తెలంగాణ

telangana

ETV Bharat / state

వారం రోజుల్లో గాంధీలో ఐవీఎఫ్​ సేవలు : మంత్రి దామోదర - Damodara Inspections in Gandhi - DAMODARA INSPECTIONS IN GANDHI

Damodara Sudden Inspections in Gandhi Hospital : హైదరాబాద్​లో గాంధీ ఆసుపత్రిలో మంత్రి దామోదర రాజనరసింహ ఆకస్మిక తనిఖీలు చేశారు. ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్యం గురించి ఆరా తీశారు. మందుల కొరతపై అడిగి తెలుసుకున్నారు.

Minister Damodara Sudden Inspections at Gandhi Hospital
Minister Damodara Sudden Inspections at Gandhi Hospital (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Sep 3, 2024, 2:49 PM IST

Updated : Sep 3, 2024, 4:34 PM IST

Minister Damodara Sudden Inspections at Gandhi Hospital :హైదరాబాద్​​ గాంధీ ఆసుపత్రిలో వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఆకస్మిక తనిఖీలు చేశారు. ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలపై మంత్రి ఆరా తీశారు. అనంతరం ఆసుపత్రి యాజమాన్యంతో భేటీ నిర్వహించారు. అందులో గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ రాజకుమారి పాల్గొన్నారు. కారిడార్లలో రోగుల సహాయకులు కింద కూర్చోవడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. రోగుల సహాయకులు కూర్చోవడానికి సీట్లు ఏర్పాటు చేయలని ఆదేశించారు.

గాంధీ ఎనిమిదవ అంతస్తులో ఆపరేషన్ థియేటర్​ : గాంధీ ఆసుపత్రిలో సిబ్బంది, పడకల అందుబాటుపై మంత్రి సమీక్ష నిర్వహించిన ఆయన వారంలో గాంధీలో ఐవీఎఫ్ సేవలు అందుబాటులోకి తేవాలని ఆదేశించారు. 8వ అంతస్తులో ఆపరేషన్​ థియేటర్​గా చేయాలని డాక్టర్ల సూచించినట్లు తెలిపారు. వీటన్నింటికి ప్రభుత్వం రాబోయే కాలంలో సానుకూలంగా స్పందింస్తుందని ఆయన అన్నారు.

వరద ప్రాంతాల్లో రెండోరోజు సీఎం టూర్ - ఆకేరు వాగును పరిశీలించిన రేవంత్ - CM REVANTH VISITS MAHABUBABAD

"ప్రధానంగా ప్రభత్వ ఆసుపత్రి అంటే ప్రజల హాస్పిటల్. అంటే అందరిది అని ప్రతి ఒక్క పౌరుడు, విద్యార్థి సొంతం చేసుకోవాలి. అలా అనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పని చేస్తున్నారు. ఆయన ఆదేశాల మేరకు మేము ఆయన బాటలోనే నడుస్తున్నాం. త్వరలో ఇక్కడ ఐవీఎఫ్​ సెంటర్​ను ప్రారంభిస్తాం." - దామోదర రాజనర్సింహ, వైద్యారోగ్య శాఖ మంత్రి

వరద బాధితుల కోసం కదిలిన ఉద్యోగ జేఏసీ - విరాళంగా రూ.130కోట్లు - TELANGANA EMPLOYEES JAC DONATION

Last Updated : Sep 3, 2024, 4:34 PM IST

ABOUT THE AUTHOR

...view details