రభుత్వం తరఫున అందించాలి: సీఎం
  • ప్రతి కుటుంబానికి 25 కేజీల బియ్యం, లీటర్ పామాయిల్ ఇవ్వాలి: సీఎం
  • 2 కేజీల ఉల్లిపాయలు, 2 కేజీల బంగాళదుంప, కేజీ చక్కెర ఇవ్వాలి: సీఎం
  • మొబైల్ రైతుబజార్లు ఏర్పాటు చేసి తక్కువ ధరకు కూరగాయలు ఇవ్వాలి: సీఎం
  • అంబులెన్స్‌లన్నీ పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచండి: సీఎం
  • జ్వరాల నుంచి జాగ్రత్తలపై కరపత్రాల ద్వారా ప్రజలను చైతన్యపరచండి: సీఎం
  • ప్రతి సచివాలయంలో ఒక మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయాలి: సీఎం
  • ఎవరికి ఏ మెడిసిన్ కావాలన్నా అందుబాటులో ఉంచాలి: సీఎం
  • పంట నష్టంపై అంచనాలు నమోదు చేయండి : సీఎం

12:15 PM, 4 Sep 2024 (IST)

విజయవాడలో సహాయచర్యలు ముమ్మరం చేసిన సిబ్బంది

  • విజయవాడ అజిత్‌ సింగ్‌నగర్ ప్రాంతంలో తగ్గుతున్న వరద
  • సహాయచర్యలు ముమ్మరం చేసిన సిబ్బంది
  • ప్రజలకు ఆహారం, తాగునీరు, మందులు అందిస్తున్న ప్రభుత్వం
  • సహాయచర్యల్లో పాల్గొన్న పలు స్వచ్ఛంద సంస్థలు
  • విజయవాడకు వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న పారిశుద్ధ్య కార్మికులు
  • వరద ప్రభావం తగ్గిన ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు చేపడుతున్న కార్మికులు

12:15 PM, 4 Sep 2024 (IST)

బుడమేరుకు గండిపడిన ప్రాంతం పరిశీలనకు బయల్దేరిన మంత్రి లోకేశ్

  • బుడమేరుకు గండిపడిన ప్రాంతం పరిశీలనకు బయల్దేరిన మంత్రి లోకేశ్
  • మంత్రి లోకేశ్ వెంట మంత్రి నిమ్మల రామానాయుడు, అధికారులు

12:14 PM, 4 Sep 2024 (IST)

శ్రీశైలం జలాశయానికి తగ్గిన వరద, అన్ని గేట్లు మూసివేత

  • శ్రీశైలం జలాశయానికి తగ్గిన వరద, అన్ని గేట్లు మూసివేత
  • శ్రీశైలానికి వరద ప్రవాహం తగ్గడంతో గేట్లన్నీ దించిన అధికారులు
  • ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలానికి 1.43 లక్షల క్యూసెక్కులు
  • శ్రీశైలం జలాశయం గరిష్ఠ నీటిమట్టం 885 అడుగులు
  • శ్రీశైలం జలాశయం ప్రస్తుత నీటిమట్టం 883.50 అడుగులు
  • శ్రీశైలం జలాశయం గరిష్ఠ నీటినిల్వ 215.80 టీఎంసీలు
  • శ్రీశైలం జలాశయం ప్రస్తుత నీటినిల్వ 208.7 టీఎంసీలు
  • కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో ముమ్మరంగా విద్యుదుత్పత్తి
  • విద్యుదుత్పత్తి చేసి 63,953 క్యూసెక్కుల నీరు సాగర్‌కు విడుదల
  • 7వ యూనిట్‌లో సాంకేతిక సమస్య పరిష్కరించినట్లు ఏపీ జెన్‌కో సీఈ కాంతారావు వెల్లడి

12:02 PM, 4 Sep 2024 (IST)

వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకు రావాలని రాష్ట్ర ప్రభుత్వం పిలుపు

  • వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకు రావాలని రాష్ట్ర ప్రభుత్వం పిలుపు
  • స్వచ్ఛందంగా ఆహారం ఇవ్వదలచిన దాతల కోసం ప్రత్యేక పాయింట్‌ ఏర్పాటు
  • విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ప్రత్యేక పాయింట్‌ ఏర్పాటు
  • విరాళాల వివరాలకు ఐఏఎస్‌ మనజీర్‌ను 7906796105ను సంప్రదించవచ్చన్న ప్రభుత్వం
  • విరాళాన్ని ఆన్‌లైన్‌ చెల్లింపుల ద్వారా బ్యాంకు ఖాతాలకు జమచేయవచ్చు
  • ఎస్‌బీఐ ఖాతాకు అయితే సీఎంఆర్‌ఎఫ్‌, ఖాతా సంఖ్య 38588079208
  • ఎస్‌బీఐ బ్రాంచ్‌: ఏపీ సెక్రటేరియట్‌, వెలగపూడి, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ SBIN0018884
  • విరాళాన్ని ఆన్‌లైన్‌ చెల్లింపుల ద్వారా బ్యాంకు ఖాతాలకు జమచేయవచ్చు
  • యూనియన్‌ బ్యాంకు ఖాతాకు అయితే సీఎం రిలీఫ్‌ ఫండ్‌, ఖాతా సంఖ్య: 110310100029039
  • యూనియన్‌ బ్యాంకు బ్రాంచ్‌: ఏపీ సెక్రటేరియట్‌, వెలగపూడి, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ UBIN0830798

11:19 AM, 4 Sep 2024 (IST)

వరద తగ్గుముఖం పడుతున్నందున బురద తొలగింపు చర్యలు: మంత్రి నారాయణ

  • వరద తగ్గుముఖం పడుతున్నందున బురద తొలగింపు చర్యలు: మంత్రి నారాయణ
  • అన్ని డ్రెయినేజీల్లో పూడిక తొలగించేందుకు ఏర్పాట్లు: మంత్రి నారాయణ
  • మరో 6 వేలమందిని అదనంగా వినియోగించుకుని పనులు: మంత్రి నారాయణ
  • అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటూ పనులు సాగుతాయి: మంత్రి నారాయణ
  • వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆహారం, బిస్కెట్లు, పాలు పంపిణీ: మంత్రి నారాయణ
  • దాదాపు 10 లక్షల తాగునీటి బాటిళ్లు, ప్యాకెట్లు పంపిణీ జరిగింది: మంత్రి నారాయణ
  • 5.50 లక్షల ఆహార ప్యాకెట్లు పంపిణీ చేశాం: మంత్రి నారాయణ

11:14 AM, 4 Sep 2024 (IST)

ప్రకాశం బ్యారేజీకి తగ్గుతున్న వరద ఉద్ధృతి

  • ప్రకాశం బ్యారేజీకి తగ్గుతున్న వరద ఉద్ధృతి
  • ప్రకాశం బ్యారేజీ ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 4.17 లక్షల క్యూసెక్కులు
  • ప్రకాశం బ్యారేజీ 70 గేట్లు ఎత్తి నీటి విడుదల
  • బ్యారేజీ నుంచి కాల్వలకు 500 క్యూసెక్కులు విడుదల
  • ప్రకాశం బ్యారేజీ వద్ద 12.4 అడుగుల నీటిమట్టం
  • ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక
  • మధ్యాహ్నం సమయానికి వరద మరింత తగ్గే అవకాశం

11:14 AM, 4 Sep 2024 (IST)

రాజరాజేశ్వరిపేటకు పాలు, తాగునీటి బాటిళ్లు పంపిన మంత్రి గొట్టిపాటి

  • విజయవాడ రాజరాజేశ్వరిపేటకు పాలు, తాగునీటి బాటిళ్లు పంపిన మంత్రి గొట్టిపాటి
  • 5 వేల లీటర్ల పాలు, 10 వేల తాగునీటి బాటిళ్లు అద్దంకి నుంచి పంపిన గొట్టిపాటి రవి

10:29 AM, 4 Sep 2024 (IST)

తెలుగు రాష్ట్రాలకు రూ.10 లక్షలు చొప్పున మాజీ సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ విరాళం

  • తెలుగు రాష్ట్రాలకు రూ.10 లక్షలు చొప్పున మాజీ సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ విరాళం
  • రెండు రాష్ట్రాల రెసిడెంట్‌ కమిషనర్లకు చెక్కులు అందజేసిన జస్టిస్‌ ఎన్వీ రమణ
  • ఒక్కో రాష్ట్రానికి రూ.10 లక్షల చొప్పున జస్టిస్‌ ఎన్వీ రమణ ఆర్థికసాయం
  • కష్ట సమయంలో మనకు చేతనైనంత సాయం చేయాలి : జస్టిస్‌ ఎన్వీ రమణ
  • సమాజం కోసం అందరూ ముందుకొచ్చి ఆదుకోవాలి : జస్టిస్‌ ఎన్వీ రమణ
  • ఇద్దరు సీఎంల నిర్విరామ కృషికి మద్దతుగా నిలుద్దాం: జస్టిస్‌ ఎన్వీ రమణ
  • కష్టాల్లో ఉన్న తెలుగు ప్రజలను ఆదుకోవాలని చేతులు జోడించి ప్రార్థిస్తున్నా : జస్టిస్‌ ఎన్వీ రమణ

10:29 AM, 4 Sep 2024 (IST)

భవానీపురంలో ఇళ్లలోకి వర్షపు నీరు చేరడంతో ప్రజల ఇబ్బందులు

  • విజయవాడ భవానీపురంలో ఇళ్లలోకి వర్షపు నీరు చేరడంతో ప్రజల ఇబ్బందులు

10:28 AM, 4 Sep 2024 (IST)

ఏలూరు జిల్లాలో ఉగ్రరూపం దాల్చిన కొల్లేరు

  • ఏలూరు జిల్లాలో ఉగ్రరూపం దాల్చిన కొల్లేరు
  • మండవల్లి మండలం పెదఎడ్లగాడి, చినఎడ్లగాడి వద్ధ కొల్లేరు ఉద్ధృతి
  • బుడమేరు, మున్నేరు, తమ్మిలేరు నుంచి కొల్లేరుకు భారీగా వరద
  • కైకలూరు-ఏలూరు ప్రధాన జాతీయ రహదారిపై నుంచి కొల్లేరు ప్రవాహం
  • కొల్లేరు ఉద్ధృతితో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు
  • ఇప్పటికే ముంపు బారిన పడిన మండవల్లి మండలంలోని లంక గ్రామాలు
  • ఇవాళ సాయంత్రానికి కొల్లేరు ఉద్ధృతి మరింత పెరిగే అవకాశం
  • లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసుల సూచన
  • అత్యవసరమైతే తప్ప ఏలూరు-కైకలూరు రహదారిపైకి వెళ్లొద్దని సూచనలు

10:28 AM, 4 Sep 2024 (IST)

కోరంగి జాతీయ రహదారిపై కూలిన చెట్టు

  • కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం కోరంగి జాతీయ రహదారిపై కూలిన చెట్టు
  • చెట్టు కూలి కాకినాడ-అమలాపురం మార్గంలో కొద్దిసేపు నిలిచిన రాకపోకలు

10:27 AM, 4 Sep 2024 (IST)

గంపలగూడెం మండలంలో ఉద్ధృతంగా కట్టలేరు

  • ఎన్టీఆర్‌ జిల్లా గంపలగూడెం మండలంలో మళ్లీ కట్టలేరు ఉద్ధృతి
  • వర్షానికి వినగడప వంతెన వద్ద 5 రోజులుగా నిలిచిన రాకపోకలు

10:26 AM, 4 Sep 2024 (IST)

వీరులపాడు మండలంలో ఏనుగుగడ్డ వాగు ఉద్ధృతి

  • ఎన్టీఆర్‌ జిల్లాలోని కంచికచర్ల మండలం గండేపల్లి శివారులో రహదారిపై వరద ప్రవాహం
  • వీరులపాడు మండలంలో ఏనుగుగడ్డ వాగు ఉద్ధృతి
  • జుజ్జూరు - రంగాపురం మధ్య ఉద్ధృతంగా ప్రవహిస్తున్న ఏనుగుగడ్డ వాగు

9:46 AM, 4 Sep 2024 (IST)

ఇవాళ్టి రేపల్లె పర్యటన రద్దుచేసుకున్న సీఎం చంద్రబాబు

  • ఇవాళ్టి రేపల్లె పర్యటన రద్దుచేసుకున్న సీఎం చంద్రబాబు
  • వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో పర్యటన రద్దు
  • ముఖ్యమంత్రి చంద్రబాబు ఏరియల్ సర్వే, రేపల్లె పర్యటన రద్దు
  • ఆహార పంపిణీ, పారిశుద్ధ్యంపై కలెక్టరేట్‌లో ఉదయం నుంచి సీఎం సమీక్ష
  • పారిశుద్ధ్య పనులు, వైద్యసాయాన్ని సమర్థంగా నిర్వహించాలన్న సీఎం
  • వీధుల్లో, ఇళ్లలో బురద తొలగింపునకు పనిచేయాలని సీఎం ఆదేశం

9:45 AM, 4 Sep 2024 (IST)

ఎ.కొండూరు మండలంలో మళ్లీ పెరుగుతున్న వరద

  • ఎన్టీఆర్‌ జిల్లాలోని ఎ.కొండూరు మండలంలో మళ్లీ పెరుగుతున్న వరద
  • కంభంపాడు-గొల్లమంద మధ్య వాగులో వరద ప్రవాహం, రాకపోకలకు అంతరాయం

9:29 AM, 4 Sep 2024 (IST)

తెలుగురాష్ట్రాల సీఎంల సహాయనిధికి చిరంజీవి విరాళం

  • తెలుగురాష్ట్రాల సీఎంల సహాయనిధికి చిరంజీవి విరాళం
  • రూ.50 లక్షల చొప్పున విరాళం ప్రకటించిన చిరంజీవి
  • వరదల వల్ల ప్రజల బాధలు కలచివేస్తున్నాయి: చిరంజీవి
  • పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోవడం విషాదకరం: చిరంజీవి
  • విపత్కర పరిస్థితులు త్వరగా తొలగిపోవాలి: చిరంజీవి
  • ప్రజలంతా సురక్షితంగా ఉండాలని ప్రార్థిస్తున్నా: చిరంజీవి

9:28 AM, 4 Sep 2024 (IST)

ప్రకాశం బ్యారేజీకి తగ్గుతున్న వరద ఉద్ధృతి

  • ప్రకాశం బ్యారేజీకి తగ్గుతున్న వరద ఉద్ధృతి
  • ప్రకాశం బ్యారేజీ ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 4.34 లక్షల క్యూసెక్కులు
  • ప్రకాశం బ్యారేజీ 70 గేట్లు ఎత్తి నీటి విడుదల
  • బ్యారేజీ నుంచి కాల్వలకు 500 క్యూసెక్కులు విడుదల
  • ప్రకాశం బ్యారేజీ వద్ద 12.7 అడుగుల నీటిమట్టం
  • ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక
  • మధ్యాహ్నం సమయానికి వరద మరింత తగ్గే అవకాశం

8:58 AM, 4 Sep 2024 (IST)

ఇంటికన్నె-కేసముద్రం మార్గంలో కొనసాగుతున్న రైల్వేట్రాక్ పనులు

  • మహబూబాబాద్‌ జిల్లాలో శరవేగంగా రైల్వేట్రాక్ పునరుద్ధరణ పనులు
  • ఇంటికన్నె-కేసముద్రం మార్గంలో కొనసాగుతున్న రైల్వేట్రాక్ పనులు
  • కాసేపట్లో అప్‌లైన్‌లో పూర్తికానున్న రైల్వేట్రాక్ మరమ్మతులు
  • మరమ్మతుల అనంతరం ట్రయల్ రన్ నిర్వహించనున్న అధికారులు
  • ట్రయల్‌ రన్‌ తర్వాత అప్‌లైన్‌లో రైళ్లు అనుమతించనున్న అధికారులు
  • డౌన్‌లైన్‌లో కొనసాగుతున్న రైల్వేట్రాక్ పునరుద్ధరణ పనులు
  • సాయంత్రం వరకు డౌన్‌లైన్ పనులు పూర్తయ్యే అవకాశం
  • డౌన్‌లైన్‌లో ట్రాక్ పనులయ్యాక ట్రయల్ రన్: ద.మ.రైల్వే
  • సాయంత్రంలోపు మరమ్మతులు చేసి రైళ్లు పునరుద్ధరిస్తాం: ద.మ.రైల్వే

8:56 AM, 4 Sep 2024 (IST)

వరద సహాయచర్యలు పర్యవేక్షించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి

  • వర్షంలో వరద సహాయచర్యలు పర్యవేక్షించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి
  • తన కార్యాలయంలో ఆహారం సిద్ధం చేయించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి

8:56 AM, 4 Sep 2024 (IST)

వర్షాలు, వరదల కారణంగా 563 రైళ్లు రద్దు చేసిన ద.మ.రైల్వే

  • వర్షాలు, వరదల కారణంగా 563 రైళ్లు రద్దు చేసిన ద.మ.రైల్వే
  • మరో 185 రైళ్లు దారిమళ్లింపు, 12 రైళ్లు పాక్షిక రద్దు: ద.మ.రైల్వే

8:55 AM, 4 Sep 2024 (IST)

ప్రకాశం బ్యారేజీ వద్ద క్రమంగా తగ్గుతున్న వరద ఉద్ధృతి

  • ప్రకాశం బ్యారేజీ వద్ద క్రమంగా తగ్గుతున్న వరద ఉద్ధృతి
  • ప్రకాశం బ్యారేజీకి ప్రస్తుతం 4,81,694 క్యూసెక్కుల వరద
  • 70 గేట్ల ద్వారా యథాతథంగా నీటిని దిగువకు విడుదల
  • బ్యారేజీ నుంచి కాల్వలకు 500 క్యూసెక్కులు విడుదల
  • రేపటికి మళ్లీ 5.37 లక్షల క్యూసెక్కులు వస్తుందని జలవనరుల శాఖ అంచనా
  • ఈనెల 8 నాటికి వరద ఉద్ధృతి 3 లక్షల క్యూసెక్కులకు తగ్గే అవకాశం

8:55 AM, 4 Sep 2024 (IST)

విజయవాడలో సహాయచర్యలు పర్యవేక్షించిన మంత్రి కొల్లు, ఎంపీ శివనాథ్

  • విజయవాడలో సహాయచర్యలు పర్యవేక్షించిన మంత్రి కొల్లు, ఎంపీ శివనాథ్
  • పాలు, బిస్కెట్లు, తాగునీటి ప్యాకెట్ల పంపిణీ ఏర్పాట్లు చేసిన కొల్లు రవీంద్ర, శివనాథ్‌

8:36 AM, 4 Sep 2024 (IST)

గోదావరికి స్వల్పంగా పెరుగుతున్న వరద

  • గోదావరికి స్వల్పంగా పెరుగుతున్న వరద
  • భద్రాచలం వద్ద 42.2 అడుగుల నీటిమట్టం
  • ధవళేశ్వరం వద్ద ఇన్‌ఫ్లో 3,05,043 క్యూసెక్కులు
  • ధవళేశ్వరం వద్ద ఔట్‌ఫ్లో 3,12,057 లక్షల క్యూసెక్కులు
  • 6 జిల్లాల అధికారులను అప్రమత్తం చేసిన విపత్తుల నిర్వహణ సంస్థ
  • గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన

8:36 AM, 4 Sep 2024 (IST)

కృష్ణానదికి తగ్గుతున్న వరద

  • కృష్ణానదికి తగ్గుతున్న వరద
  • ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక
  • శ్రీశైలం జలాశయం ఇన్‌ఫ్లో 99,614 క్యూసెక్కులు
  • శ్రీశైలం జలాశయం ఔట్‌ఫ్లో 2,02,923 క్యూసెక్కులు
  • నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 2.32 లక్షల క్యూసెక్కులు
  • నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఔట్‌ఫ్లో 2.38 లక్షల క్యూసెక్కులు
  • పులిచింతల ప్రాజెక్టు ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 2.36 లక్షల క్యూసెక్కులు
  • ప్రకాశం బ్యారేజ్ ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 4,81,694 క్యూసెక్కులు

8:35 AM, 4 Sep 2024 (IST)

వరద బాధితులకు కృష్ణా జిల్లా టీడీపీ నాయకుడు వెలగపూడి శంకరబాబు విరాళం

  • వరద బాధితులకు కృష్ణా జిల్లా టీడీపీ నాయకుడు వెలగపూడి శంకరబాబు విరాళం
  • ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టరేట్‌లో సీఎంను కలిసి రూ.10 లక్షలు చెక్కు అందజేత

8:35 AM, 4 Sep 2024 (IST)

గోదావరిలో పెరుగుతున్న వరద

  • గోదావరిలో పెరుగుతున్న వరద
  • ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద 7.6 అడుగుల నీటిమట్టం
  • సముద్రంలోకి 4.64 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల

8:34 AM, 4 Sep 2024 (IST)

శ్రీశైలం జలాశయానికి తగ్గుముఖం పట్టిన వరద

  • శ్రీశైలం జలాశయానికి తగ్గుముఖం పట్టిన వరద
  • శ్రీశైలం జలాశయం 6 గేట్లు ఎత్తి నీటి విడుదల
  • స్పిల్‌వే ద్వారా 1.17 లక్షల క్యూసెక్కులు విడుదల
  • ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలానికి 99,615 క్యూసెక్కుల ప్రవాహం
  • శ్రీశైలం జలాశయం గరిష్ఠ నీటిమట్టం 885 అడుగులు
  • శ్రీశైలం జలాశయం ప్రస్తుత నీటిమట్టం 883.50 అడుగులు
  • శ్రీశైలం జలాశయం గరిష్ఠ నీటినిల్వ 215.80 టీఎంసీలు
  • శ్రీశైలం జలాశయం ప్రస్తుత నీటినిల్వ 208.7 టీఎంసీలు
  • కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో ముమ్మరంగా విద్యుదుత్పత్తి
  • విద్యుదుత్పత్తి చేసి 63,953 క్యూసెక్కులు సాగర్‌కు విడుదల

8:34 AM, 4 Sep 2024 (IST)

కోనసీమ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షం

  • కోనసీమ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షం
  • మండపేట, కొత్తపేట, పి.గన్నవరం నియోజకవర్గంలో జోరు వాన
  • అమలాపురం, రాజోలు నియోజకవర్గాల్లో జోరు వాన
  • రామచంద్రపురం నియోజకవర్గంలో వర్షం

8:34 AM, 4 Sep 2024 (IST)

లైన్‌మెన్‌ కోటేశ్వరరావు కుటుంబానికి పరిహారం

  • వరద సహాయచర్యల్లో మరణించిన లైన్‌మెన్‌ కోటేశ్వరరావు కుటుంబానికి పరిహారం
  • కోటేశ్వరరావు కుటుంబానికి రూ.30 లక్షల పరిహారం ప్రకటించిన సీఎం
  • విద్యుత్‌ శాఖ తరఫున రూ.20 లక్షలు, ప్రభుత్వం నుంచి రూ.10 లక్షలు ఆర్థికసాయం

8:33 AM, 4 Sep 2024 (IST)

ఏలూరు జిల్లా పశ్చిమ ఏజెన్సీలో వర్షాలకు పొంగుతున్న కొండవాగులు

  • ఏలూరు జిల్లా పశ్చిమ ఏజెన్సీలో వర్షాలకు పొంగుతున్న కొండవాగులు
  • బుట్టాయిగూడెం, జీలుగుమిల్లి, పోలవరం మండలాల్లో వాగుల ఉద్ధృతి
  • ఉద్ధృతంగా ప్రవహిస్తున్న పాలచర్లవాగు, అశ్వరావుపేటవాగు, జల్లేరువాగు
  • వాగుల ఉద్ధృతితో ఏజెన్సీ గ్రామాలకు నిలిచిన రాకపోకలు

8:33 AM, 4 Sep 2024 (IST)

బాపట్ల జిల్లా కృష్ణా తీరప్రాంతంలో వర్షాలు

  • బాపట్ల జిల్లా కృష్ణా తీరప్రాంతంలో వర్షాలు
  • మళ్లీ వర్షంతో లంక గ్రామాల్లో ఆందోళనలో ప్రజలు
  • కొల్లూరు, భట్టిప్రోలు, రేపల్లె మండలాల్లో వర్షం
  • వరద తగ్గి ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో మళ్లీ వర్షాలు

8:32 AM, 4 Sep 2024 (IST)

తూర్పు గోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం

  • తూర్పు గోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం
  • రాజానగరం, అనపర్తిలో జోరు వాన
  • రాజమహేంద్రవరం నగరం, గ్రామీణ నియోజకవర్గాల్లో వర్షం
  • కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం నియోజకవర్గాల్లో మోస్తరు వర్షం

7:49 AM, 4 Sep 2024 (IST)

  • ఎన్టీఆర్ జిల్లాలో శాంతించిన పాలేరు, మున్నేరు నదులు
  • జగ్గయ్యపేట నియోజకవర్గంలో 4 వేల ఎకరాల్లో పంటనష్టం
  • జగ్గయ్యపేట మండలం అన్నవరం-బూదాడ మధ్య దెబ్బతిన్న రహదారి
  • వత్సవాయి మండలం ఆలూరుపాడు, వేమవరంలో దెబ్బతిన్న రహదారులు
  • పెనుగంచిప్రోలు మండలం ముచ్చింతల, అనిగండ్లపాడులో దెబ్బతిన్న రోడ్లు

7:37 AM, 4 Sep 2024 (IST)

ప్రకాశం బ్యారేజీకి తగ్గుతున్న వరద ఉద్ధృతి

  • ప్రకాశం బ్యారేజీకి తగ్గుతున్న వరద ఉద్ధృతి
  • ప్రకాశం బ్యారేజీ ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 4.81 లక్షల క్యూసెక్కులు
  • ప్రకాశం బ్యారేజీ వద్ద 13.5 అడుగుల నీటిమట్టం
  • ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక
  • మధ్యాహ్నం సమయానికి వరద మరింత తగ్గే అవకాశం
  • బ్యారేజీ నుంచి వరద తగ్గడంతో బయటపడుతున్న లంక గ్రామాలు
  • ఇళ్ల పైనుంచి కిందకు దిగి ఇళ్లు శుభ్రం చేసుకుంటున్న లంక గ్రామస్థులు
  • లంక గ్రామాల చుట్టూ ఇప్పటికీ వరద ప్రవాహం
  • సాయంత్రానికి లంక గ్రామాల చుట్టూ వరద తగ్గే అవకాశం
  • లంక గ్రామాల్లో ఇంకా పునరుద్ధరించని విద్యుత్ సరఫరా
  • లంక వాసులు, వరద బాధితులకు బోట్ల ద్వారా అల్పాహారం సరఫరా
ప్రకాశం బ్యారేజీకి తగ్గుతున్న వరద ఉద్ధృతి (ETV Bharat)

7:25 AM, 4 Sep 2024 (IST)

సాధారణ ప్రవాహ స్థాయికి చేరిన మున్నేరు

  • ఎన్టీఆర్ జిల్లాలో సాధారణ ప్రవాహ స్థాయికి చేరిన మున్నేరు
  • వరదలతో జిల్లాలో భారీగా పంట నష్టం, దెబ్బతిన్న రహదారులు
  • నందిగామ నియోజకవర్గంలో 13,800 హెక్టార్లలో పంట నష్టం
  • వరి, పత్తి, మిర్చి, పెసర, మినుము పంటలకు నష్టం
  • నందిగామ నియోజకవర్గంలో 30 కి.మీ మేర దెబ్బతిన్న రోడ్లు
వరద ముంపులో పంట పొలాలు (ETV Bharat)

7:25 AM, 4 Sep 2024 (IST)

తిరువూరు నియోజకవర్గంలో భారీగా దెబ్బతిన్న రోడ్లు

  • ఎన్టీఆర్ జిల్లాలోని తిరువూరు నియోజకవర్గంలో భారీగా దెబ్బతిన్న రోడ్లు
  • కట్టలేరు ఉద్ధృతితో అప్రోచ్ రోడ్డుకు గండి, రాకపోకలకు అంతరాయం
  • టేకులపల్లి-గానుగపాడు మార్గంలో వంతెన, రహదారికి గండ్లు
  • కోతకు గురైన తిరువూరు-అక్కపాలెం రహదారి, నిలిచిన రాకపోకలు
లంక గ్రామాల చుట్టూ ఇప్పటికీ వరద ప్రవాహం (ETV Bharat)

7:23 AM, 4 Sep 2024 (IST)

ప్రకాశం బ్యారేజీకి తగ్గుతున్న వరద ఉద్ధృతి

  • ప్రకాశం బ్యారేజీకి తగ్గుతున్న వరద ఉద్ధృతి
  • ప్రకాశం బ్యారేజీ ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 5.50 లక్షల క్యూసెక్కులు
  • ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక
  • విజయవాడలో మోస్తరు వర్షం, సహాయచర్యలకు ఆటంకం
  • విజయవాడలో నాలుగోరోజు ముంపులోనే వరద బాధితులు
  • ఉద్ధృతి తగ్గినా దిగువ ప్రాంతాలను వీడని వరద
  • పునరావాస కేంద్రాలకు వేలాదిమంది బాధితులు తరలింపు
  • వేర్వేరు ప్రాంతాల్లో నిన్న ఒక్కరోజే 12 మృతదేహలు లభ్యం
  • వరద బాధితులకు సహాయం చేస్తున్న స్వచ్ఛంద సంస్థలు
  • వరద బాధితులకు ఆహార పొట్లాలు పంపిణీ
  • ప్రకాశం బ్యారేజ్‌ గేట్ల మరమ్మతులకు ఏర్పాట్లు
  • బ్యారేజీ గేట్లపై ఇంజినీర్లకు ప్రభుత్వ సలహాదారు కన్నయ్యనాయుడు సూచనలు

7:23 AM, 4 Sep 2024 (IST)

  • విజయవాడలోని దేవీనగర్ వాసులు సురక్షిత ప్రాంతాలకు తరలింపు
  • బుడమేరుకు గండితో సురక్షిత ప్రాంతాలకు బాధితుల తరలింపు
  • నిడమానూరు, ఎనికెపాడు కాల్వ గట్ల ప్రాంతాల వారికి అలర్ట్‌ మెసేజ్‌లు
  • ప్రసాదంపాడులోని కాల్వగట్ల ప్రాంత వాసులకు అలర్ట్‌ మెసేజ్‌లు
  • కాల్వ గట్ల ప్రాంత వాసులు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని ఆదేశాలు
  • బుడమేరు గండితో కాల్వలపై ఉన్న ఇళ్లలోకి నీరు రావచ్చని హెచ్చరిక

7:22 AM, 4 Sep 2024 (IST)

  • ఎన్టీఆర్‌ జిల్లాలో వరదల వల్ల 1,80,243 హెక్టార్లలో వరి పంట మునక
  • వరదల వల్ల 17,645 హెక్టార్లలో ఉద్యాన పంటలు నీటమునక
  • భారీ వర్షాల వల్ల 2,851 కి.మీ. మేర దెబ్బతిన్న రహదారులు
  • భారీ వర్షాలకు 221 కి.మీ. మేర దెబ్బతిన్న పంచాయతీ రోడ్లు
  • భారీ వర్షాలు, వరదల వల్ల దెబ్బతిన్న 12 సబ్ స్టేషన్లు
  • వరదల కారణంగా 78 మైనర్ ఇరిగేషన్ చెరువులకు గండ్లు
  • బాధితులకు 6 హెలికాప్టర్ల ద్వారా 4,870 కిలోల ఆహారం పంపిణీ
  • హెలికాప్టర్ల ద్వారా 21 మందిని రక్షించిన అధికారులు
  • భారీ వర్షాలు, వరదలకు 149 పశువులు, 59,848 కోళ్లు మృతి
  • 11,968 పశువులకు వ్యాక్సిన్ ఇచ్చిన అధికారులు

7:21 AM, 4 Sep 2024 (IST)

బుడమేరు దేవీనగర్ దగ్గర గండి

  • విజయవాడ బుడమేరు దేవీనగర్ దగ్గర గండి
  • గండి ప్రభావంతో కాలవ నీరు గట్టుపై ఉన్న ఇళ్లలోకి నీరు వెళ్లే అవకాశం
  • కాలువగట్ల ప్రాంత వాసులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలి అధికారుల విజ్ఞప్తి
  • రామరపాడు, ప్రసాదంపాడు, ఏనికేపాడు, నిడమానూరు ప్రజలు వెళ్లాలని విజ్ఞప్తి

7:19 AM, 4 Sep 2024 (IST)

  • కేంద్రానికి వరద సాయంపై నివేదిక అందిస్తాం: సీఎం చంద్రబాబు
  • విజయవాడకు భవిష్యత్తులో నష్టం జరగకుండా ముందస్తు చర్యలు: సీఎం
  • బుడమేరు నీరు నేరుగా కృష్ణ నదికి వచ్చేలా ఉండే అడ్డంకులు తొలగొస్తాం: సీఎం
  • సచివాలయ సిబ్బంది సహా ఇతర ఉద్యోగుల ద్వారా ఇంటింటికి ఆహారం సరఫరా: సీఎం
  • బాధితులకు ఇచ్చే ఆహారం విసిరేయకుండా గౌరవప్రదంగా చేతికి ఇవ్వాలి: సీఎం
  • బ్యాంకర్లు, ఇన్సూరెన్స్ సంస్థలతో సమావేశం పెడతాం: సీఎం
  • దెబ్బతిన్న వాహనాలకు పరిహారం ఇప్పిస్తాం: సీఎం
  • విద్యుత్ పునరుద్ధరణకు చర్యలు చేపడతాం: సీఎం
  • డ్రోన్ల ద్వారా పంటనష్టం వివరాలు సేకరిస్తాం: సీఎం
  • బురదమయమైన ఇళ్లను శుభ్రం చేసేందుకు ఫైర్ ఇంజిన్లు వాడతాం: సీఎం
  • డ్రోన్ ద్వారా కూడా పారిశుద్ధ్య చర్యలను ముమ్మరం చేశాం: సీఎం
  • అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకుంటాం: సీఎం
  • వరద ప్రాంతాల్లో ఇవాళ వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తాం: సీఎం
  • వరద ప్రభావం క్రమంగా తగ్గుతోంది: సీఎం
  • అన్ని ప్రాంతాలకు వెళ్లి ఆహారం, తాగునీరు పంపిణీ చేస్తాం: సీఎం
  • బుడమేరు వాగును స్ట్రీమ్ లైన్ చేస్తాం: సీఎం
  • ఇకపై బుడమేరు ముంపు రాకుండా చర్యలు తీసుకుంటాం: సీఎం
  • అస్నా తుపాను ఇటు వైపు వచ్చినా అప్రమత్తంగా ఉన్నాం: సీఎం
  • సాయం అందిస్తున్న దాతలందరికీ ధన్యవాదాలు: సీఎం
  • వరద బాధితులు ఆందోళన చెందవద్దు మేం ఉన్నాం : సీఎం

7:18 AM, 4 Sep 2024 (IST)

నేడు రేపల్లె వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటన

  • నేడు రేపల్లె వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటన
  • వరద ముంపు ప్రాంతాలను పరిశీలించనున్న సీఎం
  • విజయవాడలో ఉ.10.30 గంటలకు ఏరియల్ సర్వే చేయనున్న సీఎం
  • విజయవాడ నుంచి రేపల్లె వెళ్లనున్న సీఎం చంద్రబాబు
  • మధ్యాహ్నం తిరిగి విజయవాడ కలెక్టరేట్‌కు చేరుకోనున్న సీఎం

7:17 AM, 4 Sep 2024 (IST)

తుంగభద్ర దిగువ ప్రజలకు వరద హెచ్చరిక జారీ చేసిన అధికారులు

  • ఉదయం 9 తర్వాత తుంగభద్ర నుంచి 50 వేల క్యూసెక్కులకు పైగా విడుదల
  • తుంగభద్ర దిగువ ప్రజలకు వరద హెచ్చరిక జారీ చేసిన అధికారులు
  • తుంగభద్రకు పైనుంచి భారీగా వరదనీరు చేరుతుందన్న డ్యామ్ అధికారులు

7:07 AM, 4 Sep 2024 (IST)

మూడో రోజూ ముంపులోనే విజయవాడ నగరం

  • మూడో రోజూ ముంపులోనే విజయవాడ నగరం
  • బుడమేరు ఉద్ధృతి తగ్గినా వీడని వరద
  • వరద తీవ్రత తగ్గినా నీట మునిగే ఉన్న కాలనీలు
  • విద్యుత్తు, మంచినీరు లేక ఇబ్బంది పడుతున్న నిర్వాసితులు
  • ముమ్మరంగా కొనసాగుతున్న సహాయ, పునరావాస కార్యక్రమాలు
  • సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న సీఎం, మంత్రులు
  • పునరావాస శిబిరాలకు వేల మంది, ఇళ్లు ఖాళీ చేసి ఊళ్లకు పయనం
  • మరో రెండు రోజుల్లో కాలనీల్లో నీరు తొలగవచ్చని అంచనా
ముంపులో విజయవాడ నగరం (ETV Bharat)
Last Updated : Sep 4, 2024, 10:50 PM IST

ABOUT THE AUTHOR

...view details